Shaakuntalam : గుణ శేఖర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టా్త్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకున్న సమంత లేటెస్ట్ చిత్రం 'శాకుంతలం'. భారీ అంచనాల మధ్య 2డీ, 3డీలోనూ రిలీజ్ అయిన ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్, డీకే ఈ మూవీపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ మూవీ సమంత షో అని, ఈ మూవీని సమంత తన భుజాలపై వేసుకుని నిలబెట్టిందంటూ వ్యాఖ్యానించారు.


కాళిదాసు రచించిన పౌరాణిక ప్రేమకథ ఆధారంగా గుణ శేఖర్ తెరకెక్కించిన దృశ్యకావ్యం 'శాకుంతలం' సినిమా రిలీజైంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న సమంత ఫ్యాన్స్ కల నిజమైంది. ‘యశోద’ సినిమాతో హిట్ ను మూటగట్టుకున్న సమంత 'శాకుంతలం' సినిమాతో అందర్నీ మరో లోకంలోకి తీసుకెళ్లింది. భారీ బడ్జెట్ తో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ మూవీపై తాజాగా ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్, డీకే తమ రివ్యూను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “మ్యాజికల్ విజువల్స్, అద్భుతమైన కథనం... అన్నింటిన మించి ఇది సమంత షో! కాళిదాసు కళాఖండాన్నిఇంతకంటే గొప్పగా ఎవరూ చూపించలేరు. సమంత తన భుజాలపై ఈ సినిమాను నిలబెట్టింది. మొత్తం టీమ్‌కి మా ధన్యవాదాలు! ఈ సినిమాను తప్పక చూడండి” అంటూ రాసుకొచ్చారు.


'శాకుంతలం' సినిమాను చూసిన వీరు.. మూవీపై తమ అభిప్రాయంతో పాటు సమంత గురించి చేసిన మరో ట్వీట్ సైతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. గత కొన్ని నెలలుగా సమంత ఎంత బాధలో ఉన్నారో అందరికీ తెలుసని, అయినా ఇంత అద్భుతాన్ని మన ముందు ఉంచడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇలా ఆమె తన జీవితంలో అనేక సవాళ్లను అధిగమిస్తూ మరింత బలంగా ఉండాలని, దానికి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. 


ఇక అమెజాన్ లో బ్లాక్ బస్టర్ అయిన ది 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో సమంత తన బాడీ లాంగ్వేజ్ ను పాత్రకు తగ్గట్టుగా మలచుకొని, యాక్షన్ సీన్స్ లో పండించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వచ్చిన యశోదలోనూ సమంత హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫైట్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.


Also Read: 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?


అంతకుముందు 'శాకుంతలం' సినిమాపై ధీమాను వ్యక్తం చేసిన సామ్.. ఫస్ట్ టైమ్ స్పెషల్ షో చూసినప్పుడు చాలా భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా పోస్ట్ చేస్తూ.. " చివరికి ఈరోజు సినిమా చూశాను! గుణశేఖర్ గారూ.. నా హృదయం మీలోనే ఉంది. ఇది ఎంత అందమైన సినిమా! మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన శాకుంతలంను స్క్రీన్‌పై అద్భుతంగా మలిచారు. ఈ చిత్రాన్ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ అనుభవించే ఎమోషన్స్ కళ్లారా చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాను. పిల్లలందరికీ ఈ మాయా ప్రపంచం బాగా నచ్చుతుంది. దిల్ రాజు గారు, నీలిమ.. ఈ అద్భుతమైన జర్నీకి ధన్యవాదాలు. ‘శాకుంతలం’ నా హృదయానికి దగ్గరైన ఓ చిత్రం" అంటూ ఎమోషనల్ పోస్ట్ అప్పట్లో వైరల్ గా మారింది.



Read Also: సల్మాన్‌తో డేటింగ్ రూమర్స్ పై పూజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్