Just In
Sukumar: ఆ సినిమాలు నేను తీసుంటే రిటైర్ అయిపోయేవాడిని - దాన్ని చోరీ చేశానంటున్న సుకుమార్
Seetha Payanam Teaser: స్క్రీన్ ప్లే విషయంలో తాను హీరో ఉపేంద్రను ఫాలో అయ్యేవాడినని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. 'సీతాపయనం' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Sukumar About Upendra Movie: ఉపేంద్ర, ఓం, 'ఏ' వంటి కల్ట్ సినిమాలు తీసుంటే తాను రిటైర్ అయిపోయేవాడినని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతా పయనం' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. ఉపేంద్ర, అర్జున్‌లపై ప్రశంసలు కురిపించారు. ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సుకుమార్, ఉపేంద్ర హాజరయ్యారు.
ఈ మూవీ జర్నీ మరో మూవీ
అర్జున్, ఉపేంద్ర ఇద్దరూ లెజెండ్ యాక్టర్స్, డైరెక్టర్స్ అని.. వారి ముందు మాట్లాడాలంటేనే టెన్షన్‌గా ఉందని సుకుమార్ అన్నారు. 'హనుమాన్ జంక్షన్ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. ఆ టైంలో ఆయన్ను దూరం నుంచి చూసేవాడిని. అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. ఆయన్ను చూస్తే ఎవరైనా ఎడ్మైర్ అయిపోతారు. ఆయనతో పాటు ఈ స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. కూతురు కోసం సినిమా చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ నాకు తెలుసు. ఈ జర్నీనే ఒక సినిమాగా తీయవచ్చు. ఆయన కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.' అని అన్నారు.
నేను చోరీ చేశాను
ఓం, ఏ, ఉపేంద్ర వంటి సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చని సుకుమార్ (Sukumar) అన్నారు. 'నేను ఆ 3 సినిమాలు తీసి ఉంటే రిటర్న్ అయిపోయే వాడిని. అంత కల్ట్ మూవీస్ మాకు ఇచ్చిన ఉపేంద్ర గారికి థాంక్యూ. ఈ రోజు నా స్క్రీన్ ప్లే ఇలా ఉందంటే కారణం ఆ మూడు సినిమాలే. ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం ఉపేంద్ర గారికి అలవాటు. ఆయన చాలా గ్రేట్ ఇన్‌స్పిరేషన్. దాన్ని ఆయన నుంచి చోరీ చేశాను.' అంటూ నవ్వులు పూయించారు సుకుమార్.
ఆమెకు క్రెడిట్ ఇవ్వలేకపోయాను
ఇందులో 'ఏ ఊరికి వెళ్తావే పిల్లా..' పాట వినగానే చాలా అద్భుతంగా అనిపించిందని.. అది చంద్రబోస్ రాసిన పాట అని తెలిసిపోయిందని సుకుమార్ అన్నారు. 'అనూప్ మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే కీ బోర్డ్ ప్లేయర్‌గా పాపులర్. ఇందులో మంచి మ్యూజిక్ చేశారు. ఆయనకు నేను ఓ పెద్ద ఫ్యాన్. సాంగ్‌లో మూమెంట్స్ చాలా బాగున్నాయి.
ఈ సాంగ్ మూమెంట్స్ ఎవరు చేశారంటే శ్రష్టి అని చెప్పారు. 'పుష్ప 2' సూసేకి సాంగ్‌లో 80% మూమెంట్స్ తనే కంపోజ్ చేసింది. ఆ క్రెడిట్ ఆమెకు ఇవ్వలేకపోయాను. ఐశ్వర్య, నిరంజన్ నటన బాగుంది. 'సీతాపయనం' చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.' అని అన్నారు.
'సీతాపయనం' సినిమాకు యాక్టర్ అర్జున్ దర్శకత్వం వహించారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య, అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.