గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer). ప్రమోషనల్ ఈవెంట్స్ వచ్చేసరికి నిజంగానే సరికొత్త గేమ్ మొదలు పెట్టింది. టీజర్ లాంచ్ కోసం కొత్త ప్లాన్ వేసింది. ఈ సినిమా టీజర్ ఎక్కడ విడుదల చేయనున్నారో తెలుసా?
లక్నోలో 'గేమ్ చేంజర్' టీజర్ విడుదల
Game Changer teaser launch in Lucknow: పాన్ ఇండియా సినిమాలు... అందులోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసే పాన్ ఇండియా సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే హైదరాబాద్ సిటీ లేదంటే చెన్నై, ముంబై నగరాల్లో మొదలు అవుతాయి. అది కామన్! కానీ, రామ్ చరణ్ సినిమా యూనిట్ ఆ మూడు నగరాలు కాకుండా కొత్త సిటీని ఎంపిక చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో సిటీలో నవంబర్ 9న గేమ్ చేంజర్ టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయోధ్యకు లక్నో కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి టీజర్ విడుదలకు ముందు రామ్ చరణ్ సహా చిత్ర బృందం శ్రీరాముని దర్శనం చేసుకుని వస్తుందా? లేదంటే లక్నోలో ఈవెంట్ ప్లాన్ చేసిందా? అనేది త్వరలోనే తెలుస్తుంది.
ట్రిపుల్ ఆర్ విడుదల తర్వాత నార్త్ ఇండియాలో, మరి ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ థియేటర్లలో రామ్ చరణ్ గెటప్ చూసి జై శ్రీరామ్ అంటూ ప్రేక్షకులు జేజేలు పలికారు. ఇప్పుడు అదే యూపీలో రామ్ చరణ్ తన 'గేమ్ చేంజర్' టీజర్ విడుదల ప్లాన్ చేశారు.
Also Read: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
మాస్ మూమెంట్స్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్
రామ్ చరణ్ నుంచి ప్రేక్షకులు అభిమానులు కోరుకునే మాస్ మూమెంట్స్ ఈ 'గేమ్ చేంజర్' టీజర్ లో పుష్కలంగా ఉన్నాయని యూనిట్స్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అదే సమయంలో శంకర్ స్టైల్ మెసేజ్ కూడా ఉందట. చాలా రోజుల తర్వాత తాను తీసిన మాస్ సినిమా 'గేమ్ చేంజర్' అని శంకర్ కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. ఇటీవల విడుదల చేసిన రామ్ చరణ్ లుంగీ స్టిల్ మాసీగా ఉందని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ చెబుతున్నారు. మరి, టీజర్ లో మాస్ మూమెంట్స్ ఇంకెలా ఉంటాయో?
Also Read: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ జంటగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది. తెలుగు అమ్మాయి అంజలి, సీనియర్ హీరో శ్రీకాంత్, దర్శకుడు మించిన నటుడిగా మారిన ఎస్సీ సూర్య, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలకపాత్రను పోషించారు.