Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

Astrological prediction for September 23, 2023

Continues below advertisement

మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు.షేర్ మార్కెట్‌లో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు

వృషభ రాశి 
ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అప్పులు చేయకపోవడమే మంచిది. చిన్న విషయాలకు ఎక్కువ బాధపడొద్దు. ముఖ్యమైన విషయాలపైనుంచి దృష్టి మరల్చుకోవద్దు. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఉండొచ్చు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

మిథున రాశి
ఈ రాశివారు మాటతీరుపై నియంత్రణ పాటించడం మంచిది. కార్యాలయంలో అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మీ జీవనశైలి చాలా బాగుంటుంది. వ్యాపారంలో మీ పురోగతితో మీరు సంతృప్తి చెందుతారు. సంతోషం కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. 

కర్కాటక రాశి
ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు చేయాలి అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేయాలి. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. సోదరుల కారణంగా కలత చెందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. యువత తమ కెరీర్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే సరైన సమయం.

Also Read: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

సింహ రాశి
కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన విషయాల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో ఒత్తిడులు తొలగిపోతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

కన్యా రాశి
ఈ రాశివారు కెరీర్ పట్ల కొత్త ప్రయోగాలు చేస్తారు. మీ దినచర్యకు భంగం కలిగే అవకాశం ఉంది. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కొన్ని కారణాల వల్ల మీ మనసులో ఒత్తిడి ఉంటుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల పని చెడిపోతుంది. 

తులా రాశి
ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు.  మీ దినచర్య క్రమశిక్షణతో ఉంటుంది. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా చేస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగులకు బదిలీలుంటాయి. 

Also Read: ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!

వృశ్చిక రాశి
ఈ రాశివారిని అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. మీ అభిప్రాయాలను ఎవ్వరిపైనా రుద్దొద్దు. ఈ రోజు మీరు ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం లభిస్తుంది. కొన్ని కారణాల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి

ధనుస్సు రాశి
ఈ రాశివారు కొత్తగా ఏదైనా ప్రారంభించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి కెరీర్ పరంగా ఎదుగుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. ఆహారంలో స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావంలో ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. 

మకర రాశి
అత్యవసరం అయితే కానీ దూర ప్రయాణం చేయాలనుకోవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త పడండి. మిమ్మల్ని అడగకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఉద్యోగులు కార్యాలయంలో అధికారులతో అనవసర వాదనలకు దిగొద్దు. 

Also Read: ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

కుంభ రాశి
ఈ రాశివారు పనిపై దృష్టి సారిస్తారు. భాగస్వామ్య వ్యాపారం నుంచి ప్రయోజనం పొందుతారు.  మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాల్లో స్థిరపడతారు.

మీన రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కొత్త ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపారంలో సౌలభ్యం ఉంటుంది. మీరు కార్యాలయంలో మీ ప్రత్యర్థులను అధిగమిస్తారు. మీ సామాజిక స్థానం బలపడుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

Continues below advertisement