శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala)కు ఒక స్టైల్ ఉంది. ఫీల్ గుడ్ చిత్రాలు తీసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకుడిగా పరిచయమైన 'కొత్త బంగారు లోకం' నుంచి మొదలు పెడితే... ఆ తర్వాత తీసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుంద', 'బ్రహ్మోత్సవం' చూస్తే ఆ విషయం చాలా ఈజీగా అర్థం అవుతుంది. అయితే... 'నారప్ప'తో ఆయన రూటు మార్చారు. 'పెదకాపు' (Pedda Kapu Movie)తో ప్రేక్షకులను మాత్రమే కాదు... పరిశ్రమ ప్రముఖులను కూడా ఆశ్చర్యపరిచారు. 


శ్రీకాంత్ అడ్డాల గారూ... కథ కాపీ కొట్టారా?
'పెదకాపు' ప్రచార చిత్రాలు చూసి శ్రీకాంత్ అడ్డాలలో ఇంత మాస్ ఉందా? అని కొందరు డిస్కస్ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఫ్యామిలీ ఫిలిమ్స్ తీసిన ఆయన ఇటువంటి రూరల్ బేస్డ్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ తీయడంతో నిజంగా ఆయనే కథ రాశారా? అని  కొందరికి డౌట్స్ వచ్చాయి. అందులో చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు సైతం ఉన్నారు. 


శ్రీకాంత్ అడ్డాల గారు 'పెదకాపు' సినిమా గురించి ఫస్ట్ టైమ్ ఫోన్ చేసినప్పుడు ఫ్యామిలీ కథ చెబుతారని తాను అనుకున్నట్లు మిక్కీ జె మేయర్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నేను ఫ్యామిలీ ఫిల్మ్ చేయడానికి రెడీ అయ్యాను. అయితే, 'పెదకాపు' కథ విన్నాక నాకు ఛోటా కె నాయుడు గారిలా చిన్న డౌట్ వచ్చింది. విజువల్స్ చూసిన తర్వాత అయితే నమ్మలేకపోయా. నేను శ్రీకాంత్ అడ్డాల గారికి ఫోన్ చేసి 'సార్, మీరు ఎక్కడ నుంచి అయినా కాపీ కొట్టారా?' అని అడిగాను'' అని చెప్పారు. 


శ్రీకాంత్ అడ్డాల తండ్రి అనుభవాలతో...
'పెదకాపు' కథ వెనుక తన తండ్రి అనుభవాలు ఉన్నాయని శ్రీకాంత్ అడ్డాల తాజా ఇంటర్వ్యూలో వివరించారు. ''లాక్ డౌన్ సమయంలో మా నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. ఒక రోజు ఆఫీసులో ఉన్నప్పుడు 1980లలో జరిగిన అంశాలు కొన్ని చెప్పారు. ఆ అనుభవాలతో కథ రాశా'' అని శ్రీకాంత్ అడ్డాల వివరించారు.


Also Read  నాని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ఆయన క్రష్ ఎవరో తెలుసా?  



శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్‌ సంస్థ తెరకెక్కిస్తోన్న సినిమా 'పెద్ద కాపు' (Peddha Kapu Movie). మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ (Virat Karrna), ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) జంటగా నటిస్తున్నారు. 


Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?



శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనసూయ భరద్వాజ్, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నృత్య దర్శకత్వం : రాజు సుందరం, కళా దర్శకత్వం : జీఎం శేఖర్, కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, ఫైట్స్ : పీటర్ హెయిన్.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial