Gruhalakshmi Serial September 22nd Episode : విక్రమ్ తన మీద అరిచినందుకు జానూ బాధగా ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బ్యాగ్ పట్టుకుని వస్తుంది. చిన్నప్పుడు మనం ఎన్ని సార్లు అరుచుకోలేదు మళ్ళీ హగ్ చేసుకుని అన్నీ మర్చిపోయాం కదా అంటాడు. గొడవ పడినప్పుడు కోపం తగ్గించుకోవడం కోసం నీ చెంప పగలగొట్టేదాన్ని అని జానూ అంటుంది. సరే కొట్టు అనేసరికి చెయ్యి ఎత్తి కొట్టకుండా హగ్ చేసుకునేసరికి దివ్య కోపంగా చూస్తుంది. సామ్రాట్ బాబాయ్ తులసిని కలవడం కోసం వస్తుంటే నందు వాళ్ళు చూస్తారు. వెంటనే ఆయన్ని ఆపి తులసిని కలుసుకోకుండా అటు నుంచి అటే పంపించేయమని పరంధామయ్య చెప్తాడు. దీంతో నందు ఆయన్ని ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మం నుంచి బయటకి తీసుకెళ్లిపోతాడు.
పెద్దాయన: అర్జెంట్ గా తులసితో మాట్లాడాలి. సామ్రాట్ బిజినెస్ ప్రమాదంలో పడుతుంది. ధనుంజయ్ కంపెనీ సీఈఓ గా బాధ్యతలు తీసుకుంటున్నాడు
నందు: దానికి తులసితో ఏం సంబంధం అది మీ ఇంటర్నల్ మ్యాటర్
పెద్దాయన: అలా అనొద్దు వెంటనే తులసి వచ్చి కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి లేదంటే సమస్యలు వస్తాయి
నందు: ఏ హక్కుతో కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోమంటున్నారు
పెద్దాయన: హక్కుతో కాదు మానవత్వంతో తీసుకోమంటున్నా
Also Read: ముకుందకి అడుగడుగునా చెక్ పెడుతున్న కృష్ణ- మొత్తం గమనిస్తున్న భవానీ!
నందు: దయచేసి ఈ విషయంలోకి తులసిని లాగొద్దు. ఎవరు సహాయం అడిగినా తను ఆలోచించకుండా చేస్తుంది. కానీ తనని ఇబ్బంది పెట్టి సమస్యల్లో పెట్టడం కరెక్టా. ధనుంజయ్ వాళ్ళు కిరాతకులు. తులసి ఆ ఇంటి వైపు వస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందేనని బెదిరించారు. ఆ సంగతి నాకు మాత్రమే తెలుసు. తులసిని ఆ ఇంటికి వెళ్ళకుండా అడ్డుపడటం కోసం కష్టపడుతున్నాం. ఆస్తి కోసం చూస్తున్న వాళ్ళు తులసి మీద అటాక్ చేస్తారు. అయినా మీరు తులసిని తీసుకెళ్తానంటే తీసుకెళ్లండి
పెద్దాయన: దిక్కుతోచక తులసి దగ్గరకి వచ్చాను ఇదనీ తెలిస్తే వచ్చేవాడిని కాదు
తులసి: వాళ్ళు బెదిరించారని హనీకి దూరంగా ఉంచేందుకు ట్రై చేస్తున్నాం
పెద్దాయన: ఆ ఇంటికి, హనీకి ఎలాంటి నష్టం జరిగినా అది తులసి దాకా రానివ్వనని మాట ఇస్తున్నా అంటుండగా తులసి ఎంట్రీ ఇస్తుంది. ఎందుకు డల్ గా ఉన్నారని పెద్దాయన్ని అడుగుతుంది. హానీకి టిఫిన్ తీసుకెళ్లాడానికి వచ్చానని పెద్దాయన అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. రేపటి నుంచి హనీకి టిఫిన్ పంపించాలని అనుకోకు అప్పుడే ఒంటరిగా ఉంది చదువు మీద ధ్యాస పెడుతుందని అనేసి వెళ్ళిపోతాడు. ఆయన మాటలకి తులసి అయోమయంలో పడుతుంది.
Also Read: రిషి సేవలో వసు, గడువు గుర్తుచేసిన ఏంజెల్ - అయోమయంలో పాండ్యన్ !
దివ్య ఒంటరిగా కూర్చుని జానూని వెళ్లనివ్వకుండా చేసిన విక్రమ్ గురించి ఆలోచిస్తుంది. విక్రమ్ బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా వాటర్ ఆగిపోతాయి. దివ్యని పిలుస్తాడు కానీ కావాలని పలకదు. దీంతో బయటకి వచ్చేద్దామని అనుకుంటుండగా దివ్య తన దగ్గరకి వెళ్తుంది. బకెట్ వాటర్ కావాలని అడుగుతాడు. సరే తీసుకొస్తానని చెప్పి కిందకి వెళ్తుంది. అదంతా గమనించిన జానూ రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి బావ వీపు రుద్దే అవకాశం దొరికింది వాటర్ తీసుకొస్తున్న దివ్యని ఆపేయమని చెప్తుంది. రాజ్యలక్ష్మి కావాలని దివ్యని ఆపుతుంది. సందు దొరికిందని జానూ వాటర్ తీసుకుని బాత్ రూమ్ లో దూరిపోతుంది. దివ్య వచ్చేసరికి బాత్ రూమ్ నుంచి జానూ బయటకి వచ్చేసరికి కోపంగా నీళ్ళు మొహం మీద కొట్టేస్తుంది.
తులసి వాళ్ళు కేఫ్ కి వెళ్తూ ఉండగా అటుగా స్కూల్ కి వెళ్తున్న హనీ కారులో నుంచి వాళ్ళని చూస్తుంది. తనని కలిసేందుకు ట్రాఫిక్ లో దిగి తులసి పరుగులు పెట్టబోతుంటే యాక్సిడెంట్ అవబోతుంది. తృటిలో ప్రమాదం తప్పిపోతుంది. టిఫిన్ ఎందుకు తీసుకురాలేదని అడుగుతుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు.
దివ్య దగ్గరకి జానూ వచ్చి కదిలిస్తుంది. బావని దారిలోకి తెచ్చుకోవడం కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్టు డ్రామా ఆడానని అంటుంది. ఏమి లేనిచోట ఏదేదో ఊహించుకుని విక్రమ్ తన మనసుని బాధపెట్టుకున్నాడని దివ్య చెప్తుంది.