బిగ్ బాస్ సీజన్ 7లో మూడో వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రతీ వారంలాగానే ఈ వారం కూడా ఒకరు బిగ్ బాస్ హౌజ్‌ను విడిచి వెళ్లక తప్పదు. ఈ వారం అలా వెళ్లిపోయే కంటెస్టెంట్ ఎవరు అంటూ రూమర్స్ మొదలయ్యియి. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7 నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ ఇద్దరూ సీనియర్ నటీమణులు. మొదటి వారంలో సీనియర్ హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో షకీలా హౌజ్‌ను వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు మూడోవారం కూడా ఒక లేడీ కంటెస్టెంట్ హౌజ్‌ను విడిచి వెళుతుందని రూమర్స్ మొదలయ్యాయి. డేంజర్ జోన్‌లో ఒక లేడీ కంటెస్టెంట్ ఉందని, చాలావరకు తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని సమాచారం.


నామినేషన్స్‌లో ఏడుగురు


ప్రియాంక జైన్, అమర్‌దీప్, శుభశ్రీ, రతిక, దామిని, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్.. బిగ్ బాస్ సీజన్ 7లోని మూడోవారంలో నామినేషన్స్‌లో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 మూడోవారం చేరుకునేసరికి కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. అందుకే ఈసారి నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ ఎక్కువగా ఒకరిని ఒకరు పర్సనల్‌గా టార్గెట్ చేసినట్టు అనిపించింది. దామిని, శుభశ్రీలకు ఎక్కువ నామినేషన్సే పడ్డాయి. అయితే మూడోవారంలో ఈ ఏడుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని వారం మొదటి నుంచి అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఆ ఒక్క కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉందని, దాదాపు తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.


డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు


ఇప్పటివరకు బయటికి వచ్చిన బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఓటింగ్ అంచనాల ప్రకారం ప్రియాంక జైన్ లీడింగ్‌లో ఉంది. సీరియల్ నటి కావడం, హౌజ్‌లో చాలా బ్యాలెన్స్‌గా ఉండడం వల్ల ప్రియాంకను బిగ్ బాస్ ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే దామిని, శుభశ్రీ.. డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఈ ఇద్దరిలో కూడా దామినినే ఎక్కువశాతం ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఆమె వినాయక చవితి రోజు మతపరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘‘ ఈ రోజు వినాయక చవితికి తను కూడా వచ్చి అక్షితలు వేశాడు’’ అని దామిని సందీప్‌తో చెప్పింది. ఆమె చేసిన వ్యాఖ్యలు యావర్ గురించే అని తెలుస్తోంది. ‘బిగ్ బాస్’ రూల్ ప్రకారం.. హౌస్‌లో కుల, మత, వర్గాల ప్రస్తావించకూడదు. కానీ, దామిని నిజంగా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే ఆమె ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయమని సమాచారం. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7లో ఎంటర్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మూడోవారు ఎలిమినేషన్‌కు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఈ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కచ్చితంగా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.






ఆ గొడవలే కారణం


ఒక సింగర్‌గా బయట మంచి గుర్తింపు సాధించుకున్న దామిని.. బిగ్ బాస్ సీజన్ 7లో ఒక కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్ అయ్యింది. హౌజ్‌లో ఎంటర్ అయిన తొలిరోజు నుంచి తను కిచెన్ బాధ్యతలను స్వీకరించింది. అందరికీ వంట చేసి పెట్టింది. ఎవరితో ఎక్కువగా కలవనట్టు అనిపించినా.. సమయానుసారం అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటూ వెళ్లింది. కానీ ఈమధ్యకాలంలో హౌజ్‌లో పలువురితో దామిని గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రిన్స్ యావర్‌తో ఎప్పుడూ గొడవపడుతున్నట్టుగానే అనిపించేది దామిని. దాని వల్ల యావర్‌కు ఏమీ ఎఫెక్ట్ అవ్వకపోయినా.. దామిని మాత్రం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.


Also Read: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial