Maha Veerudu Shows: ప్రేక్షకులకు షాకిచ్చిన శివ కార్తికేయన్ 'మహా వీరుడు' - షోస్ నిలిపివేత!

మడోనే అశ్విన్ తెరకెక్కించిన మహా వీరుడు సినిమా విడుదల ఆగిపోయింది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ కంటెంట్ ఆలస్యం కారణంగా తెలుగు స్టేట్స్ తో పాటు యూఎస్ లోనూ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా క్యాన్సిలైంది

Continues below advertisement

Siva Karthikeyan's Maha Veerudu : కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, స్వయం కృషితో మంచి స్టార్ గా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్..  గతేడాది 'ప్రిన్స్' గా వచ్చి తెలుగు ఆడియెన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'మహా వీరుడు(Maha Veerudu)'పై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. దర్శకుడు మడోనే అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో దీనికి సంబంధించి ఓ షాకింగ్ అప్ డేట్ వచ్చింది. కంటెంట్ డెలివరీలో ఆలస్యం కారణంగా కొన్ని షోస్ క్యాన్సల్ చేశారు.

Continues below advertisement

మొన్నటివరకూ.. 'మహా వీరుడు' విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మేకర్స్ చెప్పినప్పటికీ.. తీరా రిలీజ్ సమయం వచ్చేటప్పటికీ వారు అభిమానులకు షాకిచ్చారు. సినిమా మన తెలుగు రిలీజ్ సహా ఇపుడు యూఎస్ లో తెలుగు, తమిళ రిలీజ్ నిలిచిపోయినట్టు తెలిసింది. ఇందుకు కారణం కంటెంట్ సమయానికి డెలివరీ కాకపోవడమే అని తెలుస్తోంది. ముందుగా ప్లాన్ చేసిన మార్నింగ్ షోస్‌ను రద్దు చేయాల్సి వచ్చినట్లు తెలిసింది. అయితే, ఉదయం 9 గంటలకు ప్రదర్శించాల్సిన షోను 11 గంటలకు వాయిదా వేశారు. ప్రస్తుతం అన్నిచోట్లా షోస్ నడుస్తున్నట్లు సమాచారం అందింది.

Read Also :  Nayakudu 2023 Review: నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?

సినిమాలు ప్లాఫ్ అయితే బాధ్యత నాదే..

విడుదల సందర్బంగా 'మహా వీరుడు' టీం ప్రమోషన్స్ బాగానే చేసింది. అందులో భాగంగా హీరో శివ కార్తికేయన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కథ తనకు ఎంతో నచ్చిందని, ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని చెప్పారు. సినీ ప్రియులను అలరించే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయన్న ఆయన.. ఇటీవల విడుదలైన తన సినిమాలపైనా మాట్లాడారు. తాను నటించిన సినిమాల్లో ఏదైనా ఫ్లాప్ అయితే దాని పూర్తి బాధ్యత తానే వహిస్తానని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే తన సినిమాలు విజయం అందుకుంటే మాత్రం ఆ క్రిడెట్ అంతా అందరికీ చెందుతుందని చెప్పారు. 

'రెమో' సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు శివ కార్తికేయన్. 'డాక్టర్', 'డాన్' వంటి చిత్రాలతోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆయన ఈ మధ్య కాలంలో నటించిన ప్రిన్ అనే డైరెక్ట్ తెలుగు సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంటోన్న ఈ హీరో.. ఈ సినిమాతో హిట్ కొట్టి.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారా లేదంటే... మూవీపై ఇప్పటివరకు నెలకొన్న అంచనాలు తారుమారు అవుతాయా అన్నది వేచి చూడాలి.

Read Alsoకమల్ హాసన్, నషిరుద్దిన్ షా కామెంట్స్‌పై ఎట్టకేలకు స్పందించిన అదా శర్మ - సక్సెస్‌ను ఆపలేరు!

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement