Astrology :  ఇందులో ఉండే మొత్తం ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. ఎందుకంటే ఒక్కో రాశిలో మూడు నక్షత్రాలు, మొత్తం 9 పాదాలుంటాయి. మీ జన్మ నక్షత్రం, పాదం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. ఇవి కేవలం మీ రాశి ఆధారంగా చెప్పే లక్షణాలు మాత్రమే.  


తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


ఈ రాశిలో త్రాసు ధరించిన పురుషుడు కనిపిస్తాడు. సమాజంలో వర్తకుడు త్రాసు ధరిస్తాడు. అంటే వీరు స్ధిర చిత్తం కలిగి ఉంటారు. ధర్మాధర్మాల విచక్షణ, సమయోచితంగా ప్రవర్తించడం , ఇతరులకు సహాయపడటం, అవకాశాలు, ధనం, కాలం, సాధనాలు సరిగా వినియోగించడం, చిన్న వస్తువులను, సంఘటనలను సరిగా గుర్తుంచుకోవటం వీరి లక్షణాలు. ఆరోగ్యవంతులు, ఐశ్వర్య వంతులుగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు.


వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


వృశ్చికం అంటే తేలు. తేలు కనపడితే జనం చంపుతారు..అంటే ఇతరుల నుంచి తనను కాపాడుకోవటం కోసం రహస్య ప్రవర్తన కలిగి ఉంటుంది. అలాగే ఈరాశివారు కూడా రహస్య ప్రవర్తన ఉండే సూచనలెక్కువ. తమకుఏ మాత్రం హానికలగకుండా  చూసుకుంటార...ఇతరులకు హాని కలిగించే మాటలు, పనులు చేస్తారు. పౌరుషం ఎక్కువ. ఎవ్వర్నీ ఖాతరు చేసే రకం కాదు. ఉన్నంతలో సంతృప్తిచెందుతారు. 


Also Read: ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!


ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 


నడుము కింది భాగం అశ్వ రూపం కలిగి వీళ్ళు ధరించిన మానవ రూపం. ధనుర్ధారుడికి ఉండే ఏకాగ్రత, కార్యదీక్ష, పట్టుదల కలిగి ఉంటారు. కానీ కదలిక లేని స్వభావం వీరిది. ఇతరుల ఆదేశానుసారం నడుచుకుంటారు. చాలాజాగ్రత్తగా అన్ని విషయాలను పర్యవేక్షిస్తారు. తెలిసినది తక్కువైనా ఎక్కువదానికే గురి చూస్తారు. కష్టపడి పనిచేస్తారు. 


మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)


లేడి ముఖం మొసలి రూపం కలిగి ఉన్న రాశి ఇది. లేడికి ఉండే సుకుమారం, లావణ్యత, నాజూకుతనం...మొసలికి ఉండే పట్టుదల, పొంచి ఉండి అవకాశం రాగానే కబళించే స్వభావం కలిగి ఉంటారు. ఏమి ఎరుగని మనస్తత్వంలా కనిపిస్తారు కానీ సమయం చూసి పట్టు పడతారు. పట్టిన పట్టు వదలరు. ఇతరుల కష్టసుఖాలతో పెద్దగా సంబంధం ఉండదు..తమ పని పూర్తైతే చాలనే ఆలోచనలో ఉంటారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. 


కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)


నీటి కడవ ధరించిన మానవ రూపం. కొత్త నీరు, నవ జీవనం కలిగి ఉంటారు. వీరి చుట్టూ ఈర్ష్య, అసూయ ఉంటాయి. డబ్బుకోసం చాలా కష్టపడతారు. సంకుచిత స్వభావం కలిగి ఉన్నందున పెద్ద పెద్ద అవకాశాలు పోగొట్టుకుంటారు. పరమ బద్ధకస్తులు. మెండిగా ఉంటారు. ఏ విషయంలో అయిన త్వరగా బయట పడరు. 


Also Read: ఈ ఆలయ నిర్మాణానికి 39 ఏళ్లు పట్టింది, దీని ప్రత్యేకత ఏంటంటే!


మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


రెండుచేపలు ఒకదాని తోక వైపు మరొక చేప తల ఉన్నట్లుండే రూపం. వీరికి సంగీత, సాహిత్యాలపై ఆసక్తి ఉంటుంది. బాగా సంపాదిస్తారు కానీ పెద్దగా ఖర్చు చేయరు. వీరిది నీటి ప్రవాహంలో సాగే ప్రయాణం లాంటిది. జీవితంలో అప్పటి పరిస్థితుల ఆధారంగా అలా సాగిపోతారు. సమయాన్ని ఆసరాగా చేసుకుని వృద్ధి చెందుతారు. కొత్తవారితో స్నేహాలు పెంచుకుంటారు. ఆరోగ్యవంతులుగా జీవిస్తారు.