ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసం బిగ్ బాస్.. ఎన్నో డిఫరెంట్ టాస్కులను ప్లాన్ చేస్తుంటారు. ఆ టాస్కుల కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగాలని, ఆ గొడవల వల్ల ప్రేక్షకులు ఎంటర్‌లైన్ అవ్వాలన్నదే ‘బిగ్ బాస్’ ఇంటెన్షన్ అని ఫ్యాన్స్ అంటుంటారు. కానీ ‘బిగ్ బాస్’ అంటే ఆ గొడవలు మాత్రమే కాదు.. ఒక్కొక్కసారి కంటెస్టెంట్స్ మనోస్థైర్యాన్ని పరీక్షించడానికి కూడా ‘బిగ్ బాస్’ ప్రయత్నిస్తుంటారు. అసలు వారు జీవితంలో చేయగలరా అనిపించే పనులను కూడా ‘బిగ్ బాస్’ హౌజ్‌లో చేయిస్తుంటారు. అందులో ఒకటి హెయిర్ కట్. ఇప్పటివరకు ‘బిగ్ బాస్ 6’ సీజన్లు పూర్తి చేసుకోగా.. అందులో ఐదుగురు కంటెస్టెంట్స్‌‌లు తమ జుట్టును త్యాగం చేశారు. అందులో ఇప్పుడు ‘బిగ్ బాస్ సీజన్ 7’లో కూడా ఇదే సాంప్రదాయం కొనసాగింది. దీంతో ‘బిగ్ బాస్’ నీకు ఇదేం ఫాంటసీ అంటూ మీమ్స్ వస్తున్నాయి. ‘బిగ్ బాస్’ను ‘విక్రమార్కుడు’ సినిమాలో అత్తిలి సత్తిబాబులా తయారయ్యాడని అంటున్నారు.


రెండో సీజన్ నుంచి మొదలు


‘బిగ్ బాస్’ తెలుగులో మొదటి సీజన్‌లో ఈ బిగ్ బాస్ ట్రెండ్‌ను ప్రారంభించలేదు మేకర్స్. రెండో సీజన్ నుండే టాస్కుల పేరుతో హెయిర్ కట్ అనే ఆనవాయితీ మొదలయ్యింది. ముందుగా ‘బిగ్ బాస్’ సీజన్ 2లో దీప్తి సునయన.. టాస్క్‌లో భాగంగా హెయిర్ కట్ చేసుకుంది. ఆ తరువాతి సీజన్‌లో శివజ్యోతి ఆ టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 4కు వచ్చేసరికి ఒక కంటెస్టెంట్ కాదు.. ఇద్దరు కంటెస్టెంట్స్‌కు ఈ టాస్క్ వచ్చింది. వారే అలేఖ్య హారిక, అమ్మ రాజశేఖర్. అలేఖ్య హారికకు హెయిర్ కట్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. అమ్మ రాజశేఖర్‌కు మాత్రం గుండు టాస్క్ ఇచ్చాడు. అది కూడా సగం గుండు. ఆ టాస్క్‌ను స్వీకరించిన అమ్మ రాజశేఖర్.. దాదాపు వారం రోజుల పాటు సగం గుండుతోనే బిగ్ బాస్ హౌజ్‌లో తిరిగాడు.


అంతా పవర్ అస్త్రా కోసమే


ఇక లేటెస్ట్‌గా గతేడాది ప్రసారమయిన ‘బిగ్ బాస్’ సీజన్ 6లో వసంతి కృష్ణన్.. హెయిర్ కట్ టాస్క్‌కు ఒప్పుకుంది. మునుపటి సీజన్స్‌లోని కంటెస్టెంట్స్‌తో పోలిస్తే హెయిర్ కట్ తర్వాత వసంతి కృష్ణన్ చాలా క్యూట్‌గా అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 7లో ఆ టర్న్ ప్రియాంక జైన్‌కు వచ్చింది. ఇప్పటికే ప్రియాంక.. హెయిర్ కట్ చేసుకున్నట్టుగా తాజాగా విడుదలయిన బిగ్ బాస్ ప్రోమోలో తెలుస్తోంది. మూడో పవర్ అస్త్రా కోసం ముగ్గురు కంటెస్టెంట్స్‌ను సెలక్ట్ చేశారు బిగ్ బాస్. వారే ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, అమర్‌దీప్. అయితే ఈ ముగ్గురినే ప్రత్యేకంగా సెలక్ట్ చేయడం చాలామంది ఇతర కంటెస్టెంట్స్‌కు నచ్చలేదు. అందుకే వారు అనర్హులు అని అనిపించడానికి తగిన కారణాలు చెప్పమని బిగ్ బాస్ అడిగారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎవరి కారణాలు వారు చెప్పారు.


టాస్క్ వల్ల మారిపోయిన రిజల్ట్


పవర్ అస్త్రా కోసం పోటీలో ఉన్న అమర్‌దీప్ అనర్హుడు అని ప్రియాంక తప్పా ఎవరూ చెప్పలేదు. అంతే కాకుండా అమర్‌దీప్ కంటే తనే ఎక్కువ అర్హురాలు అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. దీంతో పవర్ అస్త్రా కోసం పోటీపడే అవకాశం ప్రియాంకకు దక్కాలంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ను చేయాలి. అదే హెయిర్ కట్. దీంతో పవర్ అస్త్రా కోసం ప్రియాంక హెయిర్ కట్‌కు కూడా సిద్ధపడింది. దీంతో మూడో పవర్ అస్త్రా కోసం పోటీలో ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక నిలిచారు. దానికోసం ఈ ముగ్గురి మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. మొత్తంగా మూడో పవర్ అస్త్రా ఎవరికి దక్కుతుంది అనే విషయం నేడు (సెప్టెంబర్ 22న) ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది.


Also Read: పుంజుకుంటున్న ప్రిన్స్, ఆ ఇద్దరికీ గండం - మతపరమైన వ్యాఖ్యలతో ఆ కంటెస్టెంట్ ఔట్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial