గుప్పెడంతమనసు సెప్టెంబరు 20 ఎపిసోడ్
ఫణీంద్ర నిద్రపోతుండగా మహేంద్ర-జగతి వెళ్లి భోజనానికి పిలుస్తారు కానీ ఫణీంద్ర మాత్రం వాళ్లతో మాట్లాడేందుకు ఇష్టపడడు. నేను ఇక నుంచి బయటకు రాను నా గదిలోనే ఉంటానంటూ ధరణిని పిలిచి భోజనం తీసుకురమ్మని చెబుతాడు
మహేంద్ర:మాతో కలసి భోజనం చేయడం కూడా ఇష్టం లేదా
ఫణీంద్ర: మీపై కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థంకాక ఇలా ఉంటున్నా..ఆవేశంలో ఓ మాట తూలి బాధపెట్టలేను..ఇప్పటికీ మీరంటే నాకు అభిమానమే కానీ మీరు నాకు తెలియకుండా చేసిన పనులు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. ఎందుకిలా చేశారని అడగను..మీ కారణాలు మీకుంటాయి. మీరు చేసిన పనులు నాకు నచ్చలేదు..అందుకే కొన్నాళ్లు నన్ను పలకరించవద్దు..
జగతి: మీకు కోపం వస్తుందని తెలుసు కానీ..కారణం తెలిస్తే మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాం
ఫణీంద్ర: ఇది కోపం కాదు బాధ..నా వాళ్లే నన్ను పరాయివాళ్లను చేశారనే బాధ..నన్ను అర్థం చేసుకోండి వెళ్లిపోండి...
బాధగా బయటకు వెళ్లిపోతారు జగతి-మహేంద్ర
అంతా బయటే ఉండి విన్న దేవయాని..ఇకపై మీ అన్నయ్య మీ మనిషి కాదు మా మనిషి. మా ఆయన దృష్టి మారేలోగా మాకు కావాల్సింది మేం సాధించుకుంటాం..
జగతి: ఇంకా ఎంతవరకూ దిగజారుతారు..మీ భర్తని కూడా మోసం చేస్తున్నారు. కొడుకును చెడువైపు ప్రోత్సహించిన తల్లి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు..ఇది మీరు గుర్తుంచుకోండి
దేవయాని: కోరుకున్నది దక్కించుకోవడమే నాకు తెలుసు..నువ్వు అనుకున్న పద్ధతిలో వెళ్లిన నీ కొడుకు ఎక్కడో తలదాచుకుంటున్నాడు. కానీ నా కొడుకు రాజులా కాలేజీ ఎండీ సీట్లో కూర్చుంటాడు
జగతి: అదీ చూద్దాం అక్కయ్య...
మహేంద్ర: రిషి ఎక్కడో తలదాచుకోవడం లేదు..పెద్ద వటవృక్షంలా నిలబడి నీడనిస్తున్నాడు..అదీ నా కొడుకు మేధాశక్తి..మీ కొడుకు నాటకాలు ఆటుడూ చుట్టూ ఉన్న నాశనాన్ని కోరుకుంటూ బతుకుతున్నాడు...మనం పిల్లల గురించి మాట్లాడితే ...వంద గుడ్లను తిన్న రాబందు కూడా గాలివానుకు కొట్టుకుపోతుంది...అప్పటివరకూ వెయిట్ చేయండి...
దేవయాని: రిషి వచ్చాడని సంబరపడకండి..ప్రతీసారి తను రాలేడు
మహేంద్ర: ప్రతీసారీ మీకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు..నిజం బయటపడిన మరుక్షణమే మీ గుండె పగిలిపోతుంది..అప్పుడు మీరు కుమిలి కుమిలి ఏడుస్తుంటే మేం ఓదార్చుతాం..మీరంటే శత్రుత్వం లేదు..ఎందుకంటే మనది ఒకే కుటుంబం కదా...
Also Read: వసుకి థ్యాంక్స్ చెప్పిన రిషి, తన కుట్రను మరోసారి బయటపెట్టిన శైలేంద్ర!
