కుటుంబ విలువలతో కూడిన కమర్షియల్ సినిమాలు ప్రేక్షకులకు అందించడంలో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) స్పెషలిస్ట్. భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఫ్యామిలీ బాండింగ్ సన్నివేశాలకు ఆయన సినిమాలు పెట్టింది పేరు. యంగ్ & ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వం వహించిన సినిమా 'స్కంద' (Skanda Movie).
'స్కంద' గురువారం (సెప్టెంబర్ 28న) థియేటర్లలో విడుదల అవుతోంది. అంటే... మరికొన్ని గంటలో సినిమా ప్రేక్షకుల ముందు ఉంటుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. రామ్ మేకోవర్, బోయపాటి స్టైల్ కలిసి ప్రేక్షకుల్ని అట్ట్రాక్ట్ చేశాయి. మరి, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
ఆల్మోస్ట్ 50 కోట్లు టచ్ చేసిన 'స్కంద'!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'స్కంద' ప్రీ రిలీజ్ బిజినెస్ బావుంది. సుమారు 43 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. నైజాంలో 'స్కంద' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా సుమారు 14 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిసింది. ఆంధ్రా ఏరియాలు అన్నీ కలిపి రూ. 20 కోట్లు. సీడెడ్ రూ. 9 కోట్ల బిజినెస్ జరిగిందట. తెలుగులో టోటల్ రూ. 43 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది.
Also Read : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 3 కోట్లు కింద లెక్క కట్టినట్లు టాక్. ఈ రేటులో హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లేవని గుసగుస. హిందీ డిజిటల్, శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ చిత్రనిర్మాణంలో భాగస్వామి అయిన జీ స్టూడియోస్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 40 కోట్లకు ఆ రైట్స్ అన్నీ జీ గ్రూప్ తన దగ్గర ఉంచుకుంది. ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 2.20 కోట్లు వచ్చాయట. మొత్తం మీద 'స్కంద' సినిమాకు రూ. 49 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు అంచనా. అంటే ఆల్మోస్ట్ 50 కోట్లు చేసినట్లు! రామ్ సినిమాల్లో ఇది హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పుకోవాలి. థియేటర్లలో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఓ రెండు మూడు కోట్లు ఎక్కువ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
రామ్ రీసెంట్ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్?
రామ్ కెరీర్ చూస్తే... 'ఇస్మార్ట్ శంకర్' భారీ బ్లాక్ బస్టర్. ఆ సినిమాకు సుమారు రూ. 70 కోట్లు వచ్చాయి. అందువల్ల, 'స్కంద'కు సూపర్ హిట్ టాక్ వస్తే అంత కలెక్ట్ చేయడం కేక్ వాక్. రామ్ లాస్ట్ సినిమా 'ది వారియర్'కు రూ. 37 కోట్లు, అంతకు ముందు 'రెడ్' సినిమాకు రూ. 35 కోట్లు వచ్చాయి. 'స్కంద'తో పోలిస్తే ఆ రెండు సినిమాల బడ్జెట్ తక్కువ. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు ఆదరణ బావుంది. అందువల్ల, 'స్కంద' కమర్షియల్ పరంగా సక్సెస్ సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. రామ్ పోతినేని జోడీగా నటించిన శ్రీ లీలకు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం.
Also Read : '800' దర్శకుడికి ఓ కండిషన్ పెట్టిన ముత్తయ్య మురళీధరన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial