Krishna Mukunda Murari September 23rd: కృష్ణ ఎందుకు ఫోకస్ అంతా తన మీదకి తీసుకొస్తుందా అని ముకుంద ఆలోచిస్తుంది. ఒకవేళ తన ప్రేమ సంగతి తెలిసి ఇలా చేస్తుందని అనుకుంటే ముసుగులో గుద్దులాట ఎందుకు డైరెక్ట్ గా తేల్చుకుందామని అనుకుంటుంది. మురారీ తిన్న తర్వాత తన చీర కొంగు చెయ్యి తుడుచుకోవడానికి ఇస్తుంది. కృష్ణ ఒడిపోతే తన ప్రేమ దక్కదని బాధపడుతుంది. గదిలో ఉన్న మురారీ దగ్గరకి కృష్ణ వచ్చి మీ గురించి మొత్తం తెలిసిపోయిందని అనేస్తుంది. మీ భాగోతం అంతా ఈ ఫోటోలో ఉందని అంటుంది.


మురారీ: ముకుంద ఫోటోలు ఇచ్చిందేమో అనుకుని వణికిపోతూ ఉంటాడు. ఏముంది ఆ ఫోటోస్ లో అని కంగారుపడతాడు


చిన్నతనంలో మురారీ కృష్ణుడి గెటప్ వేసుకున్న ఫోటోస్ చూపించి కాసేపు ఆట పట్టిస్తుంది. భర్త పట్టుకున్నందుకు కృష్ణ చాలా మురిసిపోతుంది. భవానీ కృష్ణని పిలిచి భర్తల దినోత్సవం ఏప్రిల్ లో అయితే ఇప్పుడు ఎందుకని అబద్ధం చెప్పావని అంటుంది. ముకుంద కోసం అలా చెప్పానని చెప్తుంది.


కృష్ణ: తను ఆదర్శ్ కోసం అన్నీ పనులు నేర్చుకోవాలని చెప్పాను. ఆదర్శ్ తన ప్రపంచంగా మార్చాలని ఇలా చేశాను


Also Read: జానూకి దివ్య వార్నింగ్ - ఎప్పుడూ తన పక్కనే ఉండాలని తులసిని కోరిన నందు


భవానీ: భర్తల దినోత్సవం ఏప్రిల్ లో అని తెలిసి కూడ ఎందుకు అందరిలో అడగలేదో తెలుసా? నీమీద నాకున్న నమ్మకం. నువ్వు ఏం చేసినా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. అది తెలుసుకుందామని చెప్పలేదు


కృష్ణ: మీతో అబద్ధం చెప్పినందుకు సోరి


భవానీ: మంచి పని చేయడానికి ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్పిన తప్పులేదు


ముకుంద అలేఖ్య కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణ ప్రవర్తనలో మార్పు కనిపించింది. తనకి మా ప్రేమ సంగతి తెలిసినట్టు ఉంది. అందుకే ఈ భర్తల దినోత్సవం ప్లాన్ చేసింది. నేను మురారీని ప్రేమిస్తున్నా, తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా సిగ్గు లేకుండా తనకి భార్యగా ఎలా ఉంటుంది


అలేఖ్య: కృష్ణ వల్ల మీ ఇద్దరూ విడిపోలేదని తను చేయని తప్పుకి ఎందుకు జీవితం నాశనం చేసుకోవాలని అనుకుంటుంది


ముకుంద: నువ్వు ఏంటి కృష్ణకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావ్. ఇప్పుడే కదా కృష్ణకి విషయం అర్థం అయ్యిందని తెలిసింది. ఇక నుంచి మా ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. రణమో సరణమో నిర్ణయించుకోవాల్సిందే కృష్ణ. నా ప్రేమని నేను సాధించుకుంటాను


Also Read: కొనసాగుతున్న టామ్ అండ్ జెర్రీ వార్, శైలేంద్రకి జగతి రివర్స్ పంచ్!


మురారీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం, ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని కృష్ణ ఆరాటపడుతుంది. పూజ చేసిన తర్వాత రేవతిని అందరికీ ప్రసాదం పెట్టమని చెప్పేసి భవానీ వెళ్ళిపోతుంది. దేవుడి ప్రసాదం ముందు మురారీకి పెట్టి ఆ తర్వాత కృష్ణని  తినమని చెప్తుంది. రేవతి అందరికీ ప్రసాదం పెడుతుంది. ముకుంద తన ప్రసాదం మురారీకి తినిపించాలని అలేఖ్యతో కలిసి ఏదో ప్లాన్ వేస్తుంది. అలేఖ్య మధుకర్ కి తినిపిస్తుంది. కృష్ణ మురారీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే ముకుంద చెప్పినట్టుగా అలేఖ్య మధుకర్ ని ఆట పట్టిస్తూ పరిగెడుతూ కావాలని కృష్ణ చుట్టు తిరుగుతూ ఉండగా మధు తగలడంతో ప్రసాదం నేలపాలు అవుతుంది. దీంతో కృష్ణ చాలా బాధపడుతుంది. అప్పుడే మురారీ వచ్చి ఏమైందని అంటాడు. తన వల్ల ప్రసాదం నేలపాలు అయ్యిందని మధు చెప్తాడు. అభ్యంతరం లేకపోతే తన దగ్గర ఉన్న ప్రసాదం తినమని ముకుంద చెప్తుంది.