స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఏడాది తర్వాత కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆవిడ ఓ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హానీ బన్నీ' (Citadel Honey Bunny Web Series). ఈ గురువారం (నవంబర్ 7వ తేదీ) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో ఎపిసోడ్స్ ఎన్ని? రన్ టైమ్ ఎంత? అనేది తెలుసా?
సిటాడెల్: టోటల్ ఎపిసోడ్స్ ఎన్ని అంటే?
How many episodes in Citadel Honey Bunny: 'సిటాడెల్: హానీ బన్నీ'లో టోటల్ ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తీసిన సిరీస్ ఇది. సామ్ ఓ ప్రధాన పాత్ర చేయగా... బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మరొక ప్రధాన పాత్ర పోషించారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే నేతృత్వంలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ ఇది.
Citadel Honey Bunny Runtime: అటు ఇటుగా ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల నిడివి ఉంటుందని తెలిసింది. సో... సిరీస్ స్టార్ట్ చేసి ఎండ్ వరకు చూడాలని ప్లాన్ చేస్తే మినిమమ్ ఆరు గంటలు టైమ్ స్పెండ్ చేయాలి. అంటే... మధ్యలో బ్రేక్ కోసం కొంత సమయం తీసుకుంటారు గనుక. బ్యాక్ టు బ్యాక్ రెండు లెంగ్తీ సినిమాలు చూసినట్టు.
Also Read: అఫీషియల్ గురూ... ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సిటాడెల్ కథ ఏమిటి? సమంత రోల్ ఏంటి?
Samantha Role In Citadel Honey Bunny: 'సిటాడెల్'లో హానీ పాత్రలో సమంత నటించారు. హానీ ఓ జూనియర్ ఆర్టిస్ట్. అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆడిషన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో స్టంట్ మన్ బన్నీ (వరుణ్ ధావన్) ఆమెకి పరిచయం అవుతాడు.
బన్నీతో పరిచయం హానీ ప్రయాణాన్ని ఏ విధంగా మార్చింది? జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఆవిడ స్పై ఏజెంట్ ఎలా అయ్యింది? ఏజెంట్ అయ్యాక ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి?అప్పుడు హానీ ఏం చేసింది? అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. అదీ సంగతి! కేకే మీనన్, ఎమ్మా కానింగ్, సికిందర్ ఖేర్, సాకిబ్ సలీమ్, సోహమ్ మజుందార్, సిమ్రాన్ బగ్గా తదితరులు నటించారు. రన్ టైమ్ ఎక్కువ అయినా సరే బోర్ కొట్టదని, రేసీగా ముందుకు సాగే థ్రిల్లర్ ఇదని సమాచారం.
Also Read: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!