‘బిగ్ బాస్’ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7)లో పవర్ అస్త్ర కోసం పోటీ మొదలయ్యింది. అందులో అమర్‌దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిని కంటెడర్లుగా అనౌన్స్ చేశారు బిగ్ బాస్. అప్పటినుంచి ఇతర కంటెస్టెంట్స్‌లో అసూయ, ఆ స్థానంలో తాము లేరనే కోపం.. ఇలా అన్నీ కలిపి ఆ ముగ్గురిని అనర్హులు అని ప్రకటించేలా చేసింది. కానీ శోభా శెట్టి మాత్రం తనను అనర్హురాలు అన్నమాటను ఒప్పుకోలేకపోయింది. అందుకే గౌతమ్‌తో తీవ్రమైన వాగ్వాదానికి దిగింది. కొద్ది రోజుల కిందట హోస్ట్ నాగార్జున చూపించిన మీమ్‌ను మరోసారి నిజం చేశారు డాక్టర్ బాబు (గౌతమ్), మోనిత (శోభాశెట్టి). అయితే, ‘కార్తీక దీపం’లో మనసులు కలిస్తే.. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఈ రోజు (బుధవారం) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చదవండి.


గెలిచిన యావర్


ముందుగా ప్రిన్స్ యావర్‌ను రతిక, దామిని, తేజ.. అనర్హులు అని ప్రకటించారు. దీంతో తను అనర్హుడా? కాదా? అని తమనే టెస్ట్ చేయమన్నాడు బిగ్ బాస్. దీంతో ఆ ముగ్గురు రంగంలోకి దిగి యావర్‌కు చుక్కలు చూపించారు. స్టాండ్ బైలో నిలబడి ఉన్న యావర్‌ను కదలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మొహాన గుడ్లు కొట్టారు. గడ్డి, పేడ లాంటివి తన ఒంటి మీద వేశారు. ప్యాంట్‌లో ఐస్ వేశారు. రతిక, దామిని, తేజ పెట్టిన టార్చర్‌కు యావర్ కాస్త కదిలినట్టు చేసినా.. పూర్తిగా స్టాండ్ బై మీద నుంచి మాత్రం జరగలేదు. దీంతో యావర్‌ను విన్నర్‌గా ప్రకటించాడు బిగ్ బాస్. ఇక ఇప్పుడు శోభా శెట్టి టర్న్ వచ్చింది. తను అనర్హురాలు అని గౌతమ్, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ భావిస్తున్నట్టు చెప్పిన వీడియోను బిగ్ బాస్ ప్లే చేశారు.


కుస్తీ పోటీలతో గొడవ మొదలు


బిగ్ బాస్ ప్లే చేసిన వీడియోలో శోభా శెట్టి ఎప్పుడూ ఒకత్తే కూర్చొని ఉంటుందని, ఎవరితో కలవదని, ఇంటి పనులు చేయదని, వినాయక పూజ సమయంలో తను మేకప్ వేసుకుంటూ కూర్చొని ఎవరు పిలిచినా పట్టించుకోలేదని కారణాలు చెప్పాడు గౌతమ్. అందుకే తను అనర్హురాలని అన్నాడు. ఈ కారణాలు శోభా శెట్టికి చాలా సిల్లీగా అనిపించాయి. అందుకే వీడియో అయిపోగానే చప్పట్లు కొట్టింది. ఆ తర్వాత కుస్తీ పోటీలో తను 57 సెకండ్లు ఉన్నానని, గౌతమ్, శుభశ్రీ అంతసేపు ఉండలేకపోయారని గుర్తుచేసింది. అసలు గౌతమ్ కారణం ఏంటి అని క్లియర్‌గా అడిగి తెలుసుకుంది. వినాయక పూజ గురించి గౌతమ్ చెప్పిన కారణానికి క్లారిటీ ఇచ్చింది. ఆ సమయంలో తాను తేజ మీద అలిగానని, అసలు గౌతమ్‌తో తనకు అంత బాండింగ్ లేదని ముక్కుసూటిగా చెప్పేసింది. ఆ తర్వాత ‘‘జిమ్ చేస్తావు. వర్కవుట్ చేస్తావు. కానీ కుస్తీ పోటీలో నిలబడలేకపోయావు’’ అని రెచ్చగొట్టేలా మాట్లాడింది శోభా. దీంతో గౌతమ్ కూడా సీరియస్ అయ్యాడు.


సీరియస్ అయిన గౌతమ్


‘‘జిమ్ చేస్తున్నవాడిని జిమ్ చేస్తున్నావు అని పాయింట్ చేయడం తప్పు’’ అని గౌతమ్ అరవడం మొదలుపెట్టడం. గౌతమ్ అరిచిన అరుపులకు రెట్టింపుగా శోభా అరవడం మొదలుపెట్టింది. గౌతమ్‌కు కండలు ఉన్నా టాస్కుల్లో అసలు ఆడడం లేదనే అర్థం వచ్చేలా హేళన చేసింది శోభా. దీంతో గౌతమ్.. షర్ట్ విప్పి టాస్కుల్లో తనకు తగిలిన దెబ్బల గురించి చెప్పాడు. అది వినడానికి కూడా శోభా సిద్ధంగా లేదు. తనకు కూడా తగిలింది అని చెప్పింది. ఎవరు అర్హులు అని చెప్పే సమయం వస్తుందని ఛాలెంజ్ చేసింది. మరోసారి జిమ్ గురించి శోభా టాపిక్ తీసుకొని రాగా.. విచక్షణ కోల్పోయిన గౌతమ్.. అక్కడే షర్ట్ తీసేసి వర్కవుట్ చేయడం మొదలుపెట్టింది. ‘‘నా బాడీ, నా ఇష్టం’’ అంటూ అరుస్తూ వర్కవుట్ చేశాడు గౌతమ్.


Also Read: ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ‘బిగ్ బాస్’ రతికపై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial