'ది కేరళ స్టోరీ'. రీసెంట్ టైమ్స్ లో ఎన్నో వివాదాలు నడుమ థియేటర్స్ లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ఇది. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్ ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించింది. యోగితా బిహాని, సిద్ధి ఇద్నాని, సోనియా బలని ఇతర కీలక పాత్రలు నటించారు. కేరళలో అమాయకులైన అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసే వారిని ఐఎస్ఐ క్యాంపులో పంపించి దేశ వ్యతిరేకులుగా మార్చాలనే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. దీంతో ఈ సినిమాకు రాజకీయపరంగా కూడా ఎంతో వ్యతిరేకత ఎదురైంది. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాని బ్యాన్ చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాతో హీరోయిన్ ఆదాశర్మ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కాగా ఈ సినిమాపై ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాంటి వారిలో తమిళ సీనియర్ నటుడు కమలహాసన్, బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా సైతం ఉన్నారు. అయితే తాజాగా హీరోయిన్ ఆదాశర్మ సినీ ప్రముఖులు సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేరళ స్టోరీ భారీ సక్సెస్ అందుకోవడం పై స్పందించారు. కాగా ఈ సినిమా విడుదల సమయంలో సీనియర్ నటుడు కమలహాసన్ కేరళ స్టోరీ మూవీ గురించి మాట్లాడుతూ.. "నాకు ఎలాంటి ప్రచార చిత్రాలు నచ్చవు. టైటిల్ కింద ది ట్రూ స్టోరీ అని రాసినంత మాత్రాన అది నిజమైన కథ అయిపోదు. ఇలాంటి సినిమాలకు నేను పూర్తి వ్యతిరేకిని" అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటుడు నసిరుద్దీన్ షా సైతం "కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూడటం ఎంతో ప్రమాదకరమైన ధోరణి అని, ఈ సినిమాని యూదు సమాజంపై నాజీ జర్మనీ సినిమాలు తీస్తున్న తీరుతో పోల్చారు.
ఈ క్రమంలోనే తాజాగా శర్మ ఓ ఇంటర్వ్యూలో కేరళ స్టోరీ సక్సెస్ పై స్పందిస్తూ.. " మన దేశంలో మనకున్న వాక్ స్వాతంత్రానికి నేను సంతోషించాను. ఓ సినిమాను చూడకుండా కూడా ఆ సినిమాపై విమర్శలు చేయవచ్చు. బహిరంగంగాను ఆ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు. ఎవరైనా ఎవరి గురించైనా ఏదైనా చెప్పవచ్చు. అలాంటి స్వేచ్ఛ మన దేశంలో ఉంది. నిజానికి అదే మన దేశంలో ఉండే బ్యూటీ. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇక్కడ విభిన్న భావజాలం కలిగిన వ్యక్తులు జీవించగలరు. అలా మా సినిమాకి కూడా ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. కమలహాసన్, నసిరుద్దీన్ షా వంటి ప్రముఖ నటీనటులు మా సినిమా గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ ప్రేక్షకులు ది కేరళ స్టోరీ లాంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచిన సినిమాని సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ ఈ సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్లడాన్ని ఎంచుకోవడం నిజంగా ఎంతో అద్భుతం" అంటూ చెప్పుకొచ్చింది ఆదాశర్మ. దీంతో ఆరాశర్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : తొడగొట్టిన ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్ - ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్!