గుప్పెడంతమనసు సెప్టెంబరు 22 ఎపిసోడ్
రిషి దగ్గరకు వెళ్లి పిలుస్తానంటూ దేవయాని కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది. రిషి దగ్గరకు వెళ్తానంటూ వెళ్లిపోతుంటుంది...ఎవ్వరూ ఆపడం లేదంటని అనుకుంటూ కళ్లు తిరిగిపడిపోయినట్టు యాక్షన్ చేస్తుంది. రిషి విషయంలో ఎమోషనల్ అయి కళ్లు తిరిగిపడిపోయినట్టుందని శైలేంద్ర ఇంకొంచెం ఎక్కువ చేస్తారుడ. ఇదంతా డ్రామా అని జగతి, మహేంద్ర, ధరణి గమనిస్తారు. అసలు విషయం తెలియని ఫణీంద్ర మాత్రం కంగారుపడిపోతాడు. ఫణీంద్ర: చూశావా మహేంద్ర..దేవయాని ఎంత బాధపడుతుందో..రిషిని వదిలి ఉండలేకపోతోంది..ఇప్పుడెలా అనేసి..ఈ సమస్య వచ్చింది మీ వల్లే మీరే ఈ సమస్యను సాల్వ్ చేయాలి..నువ్వు చెబితే రిషి వింటాడు మహేంద్ర వెళ్లి రిషిని నువ్వే తీసుకురా అని ఆర్డర్ వేసి ఫణీంద్ర కూడా వెళ్లిపోతాడు..
Also Read: రిషి కోసం రూమ్ సిద్ధం చేసిన వసు, కొత్త డ్రామా స్టార్ట్ చేసిన దేవయాని!
అటు వంటచేస్తున్న వసుధార దగ్గరకు వస్తాడు పాండ్యన్. సార్ ఎలా ఉన్నారని అడిగితే..ఆయనకు నిజం తెలిసిపోయింది అని చెప్పగానే వసు కంగారుపడుతుంది..కానీ సార్ ఇక్కడే ఉంటారులెండి అంటాడు. ఒకరి విషయాలు మరొకరికి తెలియాలంటే ఇద్దరూ బాగా కావాల్సిన వాళ్లు అయిఉండాలి.. మీకు గతంలో పరిచయం ఉందా..రిషికి సంబంధించిన ప్రతి మూమెంట్ మీకు తెలుస్తుంది..మీ ఇద్దర్నీ చూస్తుంటే మీకు గతంలో పరిచయం ఉందని అనిపిస్తోంది
వసు: ఓ విషయంలో డౌట్ రాకూడదు..మేం ఇద్దరం విష్ కాలేజీలోనే పరిచయం అయ్యాం
పాండ్యన్: నేను కాఫీ ఇచ్చినప్పుడు అది మీరు పంపించారని తెలిసింది.. ఇప్పుడు రూమ్ కూడా మీరే సర్దారని తెలిసింది
వసు: అల్లరిగా ఉండే నువ్వు ఒక్కసారి మారిపోయావ్.. నేను కూడా రిషి సార్ కి ఫ్యాన్ అయిపోయాను.. ఇంకే మనసులో పెట్టుకోవద్దని సర్ది చెబుతుంది.
పాండ్యన్ తో భోజనం పంపిస్తుంది.. అది తిన్న రిషి.. వసుధార మేడం వెళ్లిపోయారా అని అడుగుతాడు ( నేను భోజనం చేశానో లేదో తెలుసుకునేవరకూ తను వెళ్లదు అనుకుంటాడు). నువ్వెళ్లి వసుధార మేడంని పంపించు అంటాడు.. పాండ్యన్ షాక్ అవుతాడు.. ఏం మాట్లాడలేక బయటకు వెళ్లి..సార్ మిమ్మల్ని రమ్మంటున్నారని చెబుతాడు. సార్ కోపం మీకు తెలుసు కదా..ప్లీజ్ మీరు వెళ్లండి అనగానే సరే అంటుంది వసుధార.
వసు: ఇప్పుడు వెళితే ఏమంటారో..వెళ్లకపోతే ఇక్కడకే వస్తారు అనుకుంటూ రిషి దగ్గరకు వెళుతుంది...
మీరు పక్కనే కూర్చుని నేను ఒక్కడినే తింటే బావోదు.. మీరు కూడా తిని వెళ్లండి అంటాడు.. ఇంట్లో మా నాన్న ఎదురు చూస్తారని వసు చెప్పగానే చక్రపాణికి కాల్ చేస్తాడు.
రిషి: మీరు తనకోసం ఎదురుచూడకండి..నా దగ్గరే భోజనం చేస్తుందని చెప్పి కాల్ కట్ చేస్తాడు..ఈ వయసులో ఆయనకు మన గురించి చింత ఉండకూడదు..మీ బాధ మీరు నా బాధ నేను మోయగలను..ఆయనెందుకు మనవల్ల బాధపడాలి.. అందుకే ఆయనలో ఆశ పెంచేందుకు కాదు నిరాశ తగ్గించేందుకు మాట్లాడాను.. ఎప్పటికైనా మనం కలుస్తామనే ఆశతో ఆయన్ని ఉండనీయండి. అది ఫలించదని మీకూ తెలుసు...తినండి అంటాడు..
వసు: ఫలించదని మీరు అనుకుంటున్నారు కానీ ఎప్పటికైనా ఫలించి తీరుతుంది అనుకుంటుంది వసుధార.
తిన్నాక పాండ్యన్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు..
Also Read: వసుకి థ్యాంక్స్ చెప్పిన రిషి, తన కుట్రను మరోసారి బయటపెట్టిన శైలేంద్ర!
తెల్లారేసరికి ఏంజెల్ వస్తుంది... ఏంజెల్ ని చూసి రిషి షాక్ అవుతాడు...ఆ వెనుకే వసుధార వస్తుంది.
ఏంజెల్: నువ్విలా చేయడం నాకు నచ్చలేదు.. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు..చూసుకోలేదంటే మళ్లీ కాల్ చేయాలి కదా..నువ్వు కాల్ చేయలేదంటే నీ మనసుని కష్టపెట్టానని అర్థమవుతోంది..నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో అని చాలా టెన్షన్ పడ్డాను.. లేదంటే నా సిట్యుయేషన్ ఎలా ఉండేది.
రిషి: ఇప్పుడు ఇక్కడున్నానని తెలిసింది కదా..కంగారు వద్దు
ఏంజెల్: తన గురించి నేనుగాక ఎవరు పట్టించుకుంటారు.. మనింటికి వెళదాం రా
రిషి: ఇప్పుడు రాలేను
ఏంజెల్: స్నేహానికి కూడా ముగింపు చెప్పేశావా..
రిషి: మనం ఫ్రెండ్స్ ..ఆ బంధం ఎప్పటికీ అలానే ఉంటుంది. నా మనసులో ఉన్న ఉద్దేశం చెప్పిన తర్వాత నువ్వు, విశ్వనాథం సార్ ఎక్కడ బాధపడతారో అని నలిగిపోయాను..కానీ నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు అది తృప్తినిచ్చింది
ఏంజెల్: నీకు ఇష్టం లేని పనిచేశానని మనసులో పెట్టుకుని స్నేహాన్ని మర్చిపోవద్దు రిషి..
రిషి: నాకు మర్చిపోయే స్వభావం ఉంటే హ్యాపీగా ఉండేవాడినంటూ వసువైపు చూస్తాడు. గత జ్ఞాపకాలు దహించివేస్తున్నాయి.. సార్ ఊరు నుంచి వచ్చారా. సార్ ని బాగా చూసుకో అని చెబుతాడు. త్వరగా పెళ్లిచేసుకో
ఏంజెల్: పెళ్లి చేసుకుంటాను కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్పాకే నేను పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకుంటాను.. నేనిచ్చిన గడువులోగా నీ భార్య ఎవరో చెప్పకపోతే నువ్వు నన్ను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది..ఈ విషయం గుర్తు పెట్టుకో..నీ నిర్ణయం చెప్పడానికి సిద్ధంగా ఉండు..
బై అంటుంది
మాట్లాడాలని వసుని ఆగమంటాడు... ఏంజెల్ బయటకు వెళ్లిపోతుంది
ఏంజెల్ ని ఎందుకు తీసుకొచ్చారని ఫైర్ అవుతాడు..మీరు నన్ను ఇరికిస్తున్నారెందుకు, నేనున్న చోటు ఏంజెల్ కి తెలియకూడదు అనుకుంటే మీరు తనని ఏకంగా ఇంటికి తీసుకొచ్చారని ఫైర్ అవుతాడు. వసుధార సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తుంది కానీ రిషి కోపం తగ్గదు...