Krishna Mukunda Murari September 22nd:  మురారీ, కృష్ణ సరదాగా మాట్లాడుకుంటారు. పెళ్లి అయిన తర్వాత అమ్మాయిలు అన్నీ మర్చిపోతారని అంటారు, మరి పెళ్లికి ముందు ప్రేమని, ప్రేమించిన వాడిని మర్చిపోతారని అంటారు. నిజంగా అందరు అమ్మాయిలు అలా ఉండరా? అని అడుగుతాడు. మీరు ఇంకా ముకుంద గురించి బాధపడుతున్నారా? దిగులు పడకండి నేను సెట్ చేస్తాను కదా అని మనసులో అనుకుంటుంది. అందరూ అలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. అయినా ఎందుకు అలా అడిగావని అంటే ఏమి లేదని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ముకుందతో మాట్లాడేందుకు శ్రీనివాసరావు ఇంటికి వస్తాడు.


శ్రీనివాసరావు: ఇంకా నా మీద కోపం పోలేదా అన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు


ముకుంద: మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది నాన్న. నేను మీకోసం ఇంటికి వచ్చి మరి అర్థించాను. నా ప్రేమని బతికించి విషయం చెప్పమంటే అన్నీ తెలిసి కూడా కన్న కూతురు జీవితం నాశనం చేశావ్ కదా.


శ్రీనివాస్: అలా మాట్లాడకు


ముకుంద: నా జీవితాన్ని సర్వనాశనం చేసింది మీరే. ఆదర్శ్ కంటే పెళ్లికి ముందు మురారీ కోసం వెయిట్ చేస్తానని అంటే వినిపించుకోకుండా మీ ఇష్టాన్ని నా మీద రుద్ది నా ప్రేమని మీరే చంపేశారు


Also Read: రిషి సేవలో వసు, గడువు గుర్తుచేసిన ఏంజెల్ - అయోమయంలో పాండ్యన్ !


శ్రీనివాస్: నీ జీవితం ఇలా అవడానికి మేమే కారణమని బాధపడుతున్నాం


ముకుంద: మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది ఇంకెప్పుడు ఇక్కడికి రావొద్దు


శ్రీనివాస్: అంత పెద్ద శిక్ష వేయొద్దు నీ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నా


అప్పుడే రేవతి అటుగా రావడం చూసి మెల్లగా మాట్లాడమని అంటాడు. కానీ ముకుంద మాత్రం భయపడకుండా తన ప్రేమని తనే గెలుచుకుంటానని అంటుంది. ఇంకెప్పుడు ఇక్కడికి రావొద్దని వెళ్లిపొమ్మని చెప్పేస్తుంది.


శ్రీనివాస్: నామీద ఏ మాత్రం గౌరవం ఉన్నా కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఆవేశపడకు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు ఇదే నా చివరి కోరిక. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము అనేసి వెళ్ళిపోతాడు


డైనింగ్ టేబుల్ దగ్గర మురారీ పక్కన కూర్చోవడానికి ముకుంద చైర్ లాగితే వెంటనే వెళ్ళి కృష్ణ కూర్చుంటుంది. భర్త పక్కన భార్య కూర్చోవాలి కదా అంటుంది. మురారీ పక్కన మధుకర్ కూర్చుంటే తనని లేపి ముకుంద మరోవైపు కూర్చుంటుంది. అది చూసి కృష్ణ, రేవతికి కాలుతుంది. ప్రతిరోజూ మురారీకి ఇష్టమైన వంటలు చేస్తూ ఉండేసరికి ప్రసాద్ డౌట్ గా అడిగేస్తాడు. మురారీకి ముకుంద ఫుడ్ వడ్డిస్తుంటే కృష్ణ అడ్డుపడుతుంది.


కృష్ణ: నేను ఉండగా నువ్వు మురారీకి వడ్డించాల్సిన అవసరం ఏముంది?


భవానీ: తింగరి పిల్ల ఏంటి నీ ప్రాబ్లం


కృష్ణ: ముకుంద చెప్పింది కదా భర్తకి భార్య వడ్డించాలని అందుకే అలా అన్నాను


భవానీ: అయినా అందరికీ ఒకే విధంగా వడ్డించాలి. దగ్గర ఉన్నామని నాకు మురారీకి వడ్డిస్తూ మిగతా వాళ్ళని వదిలేసి స్మార్ట్ గా మ్యానేజ్ చేస్తున్నావ్. ఆ మాత్రం గమనించనలేదని అనుకుంటున్నావా? అసలు నువ్వు ఇష్టంగానే ఇంటి బాధ్యతలు తీసుకున్నావా? దీంట్లో ఇంకెవరి ప్రోద్బలం ఏమైనా ఉందా?


ముకుంద: లేదత్తయ్య మనస్పూర్తిగానే తీసుకున్నా


కృష్ణ: రేపు ప్రపంచ భర్తల దినోత్సవం. అందుకని భర్తకి సన్మానం చేస్తారు. భర్తకి ఇష్టమైన వంటలు చేసి ప్రామిస్ కూడా చేయాలి. ఆదర్శ్ కి ఇష్టమైన వంటకాలు ముకుందతో చేయిస్తాను అత్తయ్య. ఎలాగూ ముకుంద ఆదర్శ్ వచ్చేలోపు అన్ని నేర్చుకోవాలని అనుకుంటుంది కదా. తనకి ఇష్టమైన వంటకాలు చెప్తే అవన్నీ తనతో చేయిస్తాను


భవానీ: సరే కృష్ణ అందరూ భర్తల దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి


Also Read: తండ్రిని చూసి విలవిల్లాడిపోయిన కావ్య - దొంగల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన రాజ్!


కృష్ణ ఫోకస్ అంతా నా మీద పెడుతుంది ఎందుకు? ప్రతిసారీ ఆదర్శ్ మ్యాటర్ తీసుకొస్తుంది ఎందుకని ముకుంద ఆలోచిస్తుంది. నీకు మా ప్రేమ విషయం తెలిస్తే ముసుగులో గుద్దులాట ఎందుకు డైరెక్ట్ గానే తేల్చుకుందామని అనుకుంటుంది.