థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాల కోసం వెయిట్ చేసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఓటీటీలో సినిమాలు చూడాలంటే డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అయితే... పాపులర్ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్నిటిని ఫ్రీగా చూడొచ్చు. అవి ఏమిటో తెలుసా? 


సంక్రాంతి సూపర్ హిట్ వీర సింహా రెడ్డి!
నట సింహం నందమూరి బాలకృష్ణ గత ఏడాది సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి'తో థియేటర్లలోకి వచ్చారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా భారీ వసూళ్లను సాధించడమే కాదు...‌ నట సింహం అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. బాలకృష్ణ ఫ్యాక్షన్ ఫిలిం చేస్తే సూపర్ హిట్ గ్యారెంటీ అని మరోసారి నిరూపించింది.‌ ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. శృతి హాసన్, హనీ రోజు హీరోయిన్లుగా... వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ రోల్ చేసిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఫ్రీగా వీక్షకులకు అందుబాటులోకి ఉంది.


బాక్సాఫీస్ బరిలో లోక నాయకుడిని నిలబెట్టిన విక్రమ్!
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతిభ మీద ఎవరికి సందేహాలు లేవు. అయితే... కమర్షియల్ పరంగా ఆయన సినిమాలకు భారీ వసూళ్లు రావు అనే విమర్శ ఉంది.‌ దాన్ని పటా పంచలు చేసిన సినిమా 'విక్రమ్'. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై 400 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు తమిళ భాషల్లో బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడిని బహుబలి అంత ఎత్తులో నిలబెట్టింది. ఈ సినిమాను కూడా ఫ్రీగా చూడొచ్చు.


రణబీర్ కపూర్ ఫాంటసీ ఫిలిం 'బ్రహ్మాస్త్ర'
హిందీ ప్రేక్షకులను మాత్రమే కాదు... తెలుగు తమిళ జనాలను సైతం ఆకట్టుకున్న రణబీర్ కపూర్ సినిమా 'బ్రహ్మాస్త్ర'. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ 'వార్‌ 2' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అయాన్ ముఖర్జీ తీసిన చిత్రమిది. ఇందులో రణబీర్ జంటగా అలియా భట్ నటించారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించారు. భారీ వసూళ్ల సాధించడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కూడా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫ్రీగా చూడొచ్చు.


దుల్కర్ సల్మాన్ హిట్ 'సీతా రామం' హిందీ వర్షన్!
ఉత్తరాది కథానాయిక మృణాల్ ఠాకూర్ అంటే తెలుగు ప్రేక్షకులు పడి చచ్చేలా చేసిన సినిమా 'సీతా రామం'. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ జనాలను కూడా మెప్పించింది. ఈ సినిమా హిందీ వర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఫ్రీగా చూసేందుకు వీలుంది.


Also Read: ఆహా ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే... వీటిని అస్సలు మిస్ కావొద్దు



విజయ్ దేవరకొండ సినిమాలు రెండు... ఇంకా చూడు!
విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాలతో నటించిన పాన్ ఇండియా‌ సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఫ్రీగా చూడొచ్చు. దీంతో పటు విజయ్ దేవరకొండకు  విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా 'అర్జున్ రెడ్డి' కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు. అయితే మధ్య మధ్యలో కొన్ని యాడ్స్ వస్తాయి. వీటితోపాటు ఇంకొన్ని సినిమాలు ఫ్రీగా చూసేందుకు ఉన్నాయి.


Also Read'సింగం ఎగైన్' రివ్యూ: ఇది రోహిత్ శెట్టి తీసిన రామాయణం... సినిమాగా ఎలా ఉందంటే?