రిషిని కలిసి ఎలాగైనా జరిగినవన్నీ తనకి చెప్పాలని జగతి కొడుక్కి కాల్ చేస్తుంది. కాల కట్ చేస్తూనే ఉంటాడు. కట్ చేస్తున్నా ఎందుకు చేస్తున్నాడని తిరిగి కాల్ బ్యాక్ చేస్తాడు.
జగతి: నేను నిన్ను కలవాలి. నీతో చాలా విషయాలు చెప్పాలి. నన్ను కలవనని చెప్పొద్దు
రిషి: నేను మిమ్మల్ని జీవితంలో కలవను అనేసి కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేసి ఈ ఒక్కసారి కలవమని అడుగుతుంది. కానీ రిషి కుదరదని చెప్పేస్తాడు. ఇన్ని రోజులు నిజాలు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు చెప్దామంటే మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఎలాగైనా తనకి అన్నీ నిజాలు చెప్పాలని డిసైడ్ అవుతుంది. లెటర్ రాయాలని డిసైడ్ అవుతుంది.
జగతి: నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నీ వ్యక్తిత్వం మీద మచ్చ పడేలా చేశాను. దీనికి కారణం మీ అన్నయ్య శైలేంద్ర అని జరిగినవన్నీ గుర్తు చేసుకుంటుంది. శైలేంద్ర బెదిరించిన విషయాలు మొత్తం రాస్తుంది. రిషికి జరిగిన ఒక్కొక్క ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటుంది. మీ అన్నయ్య నువ్వు అనుకున్నంత మంచి వాడు కాదు. ఎండీ సీటు కోసం నీ మీద దాడి చేశాడు. ఇప్పటి వరకు నీమీద జరిగిన ప్రతి అటాక్ కి కారణం శైలేంద్ర అని రాస్తుంది. ఎలాగైనా ఈ లెటర్ చదివితే వాళ్ళ నిజస్వరూపం తెలుస్తుందని అనుకుంటుంది. ఏంజెల్ రిషికి ఫోన్ చేసి ఊరు వెళ్తున్నానని చెప్తుంది. అప్పటి వరకు కాలేజ్ ని చూసుకోమని అంటుంది.
Also Read: రాజ్ ని ఆకాశానికెత్తేసిన కావ్య- స్వప్న మర్డర్ కి రాహుల్ స్కెచ్, రగిలిపోతున్న రుద్రాణి
రిషి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటే వసు వచ్చి పలకరిస్తుంది. ఏంజెల్ కి ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది.
రిషి: లేదు జగతి మేడమ్ కాల్ చేశారా? డీబీఎస్టీ కాలేజ్ లో కానీ లేదంటే ఇంకేదైన సమస్య ఉందని జగతి మేడమ్ కాల్ చేశారా?
వసు: లేదు ఎందుకు ఎప్పుడు లేనిది అలా అడుగుతున్నారు ఏమైంది?
రిషి: జగతి మేడమ్ నాకు కాల్ చేశారు. ఆవిడ ఎందుకు కాల్ చేశారో మీకు తెలుసా?
వసు: లేదు నాకు మేడమ్ ఫోన్ చేయరు
రిషి: నాకు మీ గురించి తెలియనట్టు మాట్లాడతారు ఏంటి?మీ ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు కదా
వసు: నిజంగా నాకు తెలియదు. మేడమ్ ఎందుకు కాల్ చేశారో మహేంద్ర సర్ కి ఫోన్ చేసి అడగమంటారా?
రిషి: ఈ విషయం గురించి డాడ్ కి మాత్రమే కాదు మేడమ్ కి కూడా కాల్ చేసి అడగొడ్డు
జగతి లెటర్ పోస్ట్ చేయమని డ్రైవర్ కి ఒక కవర్ ఇస్తుంది. ఏంటి అదని మహేంద్ర అడుగుతాడు. వాళ్ళ మాటలు శైలేంద్ర వింటాడు.
జగతి: మన రిషిని మన ఇంటికి తీసుకొచ్చే ఆయుధం. రిషి నన్ను కలిసి నా మాట వింటాడో లేదో తెలియదు. కానీ తనకి తెలయాల్సిన నిజాలు తెలియాలి. అందుకే ఆఅ సమాచారం అందేలా చేశాను. నువ్వు నేను మనం రిషి దగ్గర దాచిన నిజాలు
మహేంద్ర: నువ్వు ఏం చేసిన కరెక్ట్ చేస్తావ్. కానీ ఏం చేశావో చెప్పవచ్చు కదా
జగతి: ఇన్ని రోజుల నా మౌనానికి సమాధానం చెప్పాను. ఇక రిషికి ఆ సమాచారం చేరడమే. ఈ అస్త్రంతో శైలేంద్ర ఆటకి అడ్డుకట్ట పడబోతుంది. మనకి మంచి రోజులు రాబోతున్నాయి
పిన్ని ఏంటి ఇంత ప్రమాదకరంగా మారిందని శైలేంద్ర భయపడతాడు. రిషి మాత్రం జగతి గురించే ఆలోచిస్తాడు. ఒకసారి కలిస్తే ఏమైంది. అటు వసు, ఇటు జగతి మేడమ్ నాకు ఏదో విషయం చెప్పాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళని ఒకసారి మాట్లాడితే ఏమౌవుతుంది. పంతానికి పోవడం ఎందుకు ఒకసారి కలుస్తానని ముందు కాల్ చేస్తాడు. విషయం ఏమిటని అడిగితే డైరెక్ట్ గా మాట్లాడి చెప్తానని అంటుంది.
జగతి: మన జీవితాలని చిన్నాభిన్నం చేసిన నిజం. నీ మీద నిందలు వేసి కాలేజ్ నుంచి పంపించడానికి, నీమీద జరిగిన దాడులకి అన్నింటికీ సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. ఇన్నాళ్ళూ నేను పడిన బాధ నీకు కనిపించాలి. అందుకే డైరెక్ట్ గా కలిసి చెప్పాలని అనుకుంటున్నా
రిషి: సరే డాడ్ ని తీసుకురావద్దు
Also Read: ముకుంద ప్లాన్ సక్సెస్- మరి కృష్ణ ఇచ్చే రివర్స్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది!
జగతి: డాడ్ ని తీసుకురావడం లేదు. నేను ఇప్పుడే బయల్దేరతాను, మళ్ళీ ఆలస్యం అయితే ఏమైనా జరగవచ్చు అనేసరికి కలిసేందుకు రమ్మంటాడు. రిషికి నిజం చెప్పబోతున్నందుకు సంతోషంగా ఉంటుంది. శైలేంద్ర ఆవేశంగా బయటకి వచ్చి రగిలిపోతూ ఉంటాడు. నువ్వు వాడిని చేరుకునేలోపు వాడి ప్రాణాలు గాల్లో కలిపేస్తానని ఎవరికో ఫోన్ చేసి రమ్మంటాడు. రౌడీ రాగానే జగతి, రిషి ఫోటోస్ పంపిస్తాడు. వాళ్ళని చంపేయమని చెప్తాడు. వాళ్ళ మాటలు దూరం నుంచి ధరణి విని షాక్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను మిస్ కాకూడదని చెప్తాడు. జగతిని ఫాలో అవమని చెప్పి డబ్బులు ఇస్తాడు. జగతి నిజం చెప్పేలోపు రిషి ప్రాణాలతో ఉండదని అనుకుంటాడు.
ధరణి: ఏం చేస్తున్నారు అతనికి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు
శైలేంద్ర: నీకు అనవసరమైన విషయం ఇందులో జోక్యం చేసుకోవద్దు
శైలేంద్ర పంపిన మనిషి జగతిని ఫాలో అవుతూ ఉంటాడు. ధరణి రిషికి ఏదో ప్రమాదం తలపెట్టాడని ఎలాగైనా ఆపాలని అనుకుని వసుకి ఫోన్ చేస్తుంది.