బిగ్ బాస్ సీజన్ 7లో మూడో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. ఈ వారం మొదట్లోనే మూడో పవర్ అస్త్రా కోసం ముగ్గురు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేశారు బిగ్ బాస్. ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, అమర్‌దీప్‌ను కంటెడర్లుగా సెలక్ట్ చేశారు. కానీ అక్కడే ఎన్నో ఫిట్టింగ్స్ కూడా పెట్టారు. చివరికి మూడో పవర్ అస్త్రా కోసం పోటీపడుతున్న వారిలో ప్రిన్స్ యావర్, శోభా శెట్టి మిగలగా.. అమర్‌దీప్ స్థానంలోకి ప్రియాంక జైన్ వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురిలో అర్హులు ఎవరు అనే టాస్క్ మొదలయ్యింది. పైగా ఈ టాస్కులో ఎవరు అర్హులు అనే విషయాన్ని వారినే తేల్చుకోమన్నారు. దీంతో ప్రిన్స్ యావర్‌లోని డ్రామా కింగ్ మరోసారి బయటికి వచ్చాడు.


శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, ప్రియాంక.. మూడో పవర్ అస్త్రాను పొందడానికి పోటీకి సిద్ధమయ్యారు. ఏదో ఒక ఫిజికల్ టాస్క్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యి ఉన్నారు. కానీ వారు అనుకున్నదానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. ముగ్గురిలో ఎరు అర్హులు అనే విషయాన్ని వారినే తేల్చుకోమన్నారు బిగ్ బాస్. దీంతో పవర్ అస్త్రా కోసం ఎవరెవరు ఏమేం చేశారో చెప్పుకోవడం మొదలుపెట్టారు. ప్రియాంక.. తాను జుట్టు కట్ చేసుకున్నానని, అది చాలా పెద్ద విషయమని తన వాదనను మొదలుపెట్టింది. ఆ తర్వాత శోభా.. తమ వీక్‌నెస్ మీద బిగ్ బాస్ గేమ్స్ పెట్టారని, అందరం కష్టపడే ఇక్కడవరకు వచ్చామని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరు అనర్హులు అని అనుకుంటున్నారో యావర్‌కు చెప్పే అవకాశం వచ్చింది.


నువ్వు వీక్.. నేను స్ట్రాంగ్..
శోభా శెట్టి, ప్రియాంక పోటీ పడితే పోటీ సమానంగా సాగుతుందని, అదే యావర్‌తో పోటీ పడితే తను బలవంతుడు కాబట్టి కచ్చితంగా తనే గెలుస్తాడని శోభా తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. దీంతో యావర్‌కు కోపమొచ్చింది. ‘‘నిన్ను నువ్వు వీక్ అనుకుంటున్నావు. టాస్క్‌లో నీకంటే ప్రియాంకనే బాగా ఆడింది కాబట్టి తనే గెలిచింది. నీకంటే తనకే సామర్థ్యం ఎక్కువగా ఉంది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు యావర్. ‘‘సేఫ్ జోన్‌లో ఉండాలనుకుంటోంది. ఆడపిల్లతో ఆడాలనుకుంటోంది. గేమ్ గెలవాలని అనుకుంటోంది.’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ‘‘ఫైటర్ అన్నప్పుడు ఫైట్ చేసి గెలువు.’’ అంటూ రెచ్చగొట్టాడు. 


ప్రియాంక నిర్ణయంపైనే ఆధారం..
‘‘ఇది సరైనది కాదు. ఇది చాలా చెత్త కారణం. తను అర్హత పొందాలి అనుకుంటే పోరాడాలి. ఎవరితో అయినా సరే. అమ్మాయి, అబ్బాయి అని కారణాలు చెప్పకూడదు.’’ అంటూ కెమెరాతో చెప్పుకున్నాడు యావర్. ఆ తర్వాత సంచాలకుడిగా ఉన్న సందీప్.. అనర్హుడిగా ఎవరికి ఓటు వేస్తావని యావర్‌ను అడగగా శోభా శెట్టి పేరు చెప్పాడు. అనర్హులుగా శోభా.. యావర్ పేరు చెప్పింది. యావర్.. శోభా పేరు చెప్పింది. దీంతో ప్రియాంకపై నిర్ణయం ఫైనల్‌గా తేలింది. శోభాలో, యావర్‌లో ఉన్న నెగిటివ్స్‌ను చెప్పి ప్రియాంక తన నిర్ణయాన్ని బయటపెట్టింది. కానీ ప్రియాంక మాటలను అమర్‌దీప్ తప్పుబట్టాడు. స్మార్ట్‌గా ఆలోచించాలి అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఫైనల్‌గా తను మాత్రం శోభా శెట్టితో ఒప్పుకుంటున్నానని, యావర్ అనర్హుడు అని చెప్పింది. పర్సనల్‌గా తీసుకోకు అన్నా కూడా యావర్.. బాధలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు.


పర్సనల్‌గా తీసుకోకు..
‘‘పర్సనల్ కాదు అంటూనే పర్సనల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు.’’ అంటూ సీరియల్ అవ్వడం మొదలుపెట్టాడు యావర్. ప్రియాంకపై వేలెత్తి చూపడంతో తనకు కూడా కోపం వచ్చింది. ‘‘పర్సనల్‌గా తీసుకోకు అనడం, అరవకు అని చెప్పడం.. ఇదంతా చేయడానికి నువ్వు ఎవరు’’ అంటూ అరవడం మొదలుపెట్టాడు. ఫైనల్‌గా ప్రియాంక.. తన నిర్ణయాన్ని బిగ్ బాస్‌కు చెప్పింది. ఓడిపోవడం తీసుకోలేడు అంటూ యావర్‌పై వ్యాఖ్యలు చేసింది. దీంతో యావర్.. మళ్లీ అరవడం మొదలుపెట్టాడు. అయినా కూడా ప్రియాంక, శోభా కలిసి యావర్‌ను తొలగించి ఫైనల్ కంటెండర్స్ అయ్యారు. విచక్షణ కోల్పోయిన యావర్.. బిగ్ బాస్ ప్రాపర్టీని పగలగొట్టాడు. సందీప్.. అలా ఎందుకు చేశావని అడగగా.. ‘‘బిగ్ బాస్ చూసుకుంటాడు’’ అంటూ మళ్లీ అరవడం మొదలుపెట్టాడు. ఆపై కన్నీళ్లు పెట్టుకున్నాడు.


లోన్ తీసుకొని వచ్చాను..


బిగ్ బాస్‌కు వచ్చే ముందు లోన్ తీసుకున్నానని శివాజీ ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు యావర్. ‘‘మా అన్నయ్య నాకు షూస్ ఇచ్చాడు. నేను ఎక్కువ బట్టలు అడగలేను. ఎందుకంటే మాకు అంత స్థోమత లేదని మాకు తెలుసు. నాకు కోపం ఉంది కానీ ఇంకేమీ లేదు. అందరి దగ్గర ఎంతోకొంత డబ్బులు ఉన్నాయి. అందరూ పనిచేస్తున్నారు. కానీ నాకు ఉద్యోగం లేదు. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జీరో బ్యాలెన్స్‌తో వచ్చాను’’ అన్నాడు యావర్. అంతే కాకుండా తన దగ్గర అస్సలు బట్టలు లేవని వాపోయాడు. యావర్ బాధకు శివాజీ ఓదార్పు ఇచ్చాడు.


Also Read: 2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial