Trinayani September 27th Written Update: అసలు దీనంతటికీ కారణం విశాలాక్షి అని విక్రాంత్ తో సుమన అంటుంది.
విక్రాంత్: పాపం విశాలాక్షిని ఎందుకు అంటావే తను ముందే చెప్పింది వెళ్లొద్దు అని. నువ్వే కాదని బయలుదేరి ఇలా చేసుకున్నావు.
సుమన: ఆ విశాలాక్షి కావాలనే నా అందాన్ని పాడు చేయడానికి ఇంత పని చేసింది.
విక్రాంత్: పెళ్లికి ముందు ఒక ఆడదానికి అందం అంటే సోకులు అయ్యుండొచ్చు కానీ పెళ్లి తర్వాత అందమంటే ఆడదానికి నుదిట మీద పెట్టిన బొట్టు, మెడకు తాలి బొట్టు, అన్నం పెట్టే మంచితనం మాత్రమే.
సుమన: మీరు ఎన్నైనా చెప్పండి ఆ విశాలాక్షి కావాలనే ఇలా చేసింది. అక్కని బావగారిని అమ్మానాన్న అని వలలో వేసుకుంది ఇలాగా అవసరమైనప్పుడల్లా అందరితో ఆడుకుంటుంది.
విక్రాంత్: ఏమాత్రం కూడా చలనం లేకుండా ఎలా మాట్లాడుతున్నావో. వెళ్లి ఆ పాపని ఏడుపు ఆపు అప్పుడేనా నీ మనసు కరిగి మనిషివి అని గుర్తించుకుంటావు. అలాగే ఇంకెప్పుడూ అద్దంలో మొఖం చూసుకోవద్దు దిష్టిబొమ్మని ఎన్నిసార్లు చూసినా అదే మొఖం కనిపిస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్.
Also Read: సలహా వినకుండా సమస్యలో చిక్కుకున్న సుమన, కౌంటర్ ఇచ్చిన విక్రాంత్!
ఆ తర్వాత సీన్లో తిలోత్తమ చేతులు నొప్పెడుతున్నాయి అని మంచం మీద పడుకుంటుంది. తను కళ్ళు మూసుకున్న సమయంలో హాసిని అక్కడికి వచ్చి ముఖం మీద కుంకుమ నీళ్లు జల్లి వెళ్లిపోతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన వల్లభ ఆ ఎరుపు ముఖాన్ని చూసి గట్టిగా అరుస్తాడు
వల్లభ: దెయ్యం!! దెయ్యం!!
తిలోత్తమ: ఏమైందిరా అలా అరుస్తున్నావ్?
వల్లభ: మమ్మీ నువ్వా దెయ్యం అనుకొని భయపడ్డాను. నీ మొఖమంతా ఏదోలా ఉంది మమ్మీ అని అంటాడు. అప్పుడు తిలోత్తమ తన ముఖాన్ని తాకగా ఎరుపుగా ఉంటుంది. ఇంతలో హాసిని అక్కడికి వస్తుంది.
హాసిని: నా మొగుడు భయపడ్డాడు నా మొగుడు భయపడ్డాడు అని నవ్వుకుంటూ కుంకుమనీళ్లు అత్తయ్య కంగారు పడొద్దు విశాలాక్షి చెప్పింది కదా అందుకే జల్లాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సీన్లో కుటుంబ సభ్యులందరూ హాల్లో ఉండగా విశాలాక్షి కూడా అక్కడ ఉంటుంది.
పవనమూర్తి: విశాలాక్షి నువ్వు ఎంతసేపు ఉన్నా సంధ్య వేళ కన్నా ముందు వెళ్లిపో.
విశాలాక్షి: పామును చూసి భయపడతాం అనుకుంటున్నావా తాత?
పవనమూర్తి: అదేంటమ్మా ఒకేసారి తాత అనేసావు అని అనగా అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు.
మరోవైపు దురంధర పాయసం చేస్తూ ఉండగా అక్కడికి తిలోత్తమ, వల్లభలు వస్తారు. వల్లభ దురంధరిని మాటల్లో పెట్టగా వెనక నుండి తిలోత్తమా ఒక పాయసం కప్పులో విషం వేస్తుంది. దాని తర్వాత దురంధర హాల్లోకి వచ్చి ఆ పాయసాన్ని అందరికీ ఇస్తుంది.
Also Read: మురారితో తాళి కట్టించుకుంటానన్న ముకుంద - కృష్ణ ఏం చేయబోతోంది!
వల్లభ: మా అత్త పాయసం చేసింది అంటే అది చాలా బాగుంటుంది.
తిలోత్తమ: మళ్లీ అతిథిదేవోభవ అని నయనీ తిడుతుంది ముందు విశాలాక్షిని పాయసం తినమనండి.
విశాలాక్షి: తింటాను కాని దానికి అర నిమిషం కావాలి అని చెప్పి సుమన చీర కొంగున ఉన్న ముడిని తీస్తుంది.
హాసిని: అదేం ముడి చిట్టి?అందులో ఏముంది?
Also Read: అమ్మ కావాలంటూ రిషి కన్నీళ్లు, దేవయానికి షాక్ ఇచ్చిన ధరణి - శైలేంద్ర విశ్వరూపం
సుమన: తెలీదు అక్క. ఈ మూడింటిని నేను పెట్టలేదు అని అనగా ఇంతలో విశాలాక్షి ఆ ముడిలో నుంచి ఒక పాము బొమ్మ ఉన్న గొలుసుని తీస్తుంది.
తిలోత్తమా: అయినా తన కొంగులో గొలుసు ఉన్నట్టు నీకెలా తెలుసు విశాలాక్షి?
నయని: ఆ గొలుసుని పాప కోసం నువ్వు కొన్నావా చెల్లి?
సుమన: కొంగులో ఏమున్నదో నాకు తెలీదు గొలుసు నేనెందుకు కొంటాను.
విశాలాక్షి: నైరుతి వైపు బరువుందేంటి అనుకున్నాను చూసేసరికి వాసుకి ఉన్నాడు.
పవనుమూర్తి: వాసుకి ఎవడు?
విశాలాక్షి: ఆ త్రినాథుడు విషాన్ని మింగుతున్నప్పుడు ఒక సర్పము మెడకి చుట్టుకొని విషాన్ని కంఠంలో ఆపింది. అదే వాసుకి. సుమన ఇది నేను వేసుకుంటాను మళ్లీ తిరిగి నీకు ఇచ్చేస్తాను అని చెప్పి తన మెడలో వేసుకుంటుంది.
నయని: ఎంత కలగా ఉన్నాదో
సుమన: అంత పొగిడేయోద్దు. నా కొంగులో ఉన్నది కనుక ఆభరణం నాదే అవుతుంది. బావున్నావు కదా అని ఉంచేసుకోవద్దు.
విశాలాక్షి: చెప్పాను కదా సుమన తిరిగి నీకు ఇచ్చేస్తాను అని
తిలోత్తమ: పాయసం చల్లారిపోతుంది తిను. నువ్వు తింటేనే మేము అందరం తినాలి కదా అని అనగా విశాలాక్షి ఆ పాయసాన్ని తింటుంది.
విశాల్: ఎలా ఉంది?
విశాలాక్షి: స్వర్గంలా ఉంది నాన్న.
తిలోత్తమ: తాగిన తర్వాత వెళ్లాల్సింది అక్కడికేగా అని మనసులో అనుకుంటుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial