యాక్షన్ దృశ్యాలు తెరకెక్కించడంలో కుటుంబ విలువలతో కూడిన మాస్ యాక్షన్ & కమర్షియల్ చిత్రాలు తీసే దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) స్టైల్ సెపరేట్! యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, 'ఉస్తాద్' రామ్ పోతినేని (Ram Pothineni)తో ఆయన తీసిన సినిమా 'స్కంద - ది ఎటాకర్' (Skanda Movie). ఇందులో యాక్షన్, మరీ ముఖ్యంగా పతాక సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ అని హీరో చెబుతున్నారు. 


క్లైమాక్స్ షూటింగ్ కోసం 24 రోజులు
Ram On Skanda Climax : 'స్కంద' పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ దృశ్యాలను 24 రోజుల పాటు తెరకెక్కించామని తాజా ఇంటర్వ్యూలో రామ్ పోతినేని చెప్పారు. దర్శకుడు బోయపాటి శ్రీను, క్లైమాక్స్ గురించి ఆయన మాట్లాడుతూ ''నేను యాక్షన్ సినిమాలు చేశా. ఇంతకు ముందు సినిమాల్లో ఫైట్స్ చేశా. అయితే, 'స్కంద'లో చేసినట్లు గతంలో ఎప్పుడూ చేయలేదు. బోయపాటి శ్రీను గారు తీసిన యాక్షన్ సీక్వెన్సుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. 'స్కంద' క్లైమాక్స్ 24 రోజుల పాటు చిత్రీకరణ చేశాం. 24 రోజులు అంటే... 10 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు. సూర్యోదయం మొదలు పెడితే... సూర్యాస్తమయంలో వెలుగు ఉన్నంత వరకు లాస్ట్ షాట్ చేశాం. బోయపాటి గారు ఎప్పుడూ తన హీరోలను గొప్పగా చూపిస్తారు.  హీరో అంటే ఎలా ఉండాలని డిజైన్ చేసుకుంటారు. ఆ విషయంలో కాంప్రమైజ్ కారు'' అని చెప్పారు.


Also Read నాని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ఆయన క్రష్ ఎవరో తెలుసా?  


క్లైమాక్స్ చూసి తమన్ ఏమ్మన్నారంటే?
'స్కంద' క్లైమాక్స్ చూసిన సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారని రామ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ''తమన్ 'స్కంద' క్లైమాక్స్ చూశాడు. వెంటనే 'ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ యాక్షన్ సీన్లు చూస్తే ఐరావతం (ఏనుగు) అంత ఎత్తులో ఉన్నాయి. నేను ఏం కొట్టాలి' అని అడిగారు. క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది'' అని చెప్పారు. 


Also Read శ్రీకాంత్ అడ్డాల గారూ... 'పెదకాపు' కథ ఎక్కడ కాపీ కొట్టారు?



సెప్టెంబర్ 28న 'స్కంద' విడుదల
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'స్కంద' సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్, జీ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల అవుతోంది. 


రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో కథానాయిక. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం.  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial