Baby Movie: ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘బేబీ’. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జులై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం మూవీ మంచి పాజిటివ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతోంది. మూవీ టీమ్ అంతా ప్రీమియర్ షో ను థియేటర్లలో వీక్షించారు. థియేటర్లలో సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్ ఎమోషనల్ అయ్యారు. మూవీ అనంతరం బయటకొచ్చిన నిర్మాత భావోద్వేగానికి గురయ్యారు. కల్ట్ మూవీ ఇచ్చాం అంటూ తొడగొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిర్మాత ఎమోషన్స్ ను చూసి నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 


ఇది కల్ట్ మూవీ అంటూ తొడగొట్టిన నిర్మాత ఎస్కేఎన్..


‘బేబీ’ సినిమా ప్రమోషన్స్ ను ముందు నుంచీ బాగా చేసుకుంటూ వచ్చింది మూవీ టీమ్. దానికి తోడు మూవీ నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ లు ఆకట్టుకోవడంతో మూవీపై ఆసక్తి నెలకొంది. ఇదొక కల్ట్ మూవీ అని ప్రేక్షకులు థియేటర్ నుంచి ఎమోషన్ తో బయటకు వస్తారు అని ముందు నుంచీ మేకర్స్ ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక సినిమా విడుదల అయిన తర్వాత కూడా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ నే వస్తోంది. దీంతో మూవీపై హైప్ పెరిగింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘బేబీ’ మూవీను ఆ మూవీ టీమ్ అంతా వీక్షించారు. థియేటర్లలో సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇక మూవీ నిర్మాత ఎస్కేఎన్ మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తనకు ముందే తెలుసని అన్నారు. ‘టాక్సీవాలా’ తీసినపుడే ఈ ‘బేబీ’ సినిమా తీయాలని అనుకుంటున్నానని విజయ్ తో అన్నానని, ఇప్పుడు ఆనంద్ ఈ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్నాడని చెప్పారు. వైష్ణవి, విరాజ్ లు కూడా చాలా బాగా చేశారని అన్నారు. ఒక కల్ట్ మూవీ ఇచ్చాం అంటూ తొడగొట్టి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.


నిర్మాత ఎస్కేఎన్ పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..


‘బేబీ’ మూవీ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన నిర్మాత ఎస్కేఎన్ బాగా ఎమోషనల్ అయ్యారు. అదే ఊపులో ఇది కల్ట్ మూవీ అంటూ తొడగొట్టారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిర్మాత మైక్ విసిరి కొట్టాడు అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే తర్వాత మైక్ విసరలేదని, తన చేతిలోనే ఉందని ఆ వీడియోను క్షుణ్నంగా చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా మూవీకు పాజిటివ్ టాక్ రావడం పట్ల అలా ఓవర్ ఎమోషన్ అవ్వడం కొందరికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎంత సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం మరీ ఇంతలా చేయాలా’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే కొందరు ‘ఎస్కేఎన్ ఆన్ ఫైర్’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ‘బీబీ’ కు మంచి పాజిటివ్ టాక్ రావడంతో మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి మూవీ మున్ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.  


Also Read: పాపం, అక్షయ్ - రేటు తగ్గించుకున్న కిలాడీ, ‘OMG 2’కు ఎంత తీసుకున్నాడో తెలుసా?