Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

క్యారెక్టర్ కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే, మలుచుకునే హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. 'స్కంద' కోసం ఆయన ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

Continues below advertisement

క్యారెక్టర్ కోసం స్టైల్, బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసే యంగ్ హీరోల్లో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) ఒకరు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఉన్నట్టు ఆ తర్వాత సినిమాలో లేరు. 'స్కంద' సినిమాలో (Skanda Movie) ఉన్నట్లు ఇంతకు ముందు సినిమాలో లేరు. 'ది వారియర్'లో రామ్ రెండు లుక్కులో కనిపించారు. ఒకటి డాక్టర్ లుక్, మరొకటి పోలీస్ లుక్! ఆ రెండిటి మధ్య వేరియేషన్ చూపించారు. ఆ వెంటనే 'స్కంద'లో మరో లుక్కులో కనిపించారు. 

Continues below advertisement

'స్కంద' కోసం ఎన్ని కిలోలు పెరిగారంటే?
'స్కంద' ప్రచార చిత్రాలు చూస్తే... రామ్ బరువు పెరిగారని ఎవరికి అయినా సరే ఈజీగా అర్థం అవుతోంది. అయితే... ఎన్ని కిలోలు పెరిగారో తెలుసా? సాధారణంగా రామ్ 70 కిలోలకు కొంచెం అటు ఇటుగా ఉంటారు. 'స్కంద' చిత్రీకరణ మొదలు కావడానికి ముందు ఆయన 72 కిలోలు ఉన్నారు. అయితే... ఈ సినిమా కోసం 12 కిలోల బరువు పెరిగి 84 కిలోలకు చేరుకున్నారు. సినిమా పట్ల ఆయన చూపించిన కమిట్మెంట్ పట్ల యూనిట్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

'స్కంద'లో రామ్ రెండు లుక్కులు...
'స్కంద' ట్రైలర్స్ చూస్తే రామ్ రెండు లుక్కుల్లో కనిపించారు. ఒకటి ఫ్యామిలీ మ్యాన్ లుక్ అయితే... మరొకటి మాస్ లుక్! ఆ రెండిటి మధ్య రామ్ వేరియేషన్ చూపించారు. మరి, ఒక్క పాత్రలో రెండు షేడ్స్ చూపిస్తున్నారా? లేదంటే రెండు క్యారెక్టర్లు చేస్తున్నారా? అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. 

Also Read : 'స్కంద' క్లైమాక్స్ - 24 రోజులు బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్‌తో!
 
యాక్షన్ దృశ్యాలు తెరకెక్కించడంలోనూ, కుటుంబ విలువలతో కూడిన మాస్ యాక్షన్ & కమర్షియల్ చిత్రాలు తీయడంలోనూ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) స్టైల్ సెపరేట్! 'స్కంద - ది ఎటాకర్' (Skanda Movie) ప్రచార చిత్రాల్లో ఆయన స్టైల్ చాలా స్పష్టంగా కనిపించింది. రామ్ పోతినేని లుక్ నుంచి యాక్షన్ వరకు ఆయన కొత్తగా చూపించారు. ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 28న)... అంటే మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. 

Also Read : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?

'స్కంద' చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్, జీ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇందులో రామ్ జంటగా శ్రీ లీల నటించగా... సయీ మంజ్రేకర్ రెండో కథానాయికగా కీలక పాత్ర చేశారు. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం.  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement