‘బిగ్ బాస్’ సీజన్-7 (Bigg Boss Telugu Season 7)లో ఆదివారం దామిని ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున హౌస్‌లో ఉన్నవారికి సలహాలు ఇవ్వాలని తెలిపారు. దీంతో దామిని.. హౌస్‌లో శివాజీ తీరును ప్రస్తావించింది. దీంతో శివాజీ తనదైన శైలిలో స్పందించాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన దామినీ ‘బిగ్ బాస్ బజ్’లో మాట్లాడుతూ.. శివాజీ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని వ్యాఖ్యానించింది. 


ఎలిమినేషన్‌కు ముందు నాగ్.. ఎప్పటిలాగానే ఫన్ గేమ్స్ ఆడించారు. ఈ సారి హౌస్‌లో సభ్యులు ఎలాంటివారో చెప్పే ఆట ఆడించారు. ఈ సందర్భంగా కలర్ వీల్‌ను తిప్పుతూ.. కలర్‌కోడ్‌లో ఉన్న ప్రశ్నలు అడిగారు. హౌస్‌లో కన్నింగ్ కంటెస్టెంట్ ఎవరని నాగార్జున అడగగా.. ఆమె పల్లవి ప్రశాంత్ పేరు చెప్పింది. అతడు నామినేషన్స్ రోజు చాలా అగ్రసివ్‌గా.. మిగతా రోజుల్లో ఎక్కడ ఉన్నాడో తెలియనట్లుగా ఉంటాడని పేర్కొంది. దీంతో నాగ్ స్పందిస్తూ.. ప్రశాంత్ అపరిచితుడని అన్నారు. కంటెస్టెంట్లు వేసుకున్న మాస్క్ 3, 4 వారాల్లో తొలగిపోతుందని, ప్రజలకు అంతా తెలుసని తెలిపారు. 


ఆ తర్వాత ప్రశాంత్ వంతు వచ్చింది. తన ఆటకోసం వ్యక్తులను వాడుకొనే కంటెస్టెంట్ ఎవరని నాగ్ అడిగితే.. శోభాశెట్టి పేరు చెప్పాడు. హౌస్‌లో తేనె పూసిన కత్తి ఎవరని నాగ్.. దామినీని ప్రశ్నించారు. ఇందుకు ఆమె సందీప్ పేరు చెప్పింది. చెప్పాల్సింది చాలా సున్నితంగా చెబుతారని, వినకపోతే ఆయన ఒరిజినాలిటీ బయటకు వస్తుందని దామిని పేర్కొంది. ఇంట్లో నెగిటివీ స్ప్రెడ్ చేసే వ్యక్తి ఎవరు అని సందీప్‌ను నాగ్ ప్రశ్నించారు. ఇందుకు సందీప్.. యావర్ పేరు చెప్పాడు. ఆ తర్వాత యావర్‌ను ఇంట్లో బ్యాక్ బిచింగ్ చేసేది ఎవరన్నారు. ఇందుకు యావర్.. రతిక పేరు చెప్పాడు. 


ఆ తర్వాత రతిక వంతు వచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున ‘‘నిన్ను ఆడనివ్వకుండా కిందకు లాగుతున్నది ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌ల పేరు చెప్పింది. వారిద్దరు తనను ఆట నుంచి డైవర్ట్ చేస్తున్నారని పేర్కొంది. ఇంట్లో కపట నాటక సూత్రదారి ఎవరని.. అమర్‌దీప్‌ను అడిగారు నాగ్. ఇందుకు అతడు శివాజీ పేరును చెప్పాడు. ఆ తర్వాత శివాజీని.. హౌస్‌లో కలుపు మొక్క ఎవరని నాగ్ అడిగారు. ఇందుకు ఆయన టేస్టీ తేజ పేరు చెప్పారు. తాను ఆడడు, ఇతరులను ఆడనివ్వడని అన్నారు. మనిషి మంచోడే.. గుణమే గుడి*** అంటూ నాగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత టేస్టీ తేజకు.. అవతలివారిని హర్ట్ చేసి, సంతోషపడే వ్యక్తి ఎవరనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు అతడు బదులిస్తూ దామిని పేరు చెప్పాడు. అనంతరం ప్రియాంకకు కామన్ సెన్స్ లేని వ్యక్తి గురించి చెప్పాలని నాగ్ అడిగారు. ఇందుకు ప్రియాంక పల్లవి ప్రశాంత్ పేరు చెప్పింది. హౌస్‌లో ఎవరిని ట్రస్ట్ చేయకూడదని గౌతమ్‌ను అడిగారు నాగ్. ఇందుకు గౌతమ్ టేస్టీ తేజ పేరు చెప్పాడు. 


దామిని ఔట్..


చివరిగా హౌస్‌లో తక్కువ ఓట్లు పొందిన దామినీని ఎలిమినేట్ చేశారు నాగార్జున. దీంతో శుభశ్రీ సేఫ్ అయ్యింది. దామిని బయటకు వచ్చిన తర్వాత బెలూన్ పగలగొట్టి.. కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అడిగారు నాగ్. ఈ సందర్భంగా ఆమె శివాజీతో మాట్లాడుతూ.. ‘‘మీరు నన్ను సేఫ్ గేమ్ ఆడావని అంటున్నారు. కానీ, ఇక్కడ ప్రోమో చూసిన తర్వాత నాకు అలా అనిపించలేదు’’ అని అంది. ఇందుకు శివాజీ స్పందిస్తూ.. ‘‘నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనలేదు. నీ గేమ్ నువ్వు ఆడలేదని అన్నాను. ఫస్ట్ వీక్ మాత్రమే గేమ్ ఆడావు. నీ ఫ్రెండ్స్‌ను అడుగు బయటకు వెళ్లిన తర్వాత. నేను అన్నది తప్పయితే తీసుకుంటాను’’ అని అన్నాడు. అలాగే హౌస్‌లో మీరు ఫేవరిజమ్ చేస్తున్నారని దామిని పేర్కొంది. ఇందుకు శివాజీ స్పందిస్తూ.. ‘‘ఇప్పుడు ఎన్ని చెప్పినా వర్కవుట్ కాదు. ఇంటికెళ్లిన తర్వాత చూడు తెలుస్తుంది’’ అని సమాధానం ఇచ్చాడు. హౌస్‌ నుంచి బయటకు వెళ్లిన తర్వాత దామిని.. ‘బిగ్ బాస్ బజ్‌’లో పాల్గొంది. గీతూ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పింది. శివాజీ గురించి అడిగినప్పడు.. ఆయన చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని పేర్కొంది. పల్లవి ప్రశాంత్ గురించి అడిగినప్పుడు.. అసలు తాను అతడి గురించి మాట్లాడదలచుకోలేదని పేర్కొంది. 


నేను సేఫ్ గేమ్ ఆడట్లేదు. నీ గేమ్ నువ్వు ఆడలేదు అని అనుకున్నా. నీ గేమ్ నువ్వు ఆడలేదు. ఫస్ట్ గేమ్ మాత్రమే ఆడావు. నీ ఫ్రెండ్స్‌ను అడుగు బయటకు వెళ్లిన తర్వాత. నేను అన్నది తప్పయితే తీసుకుంటాను. ఫేవరిటిజమ్ క్లియర్‌గా తీసుకుంటాను. ఎప్పుడు ఎన్ని చెప్పినా వర్కవుట్ అవ్వదు. ఇంటికెళ్లిన తర్వాత చూడు తెలుస్తుంది.


Also Read: రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్ - హోస్ట్ అవతారమెత్తిన మంచువారబ్బాయ్!