Prema entha madhuram september 27th: గుడిలో ఆర్య బాధపడడానికి గుర్తుతెచ్చుకుని బాధపడుతుంది అను. మరోవైపు అను పట్టీని పట్టుకుంటూ అను గురించి ఆలోచిస్తాడు ఆర్య.
ఆర్య: ఎన్ని రోజులు ఇలా నా నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నావు అను?
అను: ఇంకెన్ని రోజులు నాకోసం ఇలా వెతుకుతూ ఉంటారు సార్?
ఆర్య: నువ్వు ఒక అబద్ధాన్ని పట్టుకుని ఇంత చేస్తున్నావు అనే నిజం తెలిస్తే నువ్వే బాధపడతావు.
అను: మీరు నాకు జీవితాన్నిచ్చారు సర్. కానీ నేను మీకు బాధనే మిగిల్చాను.
ఆర్య: నువ్వు ఇచ్చిన ప్రేమైనా, బాధైనా నాకు అన్నీ ఇష్టమే అను. అని ఇద్దరు మనసులో మా అనుకుంటూ ఉంటారు. ఇంతలో జెండే ఆర్య దగ్గరికి వస్తాడు.
జెండే: ఏంటి ఆర్య అను గురించి ఆలోచిస్తున్నావా?
ఆర్య: ఆలోచించడం తప్పు చేయగలిగేదేముంది? పట్టుకుని ఇంటికి తీసుకురాలేను కదా.
జెండే: ఇలా వెతికితే ఇంక మనకి అను కనిపించదేమో ఆర్య, ప్లాన్ మార్చాలి.
ఆర్య: కొత్త దారిలో వెళ్లి అనుని బయటపడేలా చేయాలి జెండే. అవును ఈ టైంలో నా దగ్గరికి వచ్చావ్ ఏమైనా ఇంపార్టెంటా?
జెండే: అవును ఆర్య ఆ ఛాయాదేవి విశాల్ వర్మని మాయ చేసి తన దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుని ల్యాండ్ తనదే అని కోర్టులో ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం?
ఆర్య: ఏం చేయొద్దు జెండే ఓడిపోయినట్టు నటించి లొంగి పోదాం. ఎందుకంటే వేటాడాలంటే వలవేస్తే సరిపోదు గింజలు కూడా ఉండాలి. ఛాయాదేవి ఉందన్న ధైర్యంతో మాన్సి ఉంది. నేనే గెలుస్తాను అని అను ధైర్యంగా ఉండి బయటకు రావడం లేదు. అదే నేను ఓడిపోతున్నాను అని తెలిస్తే అను భయపడి తాను బయటికి వస్తుంది.
Also Read: ఆర్య సహాయంతో ఉట్టిని కొట్టిన అక్కి - అనుని చూసిన ఆర్య!
జెండే: అవును ఆర్య నువ్వు చెప్పింది నిజమే. అయినా ఛాయాదేవిని మోసం చేయడం అంత తేలికేమి కాదు. తనకి అమెరికా లో చాలా బిజినెస్ లో ఉన్నాయి. అయినా తను ఒక్కత్తే ఇన్ని చేస్తుందంటే నాకు నమ్మాలి అనిపించడం లేదు. తన వెనుకను ఎవరో ఉన్నట్టున్నారు ఆర్య?
ఆర్య: తన వెనుకనే ఉన్నది ఎవరో కాదు జలంధర్. జలంధర్ చెల్లెలే ఛాయాదేవి. మదన్ ని చేతిలో పెట్టుకొని చాలా ఫ్యామిలీతో ఆడుకున్నారు. అందులో అంజలి ఫ్యామిలీ కూడా ఒకటి. జలంధర్ ఛాయాదేవిలు నన్ను శత్రుత్వంగా ఓడిద్దాం అనుకున్నారు అది అవ్వకపోయేసరికి ఇప్పుడు పెళ్లి పేరుతో సాధిద్దామనుకుంటుంది ఆ ఛాయాదేవి. లొంగినట్టే ఉందాం అనుని బయటకి రప్పిద్దాం. ఇంకో విషయం జెండే ఆ స్కూల్లో చదువుతున్న ఏ పిల్లలకి ఎటువంటి నష్టం రాకుండా చూసుకో అని చెప్పగా సరే అని చెప్పి జెండే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత రోజు కోర్టు వాళ్ళు వచ్చి ఆ స్కూల్ కి సీల్ వేస్తారు. బయట ఉన్న టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఏం జరిగింది అని అడుగుతారు.
