Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Devara OTT Platform: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ 'దేవర' సినిమా ఓటీటీ రిలీజ్ ఈ వారమే. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? ఏ తేదీకి వస్తుంది? అనేది తెలుసా?

Continues below advertisement

Devara OTT Release Date Netflix: థియేటర్లలో 'దేవర' దుమ్ము దులిపింది. బాక్స్ ఆఫీస్ బరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సత్తా ఏమిటనేది ఈ సినిమా గట్టిగా చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి 'దేవర' రెడీ అవుతున్నారు. మరి, ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Continues below advertisement

ఈ వారమే దేవర డిజిటల్ రిలీజ్...‌ ఆ ఓటీటీలో!
'దేవర' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక‌ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం... ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శుక్రవారం (నవంబర్ 8న) 'దేవర'ను తమ ఓటీటీ వేదికలో వీక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది.

Devara OTT Update: సెప్టెంబర్ 27న దేవర థియేటర్లలో విడుదల అయ్యింది. థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ రిలీజ్‌ మధ్య మినిమం ఎనిమిది వారాల గ్యాప్ ఉంటుందని అప్పట్లో వినిపించింది. అయితే... అనూహ్యంగా ఆరు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి తీసుకువస్తోంది నెట్ ఫ్లిక్స్. సౌత్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వెర్షన్ విడుదలకు మరో మూడు వారాల సమయం ఉంది.  

Also Readహైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!

'దేవర'ను వర ఎందుకు చంపాడు?
నీటిలో‌ ఉన్న అస్థిపంజరాలు ఎవరివి?
'దేవర' విడుదలకు ముందు సినిమాను రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలిపారు. అయితే... రెండో పార్ట్ మీద ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుందా? బాహుబలి తరహాలో ఈ దేవర క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు థియేటర్లలో లభించింది. 

తండ్రి 'దేవర'ను అమితంగా ప్రేమించే కుమారుడు 'వర' చంపినట్లు ఓ సన్నివేశం ఉంది. అది క్లైమాక్స్! కన్న తండ్రిని కొడుకు ఎందుకు చంపాడు? అనే ప్రశ్న 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' తరహాలో‌ వైరల్ అయింది. అది పక్కన పెడితే... ఈ సినిమాలో నీటి కింద బోలెడు ఆస్థి పంజరాలు ఉన్నాయి. అవి ఎవరివి? వాళ్ళను ఎవరు చంపారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఆ ఆస్థి పంజరాలలో ఒకరు చాలా కీలకమైన వ్యక్తి అని దర్శకుడు శివ కొరటాల తెలిపారు. మరి అతను ఎవరు అనేది రెండో పార్ట్ విడుదల అయితేనే కానీ తెలియదు.

Also Readసేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?


'దేవర' విడుదలైన తర్వాత తన బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2' షూటింగ్ స్టార్ట్ చేశారు ఎన్టీఆర్. అది పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. ఆ రెండు పూర్తి చేసిన తర్వాత 'దేవర పార్టు 2'ను సెట్స్ మీదకు తీసుకు వెళతారు. ఈ లోపు కొరటాల శివ కథను ఫైన్ ట్యూన్ చేయనున్నారు. 


'దేవర' సినిమాలో ప్రేక్షకులు చూసింది కొంచమే అని, ప్రేక్షకులు చూడాల్సింది ఇంకా ఉందని దర్శకుడు కొరటాల శివ చెబుతున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య ప్రేమ కథ కూడా రెండో పార్టులో ఎక్కువ ఉంటుందట. నాయకుడిగా వర ఎదిగే తీరు ఆ ప్రయాణం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుందని, ఆ సినిమా ఇంకా భారీ విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

Continues below advertisement
Sponsored Links by Taboola