'పెళ్లి చూపులు' సినిమాతో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకుడుగా పరిచయం అయ్యారు. 'ఈ నగరానికి ఏమైంది' వంటి కల్ట్ ఫిలిం ప్రేక్షకులకు ఇచ్చారు. దర్శకుడిగా ఆయన ప్రతిభ గురించి ఆయన తీసిన విజయాల గురించి ప్రేక్షకులకు తెలుసు. దర్శకుడుగా హిట్స్ అందుకున్న తర్వాత తనలో నటుడిని ప్రేక్షకులకు చూపిస్తున్నారు తరుణ్ భాస్కర్. ఇప్పుడు ఆయన హీరోగా ఓ‌ సినిమా రూపొందుతోంది. 


తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో 'మీకు మాత్రమే చెప్తా' అని ఐదేళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ఆయన అతిథి పాత్రలు చేశారు. స్వీయ దర్శకత్వం వహించిన 'కీడా కోలా' సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. అయితే కొంత విరామం తర్వాత తరుణ్ భాస్కర్ పూర్తి స్థాయి హీరోగా ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


అంబటి ఓంకార్ నాయుడిగా తరుణ్ భాస్కర్!
తరుణ్ భాస్కర్ పుట్టిన రోజు నవంబర్ 5న. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అంబటి ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ నటిస్తున్నట్లు తెలిపారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ సజీవ్ దర్శకుడు. '35 చిన్న కథ కాదు' వంటి విజయవంతమైన, సందేశాత్మక సినిమా తర్వాత ఎస్ ఒరిజినల్ సంస్థ నుంచి వస్తున్న చిత్రం ఇది. ఇది ఒక మలయాళ సినిమాకు రీమేక్.


Also Readఅఫీషియల్ గురూ... ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్






జయ జయ జయ జయహే...
తెలుగులో ఓం శాంతి శాంతి శాంతి!
మలయాళంలో బసెల్ జోసెఫ్, దర్శనా రాజేంద్రన్ జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా 'జయ జయ జయ జయహే' (Jaya Jaya Jaya Jaya Hey). ఆ మూవీ 2022లో విడుదల అయ్యింది. అది థియేటర్లలో మంచి విజయం సాధించడంతో పాటు ఓటీటీలో వీక్షకులను సైతం ఆకట్టుకుంది. ఆ చిత్రాన్ని తెలుగులో తరుణ్ భాస్కర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఈ చిత్రానికి 'ఓం శాంతి శాంతి శాంతి' టైటిల్ ఖరారు చేశారని తెలిసింది.


Also Readహైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!



తరుణ్ భాస్కర్ భార్యగా ఈషా రెబ్బా!
'ఓం శాంతి శాంతి శాంతి' సినిమా (Om Shanti Shanti Shantihi)లో తరుణ్ భాస్కర్ సరసన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా నటిస్తున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి అయిన తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా కథ ఈ ఏడాది రాజమండ్రిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. కథను గోదావరి నేపథ్యానికి మార్చి కొత్తగా రాశారట. సినిమా షూటింగ్ అంతా పూర్తిగా అయిందని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సృజన్ ఎరబోలు, వివేక్ కృష్ణ, ఆదిత్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై క్రిష్ సంగీత దర్శకుడు.