భారతీయ బాక్సాఫీస్ బరిలో 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్రాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఈ ఏడాది ముందు వరకు ఆ ఘనత సాధించిన సినిమాలు నాలుగు అంటే కేవలం నాలుగే! అందులోనూ మూడు సినిమాలు సౌత్ ఇండియన్ సినిమాలు. రెండు తెలుగు సినిమాలు కావడం మనకు గర్వకారణం. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన 'దంగల్' మాత్రమే రూ. 2000 రెండు వేల కోట్ల మార్క్ చేరుకుంది.
రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఏవి?
ఆమిర్ ఖాన్ 'దంగల్' ప్రపంచ వ్యాప్తంగా రూ. 2024 కోట్లు కలెక్ట్ చేస్తే... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' ఆల్మోస్ట్ ఆ రికార్డుకు దగ్గర దగ్గరగా వెళ్ళింది. 'బాహుబలి' రెండో పార్ట్ రూ. 1810 కోట్లు కలెక్ట్ చేసింది. చైనా కలెక్షన్స్ తీసేస్తే... ఇండియా వరకు చూస్తే... మన 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంటుంది.
'బాహుబలి 2' తర్వాత 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాతో మరోసారి రాజమౌళి 1000 కోట్ల మేజిక్ మార్క్ రిపీట్ చేశారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆయన తెరకెక్కించిన సినిమా రూ. 1258 కోట్లు కలెక్ట్ చేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన 'కెజియఫ్ 2' రూ. 1250 కోట్ల వసూళ్లు రాబట్టింది.
'పఠాన్', 'జవాన్'తో 1000 కోట్ల క్లబ్బులో షారుఖ్!
వరుస పరాజయాలతో కొంత విరామం తీసుకుని వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల సినిమాలు అందించారు. 'పఠాన్' రూ. 1050 కోట్లు కలెక్ట్ చేస్తే... 'జవాన్' ఇటీవల రూ. 1000 కోట్ల మార్క్ చేరుకుంది. ఇంకా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఫైనల్ రన్ అయ్యేసరికి ఎంత వస్తుందో చూడాలి. వెయ్యి కోట్ల క్లబ్బులో ఆమిర్, షారుఖ్ ఉండటంతో ఖాన్ త్రయంలో మూడో హీరో, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆ మేజిక్ మార్క్ ఎప్పుడు చేరతారని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
'టైగర్ 3'తో సల్మాన్ ఖాన్ వెయ్యి కోట్లు కొడతాడా?
కథ, కంటెంట్ కంటే హీరోయిజానికి అభిమానులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న రోజులు ఇవి. యాక్షన్ సీన్లు మెప్పిస్తే మళ్ళీ మళ్ళీ సినిమా చూస్తున్నారు. 'జైలర్', 'జవాన్' విజయాలతో అది మరోసారి రుజువు అయ్యింది. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' విజయాల తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో వస్తున్న సినిమా కావడంతో 'టైగర్ 3' మీద భారీ అంచనాలు ఉన్నాయి. మినిమమ్ ఉంటే చాలు... బాక్సాఫీస్ బరిలో 1000 కోట్లు కొల్లగొట్టడం ఈజీ!
Also Read : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
సల్మాన్ ఖాన్ అభిమానులు సైతం 'టైగర్ 3'తో థౌజండ్ వాలా పేలడం ఖాయమని చెబుతున్నారు. లేటెస్టుగా విడుదలైన 'టైగర్ 3' టీజర్ వాళ్ళకు బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.
Also Read : 'స్కంద' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - రామ్, బోయపాటి ముందున్న టార్గెట్ ఎంతంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial