Gruhalakshmi Serial September 27th  Episode : దివ్యతో గొడవ జరిగిన తర్వాత విక్రమ్ బయటకి వచ్చి సోఫాలో కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అది చూసి జానూ తన దగ్గరకి వచ్చి కన్నీళ్ళు తుడుస్తుంది.

జానూ: మనసులో బాధని ఎలా దాస్తావ్ బావ. నీ బాధకి కారణం ఏంటి? కారణం ఎవరో చెప్పు

విక్రమ్: తెలుసుకుని ఏం చేస్తావ్. నా బాధకి కారణం అతిగా ఆశపడటం. నా బాధకి కారణం నేనే

జానూ: రాజీ పడుతున్నావా అది చేతకాని వాళ్ళు చేసే పని

విక్రమ్: నువ్వు ఎలా అనుకున్నా నేను బాధపడను

జానూ: నిన్ను బాధపెట్టే వాళ్ళని వదిలేయ్ పట్టించుకోకు. నిన్ను ఇష్టపడే వాళ్ళ గురించి ఆలోచించు. నీ ప్రాబ్లం దివ్య అక్కతో కదా. తనతో హ్యాపీగా లేవు కదా. నాకు తెలుసు అంటుండగా దివ్య వచ్చి వాళ్ళ మాటలు దూరం నుంచి వింటుంది

Also Read: కావ్యకి పడిపోయిన రాజ్, రుద్రాణిలో మొదలైన టెన్షన్ - స్వప్న బయటపడుతుందా!

విక్రమ్: నీకు తెలిసిందంతా అబద్దం. దివ్యతో నేను హ్యాపీగా లేకపోవడం కాదు. తనే నాతో హ్యాపీగా లేదు. నన్ను కాదనుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. నా తప్పు ఏంటో ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను

జానూ: నిన్ను వద్దనుకున్న తన మీద ఎందుకు ప్రేమ

విక్రమ్: మనసులో ఉన్న ప్రేమని మర్చిపోలేము. దివ్య నాకు మనసు నిండెంత ప్రేమతో పాటు బాధ కూడా ఇచ్చింది. అది నేను తనకి ఇచ్చే విలువ. ప్రేమించిన మనిషి దూరం పెడితే ఆఅ బాధ నరకంగా ఉంటుంది

జానూ: నరకం చూపించే అక్కతో ఎందుకు కలిసి ఉండటం. విడిపోయి ప్రశాంతంగా ఉండవచ్చు

విక్రమ్: విడిపోవడానికి కాదు కలిసి బతుకుతుంది. ప్రేమని మర్చిపోయి బతకలేము దూరం అవడం అంత ఈజీ కాదు. పొరపాటున దూరమైన ఆ వ్యక్తి జ్ఞాపకాలు ప్రశాంతంగా బతకనివ్వవు. దివ్యని దూరంగా ఉంచలేను అలాగని దగ్గరగా ఉండలేను

జానూ: దివ్య అక్క నీకు అనుకూలంగా మారుతుందని అనిపించడం లేదు

తన గదిలోకి పడుకోవడానికి రమ్మని జానూ పిలిస్తుంది కానీ రానని చెప్తాడు. దీంతో తాను వెళ్ళిపోతుంది. జానూ వెళ్ళిన తర్వాత దివ్య వచ్చి కళ్ళు మూసుకుని పడుకున్న విక్రమ్ తలని ప్రేమగా నిమిరి వెళ్తుంది.

నందు ఇంటి దగ్గర తులసి కోసం ఎదురుచూస్తూ ఉండగా బాధగా వస్తుంది. తను మౌనంగా వెళ్లిపోతుంటే ఆపి పలకరిస్తాడు. ఏం  జరిగిందని అడుగతాడు. వెళ్ళి హనీని కలిసి వచ్చినట్టు చెప్తుంది.

నందు: నీ మొహంలో హనీని కలిసిన సంతోషం లేదు. వాళ్ళు నిన్ను ఏదో అన్నారు వాళ్ళని వదిలిపెట్టను

తులసి: హనీ కోసం నేను ఆ ఇంటికి వెళ్ళడం తప్పని మీరు మొదటి నుంచి చెప్పారు. నాకు తప్పని అనిపించక వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళ నోటి నుంచి కూడా అదే మాట వింటే అదే నిజమని అనిపించింది. తల్లి లేని పిల్ల అయ్యేసరికి నేను తనని వదల్లేకపోతున్నా. ఒక్క రోజు కూడా తనని చూడకుండా ఉండలేకపోతున్నా. వాళ్ళు హనీకి దగ్గర అవాలని అనుకుంటున్నారు. ప్రేమ చూపించగలను కానీ ఏమి చేయలేను కదా. హనీ నాకు దగ్గరగా ఉండటం కంటే వాళ్ళకి దగ్గరగా ఉండటం మంచిదని అనిపించింది. అందుకే హనీని కలవనని మాట ఇచ్చి వచ్చాను

లాస్య ఇంట్లో తాగుతూ ఉంటే భాగ్య చిరాకుపడుతుంది. ఇంటికి మా ఆయన వస్తాడు దుకాణం సర్దమని భాగ్య చెప్తుంది కానీ లాస్య మాత్రం వినిపించుకోదు.

భాగ్య: మా ఇంట్లో ఇంక ఎన్నాళ్ళు ఉంటావ్

లాస్య: ఇంకా ఏమి అనుకోలేదు ఏదైనా స్పైసీ గా వండి పెట్టు

Also Read: అమ్మ కావాలంటూ రిషి కన్నీళ్లు, దేవయానికి షాక్ ఇచ్చిన ధరణి - శైలేంద్ర విశ్వరూపం

నందుకి రత్నప్రభ ఫోన్ చేస్తుంది. తులసి ఈ ఇంటి వైపు చూడకూడదని చెప్తే వినిపించుకోలేదు తనని మా ఇంటి మీదకి పంపించావ్. తులసి మాట ఇచ్చింది కదా అంటే తన మీద నమ్మకం లేదని అంటుంది.

రత్నప్రభ: తులసి చేసిన తప్పుకి శిక్ష పడబోతుంది

నందు: జరిగినది ఏదో జరిగింది ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను

రత్నప్రభ: తులసికి శిక్ష పడబోతుంది గుడికి వెళ్ళిన తనని చేతనైతే కాపాడుకో అని బెదిరిస్తుంది. దీంతో నందు కంగారుగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తాడు. తులసి ఎక్కడని పరంధామయ్యని అడుగుతాడు. గుడికి వెళ్తుందని చెప్పేసరికి తులసి ఇంటి బయట బండి మీద వెళ్తూ కిందపడిపోతుంది. కాలికి పెద్ద గాయం అవుతుంది. నడవలేకపోతున్న తులసిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్తాడు.