యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) హీరోగా నటించిన సినిమా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' (Appudo Ippudo Eppudo Movie). దీనికి సుధీర్ వర్మ దర్శకుడు. సూపర్ డూపర్ హిట్స్ 'స్వామి రా రా', 'కేశవ' తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో రూపొందిన చిత్రమిది. నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది. మరి, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా?
అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిఖిల్ సినిమా
Amazon Prime Video Bags Appudo Ippudo Eppudo movie digital streaming rights: 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాను నిఖిల్, సుధీర్ వర్మ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు ఫినిష్ చేశారు? అనేది ఆడియన్స్, ఇండస్ట్రీ జనాలు కొందరికి ఓ పజిల్. సినిమా ఎప్పుడు చేసినా సరే అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందని రీసెంట్ ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పారు. ఇందులో రెండు ప్రేమ కథలు, మంచి ట్విస్టులు ఉన్నాయని తెలిపారు. చాలా సైలెంట్‌గా ఫినిష్ చేసిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఆల్రెడీ క్లోజ్ అయ్యాయి.
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారట.
Also Read: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ విడుదల కాగా... ప్రతి దానికి ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూస్తే... రిషి అనే రేసర్ పాత్రలో హీరో నిఖిల్ కనిపించనున్నారు. డబ్బు కోసం ఓ హీరోయిన్ (రుక్మిణి వసంత్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే, మరొక హీరోయిన్ (దివ్యాంశ కౌశిక్)తోనూ ప్రేమ కథ నడుపుతాడు. ఈ రెండు ప్రేమ కథలు కాకుండా డబ్బు కోసం మరో పని చేయడానికి రిస్జి ఒప్పుకొంటాడు. అప్పుడు ఏమైంది? రిషి కారులో శవం ఎవరిది? అతడిని పోలీసులు ఒక వైపు, రౌడీలు మరొక వైపు ఎందుకు తరుముతున్నారు? వెంట పడుతున్నారు? అనేది తెలియాలంటే నవంబర్ 8న 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చూడాలి.
Also Read: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాను బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెకంటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాతో 'సప్త సాగరాలు దాటి' రుక్మిణి వసంత్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇందులో సత్య, సుదర్శన్, జాన్ విజయ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి యోగేష్ సుధాకర్, సునీల్, షా, రాజా సుబ్రమణ్యం సహ నిర్మాతలు. ఇందులోని పాటలకు సింగర్ కార్తీక్ సంగీతాన్ని, సన్నీ ఎంఆర్ నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్: నవీన్ నూలి.