Ajay Devgn and Rohit Shetty movie Singham Again review in Telugu: కమర్షియల్ ఫిలిమ్స్ తీయడంలో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టికి సపరేట్ స్టైల్ ఉంది. తనకు ఓ మార్క్ సెట్ చేసుకున్నారు. అందులోనూ అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టి కాంబినేషన్ అంటే సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'గోల్ మాల్', 'సింగం' ఫ్రాంచైజీతో భారీ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా 'సింగం ఎగైన్' (Singham Again Movie). ఇందులో అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రలు చేశారు. సింగం భార్య పాత్రలో కరీనా కపూర్ నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?


కథ (Singham Again Story): ఒమర్ హఫీజ్ (జాకీ ష్రాఫ్)ను బాజీరావ్ సింగం (అజయ్ దేవగణ్) అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత బాజీరావ్ నేతృత్వంలో శివ స్క్వాడ్ ఏర్పాటు చేస్తారు హోమ్ మంత్రి (రవికిషన్).


శివ స్క్వాడ్ ఏర్పాటు చేసిన రెండేళ్లకు బాజీరావ్ సింగం భార్య అవని (కరీనా కపూర్ ఖాన్)ను ఒమర్ మనవడు, డేంజర్ లంక అని పిలిచే జుబైర్ కిడ్నాప్ చేస్తాడు. దానికి ముందు తమిళనాడులోని శక్తి శెట్టి (దీపికా పదుకోన్) విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ స్టేషన్ తగలెట్టేస్తాడు. అవనీని శ్రీలంక తీసుకు వెళతాడు జుబైర్. అక్కడి నుంచి భార్యను తీసుకు రావడానికి సింగం ఏం చేశాడు? అతనికి సింబ (రణవీర్ సింగ్), సత్య (టైగర్ ష్రాఫ్), సూర్యవంశీ (అక్షయ్ కుమార్) ఎటువంటి సాయం చేశారు? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ (Singham Again Review Telugu): 'సింగం' చూసిన ప్రేక్షకులకు ఆ సినిమా స్టైల్ ఏంటి? క్యారెక్టర్స్ ఏంటి? అనేది ఐడియా ఉంటుంది. సేమ్ టు సేమ్ 'సింబ' 'సూర్యవంశీ' చూసినా అంతే! 'సూర్యవంశీ'లోకి సింగం, సింబాను తీసుకు వచ్చారు రోహిత్ శెట్టి. ఆడియన్స్ ఓకే అనుకున్నారు. ఇప్పుడీ ముగ్గురితో 'సింగం ఎగైన్' అనౌన్స్ చేసినప్పుడు మాంచి యాక్షన్ ఫిల్మ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేశాక ఒక్కసారి షాక్ తిన్నారంతా!


'సింగం ఎగైన్' ట్రైలర్ చూస్తే... రోహిత్ శెట్టి పోలీస్ కథ చెప్పలేదు. రామాయణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సినిమాలోనూ అంతే! ప్రేక్షకులు అందరికీ తెలిసిన రామాయణాన్ని పదే పదే చెబుతూ... రామాయణంలో పాత్రలతో సింగం, సింబ, సత్య, అవనీ కంపేర్ చేస్తూ కథ చెప్పారు. ఆ కంపేరిజన్ వల్ల కథలో, కథనంలో పట్టు తగ్గింది. స్క్రీన్ ప్లే పరంగా మేజిక్ చేయడంలో రోహిత్ శెట్టి ఫెయిల్ అయ్యారు. దర్శకుడిగానూ సన్నివేశాలను ఆసక్తిగా మలచడంలో తడబడ్డారు. రోహిత్ శెట్టి మార్క్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులు, కామెడీ సీన్స్ 'సింగం ఎగైన్'లో తగ్గాయి.


సింహం లాంటి పోలీస్ అధికారిని శ్రీరాముడిగా చూపించాలని రోహిత్ శెట్టి ఈ కథ రాసుకోవడంలో తప్పు లేదు. అయితే... ఈ కథకు రామాయణం అవసరం లేదని ప్రతి అడుగులో అనిపిస్తుంది. కథనంలో రామాయణాన్ని బలవంతంగా ఇరికించినట్టు ప్రతి సన్నివేశంలో, కథలోని ప్రతి మలుపులో అర్థం అవుతోంది. రాముడిగా అజయ్ దేవగణ్, హనుమంతునిగా రణవీర్ సింగ్, లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్, రావణుడిగా అర్జున్ కపూర్... ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఎలివేషన్స్ కోసం సన్నివేశాలు తీసినట్టుగా స్క్రీన్ ప్లే అతుకుల బొంతలా ఉంది తప్ప... సినిమాగా ఆకట్టుకోలేదు.


