ఫెస్టివల్ సీజన్ అంటే మినిమం మూడు సినిమాలు రిలీజ్ కావడం గ్యారెంటీ. ఈ దీపావళికి దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', శివ కార్తికేయన్ 'అమరన్', కిరణ్ అబ్బవరం 'క' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కన్నడ హీరో మురళి నటించిన భగీర వచ్చింది కానీ తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. సంక్రాంతికి కూడా మూడు నాలుగు సినిమాలు రావడం గ్యారెంటీ. ఇంకా ఐదు నెలల దూరంలో ఉన్న రంజాన్ పండక్కి కూడా మూడు సినిమాలు రావడం పక్కా. ఆ సినిమాలేవో తెలుసా?
రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు
రంజాన్... దేశవ్యాప్తంగా ముస్లింలు పవిత్రంగా జరుపుతారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ పండక్కి ప్రభుత్వం కూడా సెలవులు ఇస్తుంది. ఇతర మతస్థులు కొందరు హలీం తినడానికి అమితమైన ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ఇండియన్ ఫెస్టివల్ హాలిడేస్ లో రంజాన్ ఓ పెద్ద పండగ అని చెప్పాలి.
రంజాన్ సీజన్ క్యాష్ చేసుకోవడానికి హీరోలకు కొందరు ఆసక్తి చూపిస్తారు. ఆ హీరోల లిస్టు తీస్తే బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ పేరు అందరి కంటే ముందు ఉంటుంది. ప్రతి రంజాన్ పండక్కి తన సినిమా విడుదల చేయడం ఆయన ఓ అలవాటుగా పెట్టుకున్నారు.
వచ్చే ఏడాది (2025)లో రంజాన్ పండక్కి 'సికందర్' సినిమా విడుదల చేయడానికి సల్మాన్ ఖాన్ రెడీ అవుతున్నారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో కండలు వీరుడు కథానాయకుడిగా రూపొందుతున్న 'సికందర్' సినిమాను మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలకు హిట్స్ ఇచ్చారు మురుగదాస్. అయితే కొన్నాళ్ళకు ఆయన సరైన విజయాలు లేక సతమతం అవుతున్నారు. సల్మాన్ సినిమాతో భారీ హిట్ అందుకోవాలని కసిగా పనిచేస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు కావడంతో 'సికందర్' సినిమాను తెలుగు తమిళ భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు.
Also Read: శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!
రంజాన్ బరిలో వస్తున్న మరో సినిమా 'లూసిఫర్ 2'
మోహన్ లాల్ హీరోగా మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'లూసిఫర్'. మలయాళంలో భారీ విజయం సాధించింది ఆ సినిమాను ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయింది. ఆ సినిమానే 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేశారు చిరంజీవి.
దర్శకుడుగా పృథ్వీరాజ్ సుకుమారన్ మొదటి సినిమా 'లూసిఫర్'. మంచి కమర్షియల్ సెన్సిబిలిటీస్ ఉన్న దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అందుకని 'లూసిఫర్ 2: ఎంపరర్' మీద భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారు.
Also Read: లక్కీ భాస్కర్.... ఈ నెలలోనే ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్
పవన్ కళ్యాణ్ వస్తారా? విజయ్ దేవరకొండ వస్తారా?
రంజాన్ పండక్కి విడుదల చేయడానికి మన తెలుగు ఇండస్ట్రీలో రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న స్పై థ్రిల్లర్ (VD 12 Movie)ను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే... అదే తేదీకి పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' కూడా రానున్నట్లు ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ సినిమాతో విజయ్ దేవరకొండ సినిమా పోటీ పడుతుందా? అనే సందేహాలకు ఆ మధ్య నిర్మాత నాగ వంశీ సమాధానం ఇచ్చారు. కళ్యాణ్ గారి సినిమా వచ్చేటట్లు అయితే తమ సినిమా రాదని చెప్పారు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బిజీ బజీగా ఉన్నారు. ఆయన సినిమా షూటింగులు సజావుగా ప్లానింగ్ ప్రకారం జరగడం లేదు. అందువల్ల 'హరిహర వీరమల్లు' చిత్రీకరణ గనక ఆలస్యమై వాయిదా పడితే విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది. లేదంటే విజయ్ దేవరకొండ సినిమా వెనక్కి వెళ్లి 'హరిహర వీరమల్లు' అదే తేదీకి వస్తుంది.
Also Read: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఈ బ్లాక్ బస్టర్స్ ఫ్రీగా చూడొచ్చు - ఏయే సినిమాలు ఉన్నాయో తెలుసా?