సినిమా ఇండస్ట్రీ అన్నాక హీరో హీరోయిన్ల పై గాసిప్స్ రావడం సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్లు ఎవరితోనైనా కొద్దిగా క్లోజ్ గా మూవ్ అయితే గాసిప్ రాయుళ్లు వాళ్లకి ఎఫైర్లు అంటగడతూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాక ఈ గాసిప్స్ కి హద్దు పద్దు లేకుండా పోయింది. సెలబ్రెటీల ఫోటోలను తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఇష్టం వచ్చిన కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. గత మూడు రోజుల నుంచి సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందన్న వార్తలు నెట్టింట తెగ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.


ఓ డైరెక్టర్ ని సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, అందుకు సంబంధించిన ఫోటో ఇదే అని, వారిద్దరూ దండలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కొందరు షేర్ చేసి వైరల్ చేశారు. దీంతో చాలామంది నిజంగానే సాయి పల్లవి పెళ్ళి అయిపోయిందని నమ్మేశారు. అసలు ఆ ఫోటోలో ఉన్న దర్శకుడు ఎవరరో కూడా పట్టించుకోలేదు? అసలు విషయం ఏంటంటే, ఆ ఫోటో ఓ సినిమా పూజా కార్యక్రమంలో భాగంగా తీసింది. ఆ ఫోటోలో ఉన్న దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. తమిళ ఇండస్ట్రీలో ఓ సినిమాకి పూజా కార్యక్రమం చేస్తున్నారంటే చిత్ర యూనిట్ మొత్తానికి దండలు వేసి.. పండితులు వారిని ఆశీర్వదిస్తారు.






అలా చిత్ర బృందం మొత్తం నిలబడి ఉన్న ఫోటోలో కేవలం డైరెక్టర్, సాయి పల్లవి ఫోటోలు కట్ చేసి పెళ్లి ఫోటోగా చిత్రీకరించారు. దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఎట్టకేలకు ఈ న్యూస్ పై సాయి పల్లవి రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.. "నిజం చెప్పాలంటే నేను రూమర్స్ ని పెద్దగా పట్టించుకోను. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితుల జోలికొస్తే నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి పెయిడ్ బోట్స్‌తో ప్రచారం చేయడం పూర్తిగా నీచమైంది" అంటూ తన ట్విట్టర్లో రాస్కొచ్చింది సాయి పల్లవి.


ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక 'ఫిదా' సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమా తోనే తన నటనతో అందరిని ఫిదా చేసింది. ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'పడి పడి లేచే మనసు' 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్', 'విరాటపర్వం' వంటి సినిమాలతో అగ్ర హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరగా 'గార్గి' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగచైతన్య సరసన మరోసారి జోడీ కట్టనుంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.


Also Read : ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial