ఇండియాలో ఫస్ట్ షో పడటానికి ముందు ఓవర్సీస్ నుంచి కొందరు రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. యుఎస్, యూకే, దుబాయ్, ఆస్ట్రేలియా అంటూ ఇంకొందరు ఫేక్ రివ్యూలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ నెగిటివిటీకి 'స్కంద' టీమ్ చెక్ పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కలయికలో రూపొందిన మొదటి సినిమా 'స్కంద' (Skanda Movie). ఆల్రెడీ విడుదలైన రెండు ట్రైలర్లు, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రెండో ట్రైలర్ రిలీజైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్ ఓ స్థాయిలో ఉందని అర్థం అవుతోంది. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు 'స్కంద'ను తీసుకు వస్తున్నారు. 


ఓవర్సీస్ ప్రీమియర్లు లేవు...
ఇండియాతో పాటు అమెరికాలోనూ!
సాధారణంగా ఓవర్సీస్ ఏరియాల్లో సినిమాలు ముందుగా విడుదల అవుతాయి. మన దేశంలో కంటే ఒక్క రోజు ముందు అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రీమియర్ షోలు పడతాయి. అయితే... ఇవాళ అమెరికాలో 'స్కంద' ప్రీమియర్లు వేయడం లేదు. ఇండియాలో ఎప్పుడు అయితే సినిమా విడుదల అవుతుందో... అమెరికాలో ప్రేక్షకులు కూడా అప్పుడే సినిమా చూస్తారు.


Also Read 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో పడటానికి ముందు వస్తున్న ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టడం కోసమే అమెరికాలో ప్రీమియర్ షోలు వేయకూడదని 'స్కంద' టీమ్ డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం ఉదయం పది గంటల తర్వాత 'స్కంద' రివ్యూలు ఆల్ లైన్, సోషల్ మీడియాల్లో రానున్నాయి. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే తెలుగు చిత్రసీమలో మిగతా హీరోలు, దర్శక - నిర్మాతలు సైతం ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. 


Also Read  'స్కంద' క్లైమాక్స్ - 24 రోజులు బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్‌తో!






బ్లాక్ బస్టర్ 'అఖండ' తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను నుంచి వస్తున్న సినిమా కావడంతో 'స్కంద' మీద మాస్, తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ పోతినేనిని ఆయన ఎలా చూపించారో అనే ఆసక్తి కూడా కొందరిలో ఉంది. ఈ 'స్కంద'లో రామ్ జోడీగా శ్రీ లీల నటించారు. మరో కథానాయిక సయీ మంజ్రేకర్ కీలక పాత్ర చేశారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా 'కల్ట్ మామ' పాటలో స్టెప్పులు వేశారు. శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, శరత్ లోహితస్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 'అఖండ' తర్వాత మరోసారి బోయపాటి శ్రీను సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందించారు (Skanda Movie First Review). 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial