యువ కథానాయకుడు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) శుక్రవారం కాణిపాకంలో సందడి చేశారు. వినాయక స్వామి ఆలయానికి వెళ్లి గణపతి ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం ఆయన తిరుపతిలో సందడి చేయనున్నారు. 


రెండో పాట రెడీ 'బ్రో'
మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సముద్రఖని రచయిత, దర్శకుడు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మొదటి పాట 'మై డియర్ మార్కండేయ'ను ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యారు. 



'బ్రో' సినిమాలో రెండో పాట 'జాణవులే...' (Jaanavule Song)ను శుక్రవారం ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్, తిరుపతిలో అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఆ పాట (Bro The Avatar Second Song) విడుదలకు ముందు కాణిపాకం వినాయక స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పాటను సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ మీద తెరకెక్కించారు.


Also Read : బేబీ - విజయ్ దేవరకొండకు దూరంగా రష్మిక!






''కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో... 
యమా యమా బీట్స్ బ్రో... 
జిందగీనే జూకు బాక్స్ బ్రో...


రచ్చో రచ్చ రాక్స్ బ్రో... 
మజా పిచ్చ పీక్స్ బ్రో...
మనల్ని ఆపే మగాడు ఎవడు బ్రో'' 
అంటూ 'బ్రో' సినిమాలో మొదటి పాట 'మై డియర్  మార్కండేయ' సాగింది. తమన్ సంగీతంలో రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రేవంత్, సింగధ శర్మ పాడారు. ఈ పాటలోనే  బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. అందులో మామా అల్లుళ్ళతో కలిసి ఆవిడ స్టెప్పులు వేశారు.  


Also Read 'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల? లేడీ అర్జున్ రెడ్డి అనే సినిమానా?


ఆ అమ్మాయి ఎవరు బ్రో?
'బ్రో' టీజర్ చూశారా? అందులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే కాదు... ఓ హీరోయిన్ కూడా ఉన్నారు! సరిగ్గా 65 సెకన్ల దగ్గర పాజ్ బటన్ నొక్కి చూడండి. సాయి ధరమ్ తేజ్ ఎందుకో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఆయన వెనుక చేతులు కట్టుకుని ఓ అమ్మాయి నిలబడింది. ఆమె ఎవరో తెలుసా? ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier). 'బ్రో'లో రొమాంటిక్ భామ కేతికా శర్మ కూడా ఉన్నారు.


'బ్రో' సినిమాలో సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను, యువ లక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, పోరాటాలు : సెల్వ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం :  ఎస్.ఎస్. థమన్,  సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల,  నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & జీ స్టూడియోస్, నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, కథనం & మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్, రచన & దర్శకత్వం : పి. సముద్రఖని. 









ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial