Salman Khan: ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశబ్దాలు గడుస్తున్నా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుత నటీనటుల కంటే మోస్ట్ పాపులర్ హీరోగా పేరొందుతున్నారంటే అతిశయోక్తేం కాదు. ఆయన సూపర్‌స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయితే సల్మాన్ సినీ ప్రయాణంలోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. ప్రముఖ రచయిత సలీం ఖాన్ కుమారుడు అయినప్పటికీ.. ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తక్కువ పారితోషకం తీసుకున్నారట. అందుకు ఆయన సెకండ్ ఫిల్మ్ ‘మైనే ప్యార్ కియా’ (ప్రేమ పావురాలు) కోసం తీసుకున్న రెమ్యునరేషనే ఉదాహరణగా చెప్పవచ్చు. 


'మైనే ప్యార్ కియా' చిత్రంలో సీమా పాత్ర పోషించిన నటి పర్వియన్ దస్తూర్.. ఇటీవల బాలీవుడ్ తికానాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్  గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భాగ్యశ్రీ ఈ చిత్రంలో కథానాయికగా నటించినందుకు అత్యధిక పారితోషికం అందుకున్నారని వెల్లడించింది. ఈ సినిమా కోసం ఆమెకు రూ.1,50,000 చెల్లించినట్లు పర్వీన్ పేర్కొంది. తనకు రూ.75వేలు చెల్లించారన్నారు. ఇదే సినిమాకు రూ.31,000 పారితోషికం తీసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ వెల్లడించాడు.


"రాజశ్రీ ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడూ నటీనటులకు పెద్దగా డబ్బు ఇవ్వలేదు. కానీ మా చెక్కులు మాత్రం ఎప్పుడూ సమయానికి ఇంటికి చేరేవి. మేము మా డబ్బును ఎప్పుడూ అడగవలసిన అవసరం లేదు. వారు డబ్బు విషయంలో ఎప్పుడూ మోసం చేయరు. ఇండస్ట్రీలో డబ్బులు ఇవ్వని వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లతోనూ నేను పని చేశాను" అని పర్వియన్ తెలిపారు. "వాళ్ల సెటప్ కూడా చాలా డీసెంట్‌గా ఉండేది. మేకప్ రూమ్, ఫుడ్య.. అలా మేం కోరినవన్నీ ఇచ్చేవారు. బహుశా వారు పెద్ద పే మాస్టర్లు కాదు. అప్పట్లో వారు రూ. 1 వేలు లేదా 2 వేలు మాత్రమే చెల్లించేవారు" అని వ్యాఖ్యానించారు.


సల్మాన్ 1988 'బీవీ హోతో ఐసీ' సినిమాలో సహాయనటుడిగా తెరంగేట్రం చేశారు. అయినప్పటికీ, రొమాంటిక్ మ్యూజికల్ 'మైనే ప్యార్ కియా' సినిమానే ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమాతోనే సల్మాన్, భాగ్యశ్రీతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అంతే కాదు ఈ రోజు వరకు, ఈ జంట చేసే ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని ప్రేక్షకులు ఇష్టపడతారు.


ఇటీవల, సల్మాన్ ఖాన్.. 'మైనే ప్యార్ కియా' కోసం తనకు రూ. 31,000 చెల్లించారని, ఆ తర్వాత దాన్నిరూ. 75,000కి పెంచారని వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే భాగ్యశ్రీతో పోలిస్తే, సల్మాన్ కు చాలా తక్కువ పారితోషికం ఇచ్చినట్లే. కాగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ దాదాపు రూ.100 కోట్లకు మించి తక్కువ ఉండదు. 


'మైనే ప్యార్ కియా' 1989లో విడుదలైంది. ఈ సినిమాలో రీమా లాగూ, మోహ్నిష్ బహ్ల్, అలోక్ నాథ్‌తో పాటు ఇతరులు ప్రధాన పాత్రలు పోషించారు.


Read Also : అందుకే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పా, ఆ హీరోతో గొడవపై స్పందించిన ‘సింహాద్రి’ హీరోయిన్ అంకిత






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial