గుప్పెడంతమనసు సెప్టెంబరు 23 ఎపిసోడ్


డ్రామా స్టార్ట్ చేసిన దేవయాని...ఆరోగ్యం పాడైపోయినట్టు, రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నట్టు ఓవరాక్షన్ చేస్తుంది. రిషిని ఒప్పించండి జగతి నా మాట వింటాడు నేను బతిమలాడుకుంటాను...రిషి-వసుని ఇక్కడికి తీసుకొచ్చి నా చేతుల మీదుగా పెళ్లి చేయిస్తే కానీ నాకు తృప్తిగా ఉండదు అంటుంది. వెళ్దాం పదండి అని దేవయాని అంటే..నువ్వెందుకు మమ్మీ..పిన్ని,బాబాయ్ తో నేను వెళతానంటాడు శైలేంద్ర. ఫణీంద్ర కూడా వెళ్లండి అంటాడు. తనంతట తనే మారాలి రావాలి అని సర్దిచెబుతుంది జగతి. అలానే వదిలేస్తారా అని ఫైర్ అవుతాడు ఫణీంద్ర. రిషి రావడం మీకే ఇష్టం లేనట్టుందని శైలేంద్ర మరింత ఆజ్యం పోస్తాడు..మీరు ఎండీ సీటుకోసమే అయితే రిషి వచ్చాక కూడా మీరే ఎండీగా కంటిన్యూ అవండి అని అస్త్రం ప్రయోగిస్తాడు
మహేంద్ర: షటప్ శైలేంద్ర..ఏం మాట్లాడుతున్నావో తెలుసా.. ఎండీ సీటుకోసమే కాదు ఏ పదవి గురించి కూడా జగతి ఆశపడలేదు..తల్లి పదవి కన్నా ఏదీ గొప్పది కాదు.. 
దేవయాని; ఇప్పుడు ఏమన్నాడని
మహేంద్ర: మౌనంగా ఉంటున్నానని నోటికి ఏదివస్తే అది మాట్లాడకూడదు
దేవయాని: ఇప్పుడు ఏం జరిగిందని అంటూ ఫణీంద్రను మరింత ఉసిగొల్పుతుంది


Also Read: రిషి సేవలో వసు, గడువు గుర్తుచేసిన ఏంజెల్ - అయోమయంలో పాండ్యన్ !


కాలేజీకి వెళతాడు రిషి.. అక్కడే నిల్చున్న వసుధారని చూసి ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టున్నారని అడుగుతాడు
వసు: నేను ఎదురుచూస్తున్నవాళ్లు వచ్చేశారు ఇక ఇక్కడ నిల్చోవాల్సిన అవసరం లేదు
రిషి: మీరు నాపై చూపించే శ్రద్ద ఎదుటివారికి అనుమానాలు కలిగిస్తోంది. మన గురించి పాండ్యన్ కూడా అందరిలా ఆలోచిస్తే బావోదు. ఇకపై నాపై శ్రద్ధ తగ్గిస్తే మంచిది
వసు: ఎవరు ఏమనుకున్నా నేను సమాధానం చెప్పగలను. మీపై శ్రద్ధ చూపించకుండా ఉండలేను
రిషి: అందనిదానికోసం ఆరాటపడడంలో ప్రయోజనం లేదు..నాపట్ల తోటి లెక్చరర్ లా కృతజ్ఞతగా ఉండాలి
వసు: మహేంద్ర సార్ వాళ్లతో మీరు కలసి ఉండేవరకూ మీ మంచి చెడ్డలు చూసుకుంటానని మాటిచ్చాను...
వసుధార వెళ్లిపోతుండగా బుక్ జారిపోతుంది..అది తీసి ఇచ్చి సెటైర్స్ వేస్తాడు రిషి..అన్నీ పారేసుకోకండి దొరకవు అని...
ఇంతలో మహేంద్ర కాల్ చేస్తాడు ...
మహేంద్ర: నీపై నిందపడింది కాలేజీలో కదా..కాలేజీకి రావొద్దు కానీ ఇంటికి ఎందుకు రావు..నిన్ను ఇల్లు ఏం చేసింది
రిషి: నన్ను ఇబ్బంది పెట్టొద్దు..
మహేంద్ర: నీకు జగతిపై కోపం ఉంటే తనతో మాట్లాడకు నేనేం చేశాను..నువ్వే మా పరిస్థితి అర్థం చేసుకో. పెదనాన్న నీపై బెంగపెట్టుకున్నారు, మాతో సరిగా మాట్లాడడం లేదు..నువ్వే మా సమస్యకు పరిష్కారం చూపించగలవు..నువ్వు వస్తే ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి 
రిషి: మీరు పిలిచారని నేను రాలేను కానీ నేను చేయాల్సింది చేస్తానంటూ కాల్ కట్ చేస్తాడు
ఏమైందని వసుధార అడుగుతుంది కానీ రిషి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోతాడు...
బావగారితో నేను మాట్లాడనా అని జగతి అడుగుతుంది కానీ మహేంద్ర అంగీకరించడు...దానివల్ల సమస్యలు పెరుగుతాయని ఆపేస్తాడు


Also Read: రిషి కోసం రూమ్ సిద్ధం చేసిన వసు, కొత్త డ్రామా స్టార్ట్ చేసిన దేవయాని!


హాల్లో కూర్చుని ఆలోచనలో పడతాడు ఫణీంద్ర. దేవయాని వస్తుంది.. ఆరోగ్యం బాలేదన్నప్పుడు రెస్ట్ తీసుకోకుండా హాల్లోకి ఎందుకు వచ్చావని అడుగుతాడు. మళ్లీ డ్రామా ప్రారంభిస్తుంది... ఇంతలో ఫణీంద్రకి వీడియోకాల్ చేస్తాడు రిషి...
ఫణీంద్ర: ఇన్నాళ్లూ ఎక్కడున్నావో తెలియక ఆగిపోయాం..ఇప్పుడు కూడా దూరం అవుతానంటే ఎలా
రిషి: నా మనసెప్పుడూ మీ దగ్గరే ఉంటుంది..
ఫణీంద్ర: నీ ఆలోచనలతో స్థిమితంగా ఉండలేకపోతున్నాం.మీ పెద్దమ్మ ఆరోగ్యం బాలేదని చెప్పగానే రిషి కంగారుపడిపోతాడు
దేవయాని: నీపై దిగులుతో నేను మంచం పట్టేలా ఉన్నానంటూ నటన మొదలెడుతుంది... నీకు ఇక్కడకు రావడం ఇష్టం లేకపోతే నీతోనే వచ్చేస్తానంటుంది. నన్ను రమ్మంటావా 
రిషి: వద్దు పెద్దమ్మా..మీరు ఆ ఇల్లు వదిలి రాకూడదు..మీరంతా ఒకేచోట ఉండాలి సంతోషంగా ఉండాలి..నాకోసం మీరు విడిపోకూడదు
ఫణీంద్ర: ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చెయ్.. 
రిషి: మీరు కోపంగా ఉండి ఉంటారు..మనం ఎక్కడున్నా కాలేజీ గురించి ఆలోచించాలి మనుషుల గురించి కాదు.. అక్కడ డీబీఎస్టీ కాలేజీ బాధ్యతలు తీసుకున్నట్టే ఇక్కడో కాలేజీ బాధ్యతలు తీసుకున్నాను...ఇక్కడ ఈ కాలేజీ చూసుకునేందుకు నేను తప్ప ఎవ్వరూ లేరు.. నేను తిరిగి రావాలని కోరుకోవద్దు..నా నిర్ణయాన్ని కాదనకండి..మీరుమాత్రం నేను లేననే కోపాన్ని ఎవ్వరిపైనా చపించకండి..ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు..
అప్పుడే జగతి-మహేంద్ర రావడం చూసి...కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది..రిషి అక్కడున్నా నా పెద్దరికాన్ని గుర్తించాడు కానీ కొందరికే అర్థం కావడం లేదంటూ సెటైర్స్ వేస్తుంది.
కాలేజీకి వెళ్లొస్తాం అని చెప్పిన మహేంద్రతో... సమస్యలేమైనా ఉంటే చెప్పండి మీకు మీరే నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఫణీంద్ర అంటాడు..


Also Read: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు


జగతి-శైలేంద్ర


ఆ తర్వాత మహేంద్ర ఏదో పని ఉందని చెప్పి జగతిని వెళ్లమంటాడు.. జగతితో పాటూ శైలేంద్ర కూడా వెళతాడు. ఏంటి పిన్నీ సీరియస్ గా ఉన్నావ్ అని అంటే.. అందరి కళ్లకు గంతలు కట్టావ్ అవి తీసేసిన రోజు నీకు సమాధి కడతారని రివర్స్ అవుతుంది జగతి.  మీ అందర్నీ చంపేస్తానని బెదిరిస్తాడు. నువ్వెన్ని కుట్రలు చేసినా రిషికి ఏ చిన్న ప్రమాదం జరుగుతుందని తెలిసినా నిన్ను వదిలిపెట్టనంటుంది జగతి. కావాలని బ్రేక్ వేస్తుంది...శైలేంద్ర తల ముందుకి కొట్టుకుంటాడు... అయినా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా కాస్త జాగ్రత్తగా ఉండు లేదంటే మొహం పగిలిపోద్దని హెచ్చరిస్తుంది...