నాచురల్ స్టార్ నాని (Nani)ని ప్రేక్షకులు ఒక పక్కింటి కుర్రాడిలా చూశారు. బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఆయనది. అయితే ఎప్పటికప్పుడు తన ఇమేజ్ బ్రేక్ చేస్తూ కొత్త తరహా క్యారెక్టర్లలో ప్రేక్షకులు ముందుకు వస్తూ వైవిధ్యమైన సినిమాలు చేశారు. 'దసరా'తో తనలో మాస్ చూపించారు నాని. అయితే 'హిట్ 3' (Hit 3 The Third Case) లాంటి వయలెంట్ యాక్షన్ మూవీని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేచురల్ స్టార్  ఫిల్మోగ్రఫీలో ఇదొక డిఫరెంట్ సినిమా. ఇప్పుడు యాక్షన్ ఫిలిం ఓటీటీలోకి వచ్చింది.

ఐదు భాషల్లో హిట్ 3 స్ట్రీమింగ్!Hit 3 OTT release date Netflix: బాక్సాఫీస్ బరిలో 'హిట్ 3' సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మే 29వ తేదీ... గురువారం నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.

సమాజంలో మనుషులను చంపే సైకోలు అందరూ ఒక గ్రూప్ కింద ఏర్పడతారు. సాటి మనిషిని కిరాతకంగా చంపే వాళ్ళను మాత్రమే డార్క్ వెబ్ ద్వారా తన గ్రూప్‌లో చేర్చుకుంటాడు. అటువంటి వాళ్ళందరినీ ఒక్కచోటకు చేర్చింది ఎవరు? ఆ గ్రూప్ గుట్టు రట్టు చేసి వాళ్ళని పట్టుకోవడానికి హీరో ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Readపవన్ కళ్యాణ్ విలన్‌కు డెంగ్యూ... ముంబైలో ఆగిన 'ఓజీ' షూటింగ్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ 'హిట్ 3' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని నాని అభిమానులు అంటున్నారు. ఇంటర్నేషనల్ ఓటీటీల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 'హిట్ 3'కు చిన్న పిల్లలను తీసుకు రావద్దని కుటుంబంతో కలిసి చూడవద్దని, విడుదలకు ముందు నుంచి నాని చెబుతూ వచ్చారు. ఆయన చెప్పింది నిజమే... ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు ఇది. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా.

Also Readటాలీవుడ్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ 'డర్టీ పీఆర్ గేమ్స్'... రాజమౌళి నుంచి సందీప్ రెడ్డి వంగా వరకు... ఎవరెఎర్ని టార్గెట్ చేశారో తెలుసా?

'హిట్ 3' సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ రోల్ చేయగా... పతాక సన్నివేశాలలో అడవి శేష్ అతిథి పాత్రలో సందడి చేశారు. ఈ సినిమాలో కోమలి ప్రసాద్ కీలక పాత్రలో కనిపించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.