వసుధార అంటూ హడావుడిగా వస్తుంది ఏంజెల్.. రిషి ఇంకా ఇంటికి రాలేదు నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. మరెక్కడి వెళ్లి ఉంటారని వసు ఆలోచనలో పడుతుంది. కాలేజీ మేటర్ సెట్టైందా అని అడిగిన ఏంజెల్..పోనీలే కాలేజీ ఏవరిది అయితే అవనీ సెట్టైంది కదా అంటుంది. అంతలోనే రిషి 15 రోజుల్లోగా తన భార్యని తీసుకొస్తాడా అంటుంది. అవును సార్ ఎవర్ని చూపిస్తారో అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా అని కవర్ చేస్తుంది వసుధార. నువ్వు ఇంటికి వెళ్లు అని వసుధార అంటే తాతయ్య కూడా ఊర్లో లేరంటుంది ఏంజెల్...
ఏంజెల్: రిషి భార్య ఎవరో నువ్వు ఊహించగలవా..
వసు: కంగారుగా ఉంటుంది
ఏంజెల్: రిషి భార్య ఎవరో నీకు తెలుసు కదా..నువ్వు నా దగ్గర ఏదో దాచుతున్నావ్ అనిపిస్తోంది. మహేంద్ర సార్ వాళ్ల కాలేజీ ప్రాబ్లెమ్ లో ఉందంటే నువ్వు కూడా వెళ్లావ్..మహేంద్ర సార్ వాళ్లు రిషికి ఆత్మీయులు..రిషి భార్య ఎవరో కచ్చితంగా వాళ్లకి తెలిసే ఉంటుంది నీక్కూడా తెలిసే ఉంటుంది అనిపిస్తోంది. వాళ్లని అడిగి నువ్వు తెలుసుకోపోతే ఇప్పుడు తెలుసుకో అంటుంది
వసు: ఈ విషయం నేను ఎలా తెలుసుకోగలను..అయినా రిషి సార్ చెబుతానన్నారు కదా అప్పటివరకూ వెయిట్ చేద్దాం...
సరే అంటుంది ఏంజెల్... ఇంతకీ రిషి సార్ ఎక్కడికి వెళ్లినట్టు అని ఆలోచనలో పడుతుంది... రిషి రాలేదు, విశ్వం ఎప్పుడొస్తాడో తెలియదు నువ్వు నాతోపాటూ ఇంటికి రావా అని వసుధారని తీసుకెళ్లిపోతుంది ఏంజెల్..
Also Read: బాలయ్య స్టైల్ లో ఏంఎస్ఆర్ కి రిషి అదిరే వార్నింగ్- శైలేంద్ర గురించి జగతి నిజం బయటపెడుతుందా?
రిషి బ్యాగ్ సర్దుకుని కిందకు దిగుతాడు...హాల్లోనే ఉన్న ఏంజెల్-వసు రిషిని చూసి షాక్ అవుతారు...ఎక్కడికి వెళుతున్నావ్ రిషి అని అడుగుతుంది ఏంజెల్
ఏంజెల్: రిషి ఈ బ్యాగ్ ఏంటి
రిషి: వెళ్లిపోతున్నాను
ఏంజెల్: ప్లీజ్ రిషి నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు ఇక్కడే ఉండాలి
రిషి: నా నిర్ణయం మారదు..ఇన్నాళ్లూ నీ మనసులో నేను ఫ్రెండ్ అనే మంచి ఉద్దేశం ఉంది. కానీ ఎప్పుడైతే నన్ను పెళ్లిచేసుకోవాలి అనే ఆలోచన వచ్చిందో అప్పుడే దూరంగా వళ్లిపోలానే ఆలోచన వచ్చింది. విశ్వనాథం సార్ ఆరోగ్యం బాలేదని ఆగిపోయాను. నీకు నీ మనసు అర్థం కాలేదు. నీకు నాపై ప్రేమలేదు..స్నేహం మాత్రమే ఉంది
ఏంజెల్: నేను కూడా అదే అంటున్నాను కదా..కానీ నీలాంటి వ్యక్తిని భర్తగా పొందాలని ఆశపడ్డాను..
రిషి: ఆశలు బంధాలను నిలబెట్టలేవు..మన పెళ్లి జరగదని ఎంత హెచ్చరించినా నీకు అర్థం కాలేదు..నీ మనసులో ఉన్న విషయం ఆయన కూడా మన పెళ్లి చేయాలని ఆశపడ్డారు..ఇప్పుడు మీ ఇద్దరి మనసుని నా ప్రమేయం లేకుండానే కష్టపెట్టాను. నిత్యం ఒకరికొకరు ఎదురుపడడం మీకు నాకూ బాధే
ఏంజెల్: మేం బాధపడుతున్నాం అని నీతో చెప్పామా
రిషి: మీరు చెప్పినా చెప్పకపోయినా ఆ వ్యధ మీకు ఇవ్వదలుచుకోలేదు..అందుకే నేను వెళ్లిపోతున్నాను
ఏంజెల్: చూడు వసుధార..రిషి కొత్తగా మాట్లాడుతున్నాడు..నన్ను పెళ్లిచేసుకోనని చెప్పావు కదా..నీ భార్య ఎవరో చెప్పమని అడుగుతానని నువ్వు వెళ్లిపోతున్నావా..వసుధార రిషి చెప్పేవరకూ ఆ విషయంలో ఇబ్బందిపెట్టనని చెప్పాను కదా నువ్వైనా చెప్పు అని కన్నీళ్లతో అడుగుతుంది ఏంజెల్
వసుధార: అవును సార్ ఏంజెల్ రాత్రి నాకు చెప్పింది
ఏంజెల్: ప్రామిస్ రిషి నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఇక్కడే ఉండిపో
రిషి: చాలా పొరపడుతున్నావు..చావుకే భయపడని నేను ప్రశ్నలకు భయపడతానా..నువ్వు నాకు గుడువుపెట్టావ్ జరగాల్సింది జరుగుతుంది కానీ నీ జీవితం బావుండాలి
ఏంజెల్: నువ్వు ఇక్కడ ఉంటేనే బావుంటుంది
రిషి: మనిషిపై ఉద్దేశం మారినప్పుడు దూరంగా ఉంటూ స్నేహంగా ఉండడమే ఉత్తమం..ఇప్పటికే నా గుండెకు చాలా గాయాలయ్యాయి..ఇంకా నేను కష్టాల్లోకి వెళ్లాలి అనుకోవడం లేదు.. కన్నీళ్లెందుకు ఏంజెల్..విడిపోయేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నావంటే మనమధ్య స్నేహం పోయిందా
ఏంజెల్: మనం బెస్ట్ ఫ్రెండ్స్
రిషి: కన్నీళ్లు అనేవి బలహీనత..వాటిని చీటికి మాటికి వాడకూడదు. నా భార్య ఎవరనేది 15 రోజుల్లో చూపించాలని గడువు పెట్టావు.. ఇప్పుడు నేను నీకు గడువు పెడుతున్నాను..అయినంత తొందర్లో నీ మనసుకి నచ్చిన అబ్బాయిని సార్ కి చూపించి పెళ్లిచేసుకో...తనతో సంతోషంగా ఉండు..నీలా నేను రోజులు గడువు పెట్టడం లేదు..ప్రతిక్షణం చాలా విలువైంది గుర్తు పెట్టుకో...వెళ్తున్నా...
ఏంజెల్: రిషి ఆగు అని మళ్లీ అడుగుతుంది...నేను తప్పుగా మాట్లాడితే క్షమించు అంతేకానీ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు
రిషి: మిమ్మల్ని క్షమించడానికి నేనెవరు..నేను ఈ సిటీలోనే ఉంటాను..కాలేజీకి రోజూ వస్తాను..నీకు అందుబాటులో ఉంటాను...
వసుధార: ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు సార్
వసువైపు కోపంగా చూసి బయటకు వెళ్లిపోతాడు రిషి... విశ్వంకి ఏం చెప్పాలని అడిగితే సార్ అర్థం చేసుకుంటారని రిప్లై ఇచ్చి వెళ్లిపోతాడు... వెనుకే ఫాలో అవుతుంది వసుధార