కమర్షియల్ పంథా, ఫార్ములా అంటూ రోహిత్ శెట్టి సినిమా సినిమాకూ తన మార్క్ మిస్ అవుతున్నారు. ఇటీవల మైథాలజీ సినిమాలకు ఆదరణ బావుంటోంది. హిట్ కోసం రామాయణాన్ని ఈ కాలానికి తీసుకొచ్చి రుద్దాలని ప్రయత్నిస్తే కష్టం. దీపికా పదుకోన్ ఇంట్రో గానీ, రామాయణం గురించి కరీనా చెప్పే సన్నివేశాలు గానీ మరీ బోర్ కొట్టించాయి.


దర్శకుడిగా రోహిత్ శెట్టి సక్సెస్ అయినది ఎక్కడంటే... స్టార్స్ అందరినీ ఈ సినిమా చేయడానికి ఒప్పించడంలో, రావణుడిగా అర్జున్ కపూర్ (Arjun Kapoor)ను తెరపై చూపించడంలో! అర్జున్ కపూర్ సన్నివేశాలు అన్నీ ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఫైట్స్, యాక్షన్ సీన్స్ పేలవంగా ఉండటంతో కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ రీ రికార్డింగ్ కూడా అలాగే ఉంది. సినిమాటోగ్రఫీ కమర్షియల్ సినిమాలకు తగ్గట్టు ఉంది. అర్జున్ కపూర్ సన్నివేశాల్లో మాత్రం బావుంది. ఖర్చు విషయంలో రాజీ పడలేదు. ప్రతి సీన్ గ్రాండ్ స్కేల్ లో ఉంది.


Also Read: అమరన్ రివ్యూ: నటనతో ఏడిపించిన సాయి పల్లవి... ఆర్మీ అధికారిగా శివకార్తికేయన్ ఎలా చేశారు? సినిమా ఎలా ఉందంటే?



సింగం పాత్రలో నటించడం అజయ్ దేవగణ్ (Ajay Devgn)ను కొత్త కాదు. మరోసారి అలవాటైన పాత్రలో చేసుకుంటూ వెళ్లారు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కూరలో కరివేపాకు అన్నట్టు ఉంటాయని చెప్పడానికి కరీనా కపూర్ రోల్ రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్. కథంతా ఆవిడ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. కానీ, ఆ పాత్రకు ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన సీన్ లేదు. ఆవిడ నటన కూడా అంతంత మాత్రమే. సింబాగా రణవీర్ సింగ్ కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఓకే. దీపికా పదుకోన్ ఇంట్రడక్షన్ చూశాక పోలీస్ పాత్రను ఎలా చూపించరేంటి? అని సందేహం కలుగుతుంది. అర్జున్ కపూర్ బాగా చేశారు. ఆయన సన్నివేశాలనూ బాగా తీశారు. మిగతా ఆర్టిస్టులు ఓకే.


సింగం ఎగైన్... ఇది రోహిత్ శెట్టి తీసిన రామాయణం. కమర్షియల్ సినిమాలా, ఓ ఖాకీ (పోలీస్) కథలా కాకుండా డాక్యుమెంటరీ చూసినట్టు ఉంటుంది. బాలీవుడ్ బడా బడా స్టార్స్ ఉన్నా సరే హీరోయిజం ఎలివేట్ కాలేదు. అజయ్ దేవగణ్ ప్రతి సీన్ ఓ ఇంట్రడక్షన్ షాట్ అన్నట్టు స్లో మోషన్‌లో తీసి ఆడియన్స్ ఇరిటేట్ అయ్యేలా చేశారు రోహిత్ శెట్టి. ఈ సినిమా ఆయన వీరాభిమానులకు మాత్రమే నచ్చుతుంది. అదీ ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే! సాధారణ ప్రేక్షకుల మీద సింహం పంజా విసిరినట్టు ఉంటుంది.


Also Read: బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?