ఏ పని చేసిన బతుకు దెరువు కోసమే. కానీ కొన్ని రకాల వృత్తుల్లో ఉన్న వారికి తెలియకుండానే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు.ముఖ్యంగా మహిళలకు కొన్ని జాబ్స్ చాలా ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది హెయిర్ డ్రెస్సింగ్. హెయిర్ డ్రెస్సర్ గా పని చేసేవారికి వారి వృత్తిలో ఉపయోగించే రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది.
బార్బర్ షాపులు, బ్యూటీ సెలూన్లలో 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్నవారికి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది. వీరు మాత్రమే కాదు అకౌంటెంట్లుగా పనిచేసేవారు, నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలకు కూడా క్యాన్సర్ ముప్పు ఎక్కువే అని అంటున్నారు. సగటున ఇలాంటి ప్రమాదకర ఉద్యోగాలు చేసే మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని అలాంటి వృత్తుల గురించి తెలుసుకుందాం.
- బార్బర్ షాపులు
- బ్యూటి సెలూన్లు
- నిర్మాణ కార్మికులు
- అకౌంటెంట్లు
- డ్రెస్ మేకర్స్ లేదా ఎంబ్రాయిడరీ పని చేసేవారు
- సేల్స్, రీటైల్ వర్కర్లు
నర్సులుగా పనిచేసే వారికి క్యాన్సర్ ముప్పు తక్కువట. హెయిర్ డ్రెస్సింగ్ వృత్తిలో ఉన్న మహిళలు హెయిర్ డైలు, షాంపూలు, కండీషనర్లు, స్టైలింగ్ కు సంబంధించిన కాస్మొటిక్ ఉత్పత్తులతో సహా ఎక్కువ మొత్తంలో క్యాన్సర్ కలిగించే రసాయనాలు కలిగిన వస్తువులతో పనిచేస్తుంటారు. తమ అధ్యయనంలో బ్యూటీ సెలూన్లలో పనిచేసేవారు 12 రకాల క్యాన్సర్ కారక రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటారు కనుక వారికి క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని కెనడాకు చెందిన మాంట్రియల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అనితా కౌషిక్ అంటున్నారు.
ఈ అధ్యయనంలో 2010 నుంచి 2016 మధ్య కెనాడలో మాంట్రియల్లో ఒవేరియన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న 419 మహిళల నుంచి డేటా సేకరించారు. ఈ డేటాను క్యాన్సర్ బారిన పడని 897 మంది మహిళలతో పోల్చి వారి ఉద్యోగాలు, ఇతర ఆరోగ్య చరిత్ర, సాధారణ ఆరోగ్యం వంటివన్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ద్వారా క్యాన్సర్ తో సంబంధం ఉన్న 18 రకాల రసాయనాలను గుర్తించారు. వీటిలో అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, హెయిర్ డస్ట్, పాలిస్టర్ ఫైబర్స్, ఫార్మాల్డిహైడ్, ప్రొపెల్లెంట్ వాయువులు, పెట్రోల్ ఈ 18 రకాల రసాయనాల్లో ఉన్నాయి.
ఈ రసాయనాలు డీఎన్ఏ లోపలికి చొచ్చుకెళ్తాయి.. లేదా డీఎన్ఏతో చేరి ప్రతిస్పందించడం ద్వారా క్యాన్సర్‌కు కారణం అవుతున్నాయి. ఆక్యుపేషనల్ & ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ జర్నల్‌లో హైక్యూములేటివ్ ఎక్స్పోజర్ గురించి ఒక రిపోర్టులో హెచ్చరించారు. మహిళలో వృత్తిపరమైన ఎక్స్పోజర్ల వల్ల కలిగే క్యాన్సర్ ప్రమాదాల గురించి తెలిసింది చాలా తక్కువే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also read : Window Seat in Plane: విమానం విండో సీటులో కూర్చోకూడదట - ఎందుకో తెలిస్తే వణికిపోతారు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.