గుప్పెడంతమనసు సెప్టెంబరు 27 ఎపిసోడ్


చావుబతుకుల మధ్య ఉన్న జగతిని చూసి మహేంద్ర తల్లడిల్లిపోతాడు. వసు-రిషి ఇద్దరూ ధైర్యం చెబుతారు. పాండ్యన్ మాత్రం ఇందతా మౌన ప్రేక్షకుడిలా చూస్తుంటాడు. 
మహేంద్ర: తను ఇక్కడికి వస్తుందని నాకు తెలియదు..లేదంటే నేను కూడా తనవెంటే ఉండేవాడిని. మొదట్నుంచీ నువ్వంటే ప్రాణం..అందుకే తన ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. నీకోసం కఠిన పరీక్షలు ఎదుర్కొంది..ఇప్పటికైనా తనని అర్థం చేసుకో తను నీ కన్నతల్లి..ఈ క్షణం వరకూ తను ఏం చేసినా నీకోసం నీ సంతోషం కోసం చేసింది. తన జీవితం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎంతసేపూ నా కొడుకు నా కొడుకు అంటూ ప్రాధేయపడింది. ఇప్పటికైనా అర్థం చేసుకో నాన్నా
రిషి: డాడ్ ప్లీజ్..నాకిప్పటికే సగం చచ్చిపోయినట్టు అనిపిస్తోంది మీరిలా మాట్లాడొద్దు
మహేంద్ర: నిన్ను బాధపెట్టాలని కాదు..మీ అమ్మ మనసు తెలియాలని చెబుతున్నాను...మీ అమ్మ నీకోసం పడ్డ వేదన గుర్తుచేయాలని చెబుతున్నాను..
మరోవైపు జగతికి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది...
మహేంద్ర: ఇలాంటి పరిస్థితుల్లో మీ మేడంని చూడాల్సి వస్తుందని అనుకోలేదమ్మా వసు.. రిషి నిన్ను దూరం పెట్టాడని నువ్వు జగతితో మాట్లాడడం మానేసావు..మీరిద్దరూ మళ్లీ కలిస్తేనే మీ గురుశిష్యుల బంధం ఉంటుందని చెప్పావంట కదమ్మా.. తనేమైనా కావాలని మిమ్మల్ని దూరం చేసిందా..తనేం చేసినా మీకోసమే కదా వసుధార..మీరు తప్ప తనకి ఎవరున్నారు..తన ప్రపంచమే మీరు..ఓ శిష్యురాలి కోసం ఇంతలా తపించే గురువుని ఎక్కడైనా చూశావా..
వసు: నేను మేడంని దూరం పెట్టినా తనుమాత్రం నా గుండెల్లోనే ఉంది..ఆమెకి ఏం కాదు సార్ మీరు భయపడొద్దు..
మహేంద్ర: జగతి లేకపోతే నేను ఏమైపోతానో అని కుప్పకూలిపోతాడు...రిషి ఓదార్చుతాడు. కొన్నేళ్ల పాటూ జగతి నాతో లేకపోయినా ఉందనే బతికాను. జగతిని మన ఇంటికి తీసుకొచ్చి వరమిచ్చావ్. మా బంధం మధ్య ఉన్న దూరాన్ని చెరిపేశావు. అందరం కలసి సంతోషంగా ఉన్నామన్న సమయంలో పరిస్థితిలు మనపై కక్ష కట్టాయ్. 


Also Read: హాస్పిటల్లో జగతి - తల్లడిల్లిన రిషి, విడిపోతున్న చిక్కుముడులు - త్వరలోనే శుభం!


వసుధార తండ్రి చక్రపాణి అక్కడకు రావడంతో..మహేంద్ర తనకి చెప్పుకుని బాధపడతాడు. భయపడకండి ఏం కాదని ధైర్యం చెబుతాడు. ఎవరికీ ఏ హానీ తలపెట్టని టీచరమ్మని ఆ దేవుడు క్షేమంగా ఉండేలా చూస్తాడు...మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వసుమ్మ మీకోసం షర్ట్ తెమ్మని చెప్పిందంటూ షర్ట్ ఇస్తాడు చక్రపాణి. డాక్టర్ బయటకు రావడంతో కంగారుగా అడుగుతారంతా.. 36 గంటలు గడిస్తే కానీ ఏం జరుగుతుందో చెప్పలేం అనేస్తారు. 


రిషి..వినాయకుడి ముందు నిల్చుని జరిగినదంతా తల్చుకుంటాడు.. 
వసు: ఏంటి సార్ 
రిషి: గతంలో మేడం విషయంలో నేను చాలా తప్పు చేశానంటూ..గతంలో జగతిని అవమానించిన సంఘనటలు అన్నీ గుర్తుచేసుకుంటాడు.. ఓ తల్లిని అనకూడని మాటలు అన్నాను. నేను మేడంని అపార్థం చేసుకున్నాను
వసు: నేను తెలియక చేశాను
రిషి: నన్ను వదిలేసి వెళ్లారని నావైపు నుంచి ఆలోచించి తనని బాధపెట్టాను..కానీ ...తన బాధని గుర్తించలేకపోయాను...తన మనసు అర్థం చేసుకుంటున్న సమయంలో మా మధ్య అగాధం ఏర్పడింది. అసలు నా చుట్టూ ఏం జరుగుతోంది..మేడంకి నాకు మధ్య ఎందుకీ ఈ ఎడబాటు
వసు: దీనికి కారణం మీ అన్నయ్యే అంటే నమ్ముతారా అనుకుంటుంది
రిషి: నాకు అవ్వాల్సిన గాయం మేడంకి అయింది..నేను ఉండాల్సిన సిట్యుయేషన్లో మేడం ఉన్నారు.మేడంకి ఏం కాదు కదా..తను క్షేమంగా ఉంటారా అంటూ వసు చేతులు పట్టుకుని..మా అమ్మ కోలుకోవాలి వసుధారా అని ఎమోషన్ అవుతాడు.. నాకు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు..ఇప్పుడు తల్లిప్రేమను పొందాలని ఉంది వసుధారా..చెప్పు వసుధారా మా అమ్మకి ఏం కాదు కదా 
వసు: ఏం కాదు సార్..మీరిప్పుడు పిలిచిన అమ్మా అనే పిలుపు మేడం ప్రాణాలు కాపాడుతుంది సార్..కచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది...


Also Read: శైలేంద్ర క్రూరత్వం- రిషి మీద అటాక్, ప్రాణాపాయ స్థితిలో జగతి


మహేంద్ర జగతి దగ్గరకు వెళ్లి కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటాడు...రిషి కూడా ఆ వెనుకే వెళ్లబోతుంటే వసుధార ఆపేస్తుంది. ఆయన్ని వెళ్లనివ్వండి అంటుంది. ఇంతకీ నా శత్రువులు ఎవరు, నన్ను చంపాలని చూస్తున్నదెవరు..ఇంత జరిగాక కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నావ్ , నాపై కుట్రలు చేస్తున్నది, ఆటాక్స్ చేస్తున్నది ఎవరు అని అడుగుతాడు...వసుధార సమాధానం చెప్పేలోగా...
రిషీ అంటూ ఫణీంద్ర, శైలేంద్ర, దేవయాని వాళ్లు వచ్చేస్తారు.... ఇప్పుడు జగతికి ఎలా ఉంది మహేంద్ర అని అడుగుతాడు ఫణీంద్ర..
మహేంద్ర: తన పరిస్థితి క్రిటికల్ గా ఉందంటున్నారు..36 గంటలు గడిచేవరకూ ఏమీ చెప్పలేం అంటున్నారు
శైలేంద్ర, దేవయాని  ఇదే అదనుగా ఓవరాక్షన్ చేస్తుంటారు.. ( మహేంద్ర, వసు, ధరణికి నిజం తెలుసుకు కాబట్టి లోలోపలే తిట్టుకుంటారు)
రిషి: ఎవరో దుర్మార్గులు నన్ను చంపాలి అనుకున్నారు..నాకోసం తను బలయ్యాడు.. మా అమ్మకు ఏమీ కాకూడదు పెద్దమ్మా అంటాడు
రిషి నోటి వెంట అమ్మా అనే మాట వినగానే దేవయాని షాక్ అవుతుంది...ఏం కాదు నాన్నా అంటూ లేని ప్రేమ నటించడం మొదలెడుతుంది..
ధరణి దగ్గరగా వెళ్లిన దేవయాని మా వైపు అనుమానంగా చూస్తున్నావేంటని బెదిరిస్తుంది..నువ్వు ఎక్కడా నోరు మెదపకు అలా అయితేనే ప్రాణాలుంటాయి లేదంటే నువ్వు ఉండలవు గుర్తు పెట్టుకో అని బెదిరిస్తుంది..
శైలేంద్ర: పిన్నికి ఇలా జరగడం బాధగా ఉంది..ఇదంతా చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతోంది...
వసుధార అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది...
ఇక్కడ ఉండడం నా వల్లకాదంటూ శలైంద్ర కూడా వసుని ఫాలో అవుతాడు..
వసుధారా ... ఒంటరిగా ఇక్కడేం ఆలోచిస్తున్నావ్..మీ మేడం ఏమంటున్నారు..నీతో మాట్లాడిందా..అనవసరంగా అడ్డం వచ్చింది కదా ఇప్పుడు చూడు పోవాల్సిన ప్రాణాలు పోకుండా ఆవిడ ప్రాణాలమీదకు తెచ్చుకుంది..ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి..అనుకున్నది దక్కించుకునేందుకు ఎంతదూరం అయినా వెళతాను...
ఎపిసోడ్ ముగిసింది...