లాయర్: ఈ స్కూల్ ఛాయాదేవి పేరు మీద ఉంది అని కోర్టు తీర్పు ఇచ్చింది. అందుకే ఇప్పుడు దీన్ని మూసివేస్తున్నాం. అను పిల్లలిద్దరూ కూడా అక్కడికి వస్తారు. లాయర్ మాటలు విన్న అను వెంటనే కోపంగా ఛాయాదేవికి ఫోన్ చేస్తుంది.
ఛాయాదేవి: ఏంటి అనురాధ ఫోన్ చేశారు?
Also Read: Trinayani September 27th: విషం మింగిన విశాలాక్షి - తిలోత్తమ కొత్త ప్లాన్ వర్కౌట్ అవుతుందా!
అను: అసలు నీకేమైనా బుద్ధుందా పిల్లలు చదువుతున్న స్కూల్ ని మూసి వేయడం ఏంటి? మర్యాదగా స్కూల్ని తెరిపించు పిల్లలు జీవితాలతో ఆడుకోవద్దు
మాన్సి: నీతులు చెప్తుంది నోట్ బుక్ లో రాసుకో
అను: పిచుకలు అందరు కలిసి వచ్చిన సరే ఇటు వైపు ఉన్నది సింహం తన గర్జనకి వణికిపోతారు మీరు. అలాంటిది తనతోనే పెట్టుకుంటున్నారు చూడండి ఎప్పటికైనా ఆర్య సార్ గెలిచి ఆ స్కూల్ ని మళ్ళీ ఓపెన్ చేపిస్తారు అప్పటివరకు వేచి చూడండి అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తుంది.
ఛాయాదేవి: తనకెంత పొగరు?
మాన్సి: భర్త మీద నమ్మకం అలాంటిది అని అంటుంది.
తర్వాత అక్కి ,అను దగ్గర ఫోన్ తీసుకొని ఆర్య కి ఫోన్ చేద్దామని ప్రయత్నిస్తుంది. మరోవైపు ఆర్య ఇంట్లో పేపర్ చదువుతూ ఉండగా జెండే వచ్చి స్కూల్ విషయం చెప్తాడు.
నీరజ్: వాట్ స్కూల్ ని మూత వేయడమేంటి?
అంజలి: అదేంటి సార్ ఇప్పటివరకు పిల్లల కోసం మీరు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది అని అంటుంది.
ఇంతలో అక్కి ఆర్య కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది.
ఆర్య: నువ్వేం బాధపడొద్దు అమ్మా ఆ స్కూల్ కి ఏమి కాదు నీకు ఆ స్కూల్ ని తిరిగి క్షేమంగా ఇప్పిస్తాను
అక్కి: అయితే ఫ్రెండ్ రేపటి నుంచి మేము స్కూల్ కి వెళ్ళిపోవచ్చా. సరే ఈ విషయం నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అక్కి.
ఆర్య: స్కూల్ కి ఏమి కాదు కంగారు పడొద్దు అయినా మేము ఒక ప్లాన్ వేసాము అని చెప్పి జెండేతో ఛాయాదేవిని ఇంటికి రప్పించమని చెప్తాడు.
అంజలి: ఇప్పుడు తనని ఇంటికి రమ్మనడం ఎందుకు సార్?
నీరజ్: అవును దాదా ఇప్పుడు తను వస్తే పక్కన ఆ మాన్సి కూడా వస్తుంది ఇద్దరు డిస్గస్టింగ్ పీపుల్.
ఆర్య: నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరు కంగారు పడొద్దు, డు వాట్ ఐ సేమ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆర్య.
మరోవైపు ఛాయాదేవి ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది.
మాన్సి: ఫోన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు?
ఛాయాదేవి: స్కూల్ని మూసేశారన్న విషయం ఈపాటికి ఆర్యకి తెలిసే ఉంటుంది. అక్కడి నుంచి ఒక కాల్ ఎక్స్పర్ట్ చేస్తున్నాను. సమరానికైనా సందికైనా ఫోన్ చేస్తాడు కదా.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial