‘బిగ్ బాస్’ సీజన్-7 మాంచి రసపట్టులో ఉంది. ప్రస్తుతం పవర్ అస్త్ర కోసం జరుగుతోన్న టాస్కులు.. ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. హోస్ట్ నాగార్జున చెప్పినట్లుగానే.. అంతా ఉల్టాఫుల్టాగా షో సాగుతోంది. ముఖ్యంగా కొన్ని సిట్యువేషన్స్ కంటెస్టెంట్లకు ఊహించని మైలేజ్‌ను ఇస్తున్నాయి. ఇప్పటికే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు ఎక్కడాలేని క్రేజ్ వచ్చేసింది. హౌస్‌లోని కంటెస్టెంట్లు అంతా అతడిని టార్గెట్ చేసుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ప్రిన్స్ యావర్‌‌పై కూడా ప్రేక్షకులు జాలి చూపిస్తున్నారు. కారణం.. విజేతగా నిలబడేందుకు ఎంత కష్టపడుతున్నా.. లక్ కలిసి రావడం లేదు. పవర్ అస్త్ర చేతి వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోతుంది. 


యావర్‌కే ఎందుకలా?


రెండో పవర్ అస్త్ర కోసం జరిగిన టాస్క్‌లో యావర్ ఎంత కష్టపడ్డాడో ప్రేక్షకులు చూశారు. అది టీమ్ ఆడిన గేమ్. కానీ, ప్రిన్స్ బలం ఆ టీమ్ విజయానికి కారణమైంది. అయితే, రణధీర టీమ్‌లో అతి తెలివి ప్రదర్శించి శివాజీ, షకీలాలకు ఆ క్రెడిట్ ఇచ్చేశారు. దీంతో ప్రిన్స్‌కు అన్యాయం జరిగింది. ఆ కోపంతో ప్రిన్స్ చాలా సేపు పోరాడాడు. కానీ, ఫలితం లేకపోయింది. తాజాగా మూడో పవర్ అస్త్ర కోసం ‘బిగ్ బాస్’ ప్రిన్స్ యావర్‌, అమర్ దీప్, శోభాశెట్టిలను ఎంపిక చేశాడు. ప్రిన్స్ తన అర్హత నిరూపించుకోవాలంటూ చాలా దారుణమైన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సుమారు గంట సేపు స్టాండ్‌బై తలపెట్టి.. చిన్ పైకి లేవకుండా ఉండాలి. అతడిని రతిక, దామిని, టేస్టీ తేజ డిస్ట్రబ్ చేయాలి. దీంతో వారు సబ్బు నీళ్లు, ఐస్‌తో అతడిని కదిపేందుకు ప్రయత్నించారు. బిగ్ బాస్ పంపిన పేడ, గడ్డితో నరకం చూపించారు. అయినా ప్రిన్స్ కదలకుండా తన సత్తా చాటాడు. ఆ టాస్క్‌లో విజేతగా నిలిచాడు. చెప్పాలంటే మిగతా కంటెస్టెంటులకు ఇచ్చిన టాస్కులు కంటే ప్రిన్స్ ఎదుర్కొన్న టాస్కే చాలా కష్టమైనది. 


యావర్, గౌతమ్‌లకు అన్యాయం?


అలాగే, డాక్టర్ బాబు గౌతమ్‌కు కూడా స్పైసీ చికెన్ టాస్క్‌లో అన్యాయం జరిగింది. అన్ని ముక్కలు కరెక్టుగానే తిన్నా.. సంచాలకుడు సందీప్ నిర్ణయం వల్ల గౌతమ్ పవర్ అస్త్ర కంటెస్టెంట్‌గా ఎంపికయ్యే ఛాన్స్ కోల్పోయాడు. దీంతో శోభాశెట్టి, ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లు పవర్ అస్త్ర కోసం పోటీ పడాల్సిన కంటెస్టెంట్‌లుగా ఎంపికయ్యారు. అయితే, బిగ్ బాస్ మరో మెలిక పెట్టాడు. ముగ్గురిలో ఎవరు వీకేస్ట్ కంటెస్టెంట్ అని భావిస్తారో వారి బొమ్మను సుత్తితో పగలగొట్టి కంటెండర్ షిప్ రేస్ నుంచి తప్పించాలని ఆదేశించాడు. అయితే.. ప్రియాంక, శోభాశెట్టి ప్రిన్స్ యావర్ అనర్హుడని ప్రకటించడంతో తుది టాస్క్ నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. 


పవర్ అస్త్ర పోటీదారులుగా శోభాశెట్టి, ప్రియాంక - కన్నీరు మున్నీరైన యావర్


దీంతో యావర్ కన్నీరు మున్నీరయ్యాడు. శివాజీ దగ్గరకు వెళ్లి తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో శివాజీ.. ‘‘యావర్ దేవుడు నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. అప్నా టైమ్ ఆయేగా(నీకు కూడా టైమ్ వస్తుంది) గుర్తుపెట్టుకో’’ అనే డైలాగ్‌తో ప్రిన్స్‌ను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రియాంక, శోభాశెట్టికి బుల్ గేమ్ ఇచ్చాడు. ‘‘నా బ్రదర్ నాకు ఆవేశాన్ని ఇచ్చాడు. అప్పట్లో మా అమ్మ దగ్గర రూ.100 కూడా లేవు’’ అంటూ హిందీలో మాట్లాడుతూ వాపోయాడు. ప్రిన్స్ ఏడుపు చూస్తుంటే.. ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో కామెంట్స్ చూస్తే.. అంతా యావర్‌కు ఫేవర్‌గానే ఉన్నారు. యావర్ ఎంత శ్రమ, రతిక వెన్నుపోటు, అతడి చుట్టూ జరుగుతున్న కంటెస్టెంట్లు చేస్తున్న రాజకీయాలను ప్రేక్షకులు గమనిస్తున్నారు. ఇది యావర్‌కు తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి మిగతా కంటెస్టెంట్ల కంటే యావర్‌కు పాపులారిటీ చాలా తక్కువ. ఈ వారం మాత్రం యావర్‌కు ఫేవర్‌గా ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. తాజా ప్రోమోను ఇక్కడ చూడండి.



Also Read: ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ‘బిగ్ బాస్’ రతికపై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్?