బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. అయన ప్రస్తుతం ‘ఓఎంజీ 2’ లో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత కొంత కాలంగా అక్షయ్ కుమార్ నటిస్తోన్న సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. దీంతో అక్షయ్ కుమార్ మార్కెట్ మెల్లగా తగ్గుతూ వస్తోంది. వరుసగా సినిమాలు నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అది మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో అక్షయ్ చేసేదేమి లేక తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 


సగానికి పైగా రెమ్యునరేషన్ ను తగ్గించుకున్న అక్షయ్..


బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. ఆయన గతంలో నటించిన పలు సినిమాలకు సుమారు రూ.50 కోట్లు నుంచి 100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారనే టాక్ ఉంది. అయితే ఇటీవల కాలంలో అక్షయ్ వరుస అపజయాలను చవిచూస్తున్నాడు. దీంతో ఆయన మార్కెట్ తగ్గుతూ వస్తోంది. గతంలో కూడా అక్షయ్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఇక ఆయన తాజాగా నటించిన ‘ఓఎంజీ2’ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ ను తగ్గించారట అక్షయ్. ‘ఓఎంజీ2’ సినిమాకు ఆయన రూ.35 కోట్లకు తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. 


‘ఓఎంజీ’ కు సీక్వెల్ గా ‘ఓఎంజీ 2’..


అక్షయ్ కుమార్ 2012లో నటించిన ‘ఓఎంజీ’ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇది ఒక సెటైరికల్ కామెడీ డ్రామా మూవీ. ఇందులో అక్షయ్ కృష్ణ వాసుదేవ్ యాదవ్ పాత్రను పోషించాడు. ఈ మూవీలో ఆయన కృష్ణుడిలా కనిపించి మెప్పించారు. ఈ సినిమా వచ్చి దాదాపు పదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ‘ఓఎంజీ 2’ తో ఆ సినిమాకు సీక్వెల్ ను తీసుకురానున్నారు మేకర్స్. అమిత్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అక్షయ్ శివుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇందులో అక్షయ్ శివుడి పాత్రలో కనిపిస్తోన్న సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ మూవీ పై భారీ అంచానలే ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ షూటింగు పార్టును పూర్తిచేసుకుని, మిగతా పనుల్లో బిజీ అయింది. అక్షయ్ కుమార్, అశ్విన్ వర్దే కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 


ఆగష్టు 11 న ప్రేక్షకుల ముందుకు..


అక్షయ్ కుమార్ నటించిన ఈ ‘ఓఎంజీ 2’ మూవీ ఆగస్టు 11న విడదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాతో పాటు సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ అలాగే రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలు కూడా  అదే తేదీన విడుదల కానున్నాయి. మరి వరుస ఫ్లాప్ లతో సతమతమవుతోన్న అక్షయ్ కుమార్ ఈ పోటీను తట్టుకొని ఎలా నిలబడతాడో చూడాలి. ఈ సినిమాతో పాటు అక్షయ్ కుమార్ పలు ప్రాజెక్టుల్లో భాగం కానున్నాడు. 


Also Read: ‘ఫ్యామిలీ’ లెక్క - విజయ్, రష్మికల రిలేషన్‌పై స్పందించిన ఆనంద్ దేవరకొండ



Join Us on Telegram: https://t.me/abpdesamofficial