గుప్పెడంతమనసు సెప్టెంబరు 21 ఎపిసోడ్


రిషి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఏంజెల్ కి చెప్పేసి బయటకు వచ్చేసిన వసుధార రిషికి కాల్ చేస్తుంది. కాల్ కట్ చేస్తాడు రిషి.. ఇక మళ్లీ కాల్ చేసినా లిఫ్ట్ చేయరనుకుంటూ మెసేజ్ చేస్తుంది. 
రిషి: కోపంగా కాల్ లిఫ్ట్ చేసిన రిషి..ఎక్కడికి వెళుతున్నారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడగొద్దంటూ ఫైర్ అవుతాడు
వసు: మీరెక్కడికి వెళుతున్నారు..
రిషి: కాలం ఎక్కడికి తీసుకెళితే అక్కడకే వెళతాను...మళ్లీ మళ్లీ కాల్ చేయొద్దంటూ కట్ చేస్తాడు
పాండ్యన్ కి కాల్ చేస్తుంది వసుధార...కరెక్టుగా రిషి కారు ఓ హోటల్ దగ్గర ఆగేసరికి పాండ్యన్ ఎంట్రీ ఇస్తాడు..
పాండ్యన్: మీరేంటి సర్ ఇక్కడ
రిషి: నేను ప్రైవసీ కోసం వచ్చాను ఇక్కడే ఉంటాను
పాండ్యన్: మీరు ప్రైవసీ కోరుకున్నారు నేను అక్కడికే తీసుకెళుతున్నా..నాకోసం రండి సార్ అని తీసుకెళ్తాడు..


Also Read: వసుకి థ్యాంక్స్ చెప్పిన రిషి, తన కుట్రను మరోసారి బయటపెట్టిన శైలేంద్ర!


శైలేంద్ర-దేవయాని
రిషి ఎప్పటికైనా ప్రమాదమే అన్న శైలేంద్ర..వాడిని చంపేస్తానంటాడు. 
అది నీ వల్లకాదంటూ ఎంట్రీ ఇస్తుంది జగతి.. నువ్వు రిషిని చంపేస్తావా మేం ఉన్నంత వరకూ రిషి నీడను కూడా టచ్ చేయలేవు, ముందు మమ్మల్ని దాటుకుని వెళ్లాలి
శైలేంద్ర: మంగమ్మ శపథం చేస్తున్నావా
జగతి: నీ పతనం ఇది
దేవయాని: కాలేజిని శైలేంద్రకి ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాడు
జగతి: రిషి స్థాపించుకున్న సామ్రాజ్యాన్ని వేరేవాళ్లకి కట్టబెడతామా
దేవయాని; నువ్వు ఒప్పుకోపోతే తనని చంపేస్తానంటున్నాడు..నీకు కొత్త సమస్య అవసరమా
జగతి: రిషి కాలేజీ నుంచి వెళ్లిపోడనుకుని కుట్రలు పన్నారు..కానీ సమస్య రాగానే వచ్చి కాపాడుకున్నాడు..అలాంటిది కుటుంబంలో ఏదైనా సమస్య ఉందని తెలిస్తే రిషి నిన్ను బ్రతకనిస్తాడా..ఎప్పుడైతే నీ నిజస్వరూపం తెలుస్తుందో నీ చావు ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేం
శైలేంద్ర: అది నీ భ్రమ
జగతి: ఒక్కసారి రిషికి నిజం తెలిస్తే నీకు నిద్ర ఉండదు..తొందర్లోనే నీ సినిమాకు శుభం కార్డు పడుతుంది. 
శైలేంద్ర: రెచ్చగొట్టకు..ఇకనుంచి శైలేంద్ర అంటే ఏంటో చూస్తారు...
అదీ చూద్దాం అనేసి కోపంగా వెళ్లిపోతుంది జగతి...


Also Read:- ఏంజెల్ ఇంట్లోంచి వెళ్లిపోయిన రిషి పయనం ఎటు, వసుకి పెద్ద షాకే ఇది!


రిషి-పాండ్యన్-పాండ్యన్ తండ్రి


మీ ఇంటికి తీసుకొచ్చావేంటని రిషి అడిగితే..ఇక్కడ ప్రైవసీ చాలా ఎక్కువ దొరుకుతుంది రండి సార్ అంటాడు.. పాండ్యన్ తండ్రి కూడా వచ్చి రమ్మని బతిమలాడుతాడు. మీరు హోటల్లో ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది రండి అంటాడు.  మీ పర్మిషన్ లేకుండా మీ రూమ్ డోర్ కూడా ఎవ్వరూ కొట్టరని నచ్చజెప్పి లోపలకు తీసుకెళ్తాడు. నన్ను, నాకొడుకుని మార్చిన గొప్ప మనిషి..మీరు మాతో ఉండడం మాకే గౌరవం అంటాడు. రూమ్ లోపలకి వెళ్లిన రిషి..ఇదంతా నాకు నచ్చేలా ఉంది ఇదంతా ఎవరు చేశారని అడుగుతాడు. మేమే చేశాం అని చెబుతారు కానీ రిషి నమ్మడు... ( అప్పుడు పాంజ్యన్ తండ్రి జరిగింది గుర్తుచేసుకుంటాడు). వసుధార వచ్చి ఆ రూమ్ చూసి..మొత్తం సర్దుతుంది. అప్పుడు రిషి..నాకు క్లారిటీ ఉంది నువ్వు నిజం చెప్పు చాలు అనగానే..చెప్పేస్తాడు పాండ్యన్. మీరు ఫ్రెష్ అవండి సార్ అనేసి వెళ్లిపోతారు..


నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావ్... నీ పెళ్లి విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకున్నావ్, ప్రేమ విషయంలోనూ నమ్మలేదు...నమ్మకం లేని దగ్గర బంధం నిలవదు..అందుకే నీతో కలసి జీవితం పంచుకోకుండా ఆగిపోయాను అనుకుంటాడు. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ లోంచి గులాబీ తీసి చేత్తో పట్టుకుని ఈ పువ్వు రేపటికి వాడిపోయినట్టే మన జీవితం కూడా అనుకుంటాడు...


Also Read: ఈ రాశులవారికి అభివృద్ధి - ఆదాయం, సెప్టెంబరు 21 రాశిఫలాలు


అటు దేవయాని పంతులుని పిలిచి మాట్లాడుతుంది. మా రిషి తిరిగి మా ఇంటికి రావాలంటే ఏం చేయాలి, 108 రోజులు ఉపవాసం చేయమన్నా చేస్తానంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన ఫణీంద్ర, జగతి, మహేంద్ర నిల్చుని చూస్తుంటారు...
దేవయాని: రాత్రంతా నిద్రపట్టలేదు..రిషిని చూడకుండా ఉండలేకపోతున్నాను..పంతులుగారు ఏదైనా పరిష్కారం చెబుతారని పిలిచాను
ఫణీంద్ర: దానికి పంతులు గారు ఏం చేస్తారు
పంతులు:శని పూజలు చేస్తే ఇంట్లో ఉన్న శని తొలగిపోతుంది
ఫణీంద్ర; ఇది డబ్బుతో కూడిన సమస్య కాదు... 
దేవయాని: రిషి లేకపోతే ఇల్లంతా బోసిపోయింది..నేను నాలా లేను
ఫణీంద్ర: అందరూ బాధలోనే ఉన్నారు
దేవయాని: ఇన్నాళ్లూ రిషి ఎక్కడున్నాడో తెలిసి కూడా వీళ్లు తీసుకురారు..కనీసం నేనైనా వెళ్లి తీసుకొస్తాను..కాలేజీకి వెళ్లి ననేన తీసుకొస్తాను
ఫణీంద్ర: మీరు బయలుదేరండి పంతులుగారు అవసరం ఉంటే నేను పిలుస్తానని చెప్పి..మీరు చేసిన పనివల్ల ఇదంతా జరిగింది. మీరు నా దగ్గర విషయాలు దాచడం నచ్చలేదు
మహేంద్ర; మిమ్మల్ని గౌరవం లేకుండా ఎప్పుడైనా చూశామా
ఫణీంద్ర; మరి నా దగ్గర ఎందుకు దాచారు
శైలేంద్ర: రిషిని రమ్మని వాళ్లు బతిమలాడారు, నేను కూడా పిలిచాను కానీ రిషి రానన్నాడు..తన పట్టుదల గురించి తెలుసుకదా
దేవయాని: ఈ పెద్దమ్మ పిలిస్తే రిషి రాకుండా ఉండలేడు..నేను వెళుతున్నా అంతే...


ఎపిసోడ్ ముగిసింది....