రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతోందని సోషల్ మీడియా టాక్. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని సినిమా ఇండస్ట్రీ జనాలు చాలా మంది ఫీలింగ్. అయితే... తాము ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. కానీ, కొన్నిసార్లు హాలిడే టూర్లకు వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్టుల్లో కెమెరా కంటికి చిక్కారు.
విజయ్ దేవరకొండతో రాశీ ఖన్నా...
దూరం దూరంగా రష్మికా మందన్నా!
విజయ్ దేవరకొండ, రష్మిక జోడీకి అభిమానులు ఉన్నారు. అయితే... గురువారం రాత్రి ఈ జోడీ అభిమానులకు షాక్ ఇచ్చింది. కలివిడిగా కాకుండా విడివిడిగా కనిపించారు. అసలు వివరాల్లోకి వెళితే...
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'బేబీ' సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. గురువారం రాత్రి ప్రసాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో వేసిన స్పెషల్ ప్రీమియర్ షోకి రష్మిక వచ్చారు. అయితే... విజయ్ దేవరకొండతో ఆమె కనిపించలేదు. రౌడీ బాయ్ పక్కన అతనితో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటించిన రాశీ ఖన్నా కనిపించారు.
Also Read : 'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల? లేడీ అర్జున్ రెడ్డి అనే సినిమానా?
విజయ్ దేవరకొండ, రష్మిక... ఇద్దరూ 'బేబీ' ప్రీమియర్ షోకి వచ్చినప్పటికీ, కెమెరా కంట జంటగా కనబడకుండా జాగ్రత్త పడ్డారు. వేర్వేరుగా కనిపించారు. 'బేబీ' టీమ్ కూడా విజయ్, రాశీ సందడి చేసిన ఫోటోలను విడుదల చేసింది. ఎందుకో మరి?
Also Read : 'మహావీరుడు' రివ్యూ : రాజకీయ నేపథ్యంలో తీసిన కామెడీ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
దేవరకొండ కుటుంబంలో అమ్మాయి - రష్మికపై ఆనంద్!
'బేబీ' సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సంబంధం ఏమిటి? ఆవిడ మీకు ఏమవుతారు? అని ఆనంద్ దేవరకొండకు ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడు అతడు ఏం చెప్పారంటే... ''విజయ్, రష్మిక రెండు సినిమాల్లో నటించించారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. మా కుంటుంబంలో రష్మిక ఒక సభ్యురాలిగా కలిసిపోయింది. మేం బెంగళూరులో ఉన్నప్పుడు మా ఫ్యామిలీతో పాటు కొన్ని రోజులు గడిపింది. షూటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా కుటుంబంతో కలుస్తూ ఉంటుంది'' అని! తమ కుటుంబంలో ఓ అమ్మాయి అని రష్మిక గురించి ఆనంద్ దేవరకొండ చెప్పారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వదిన... వదిన... అంటూ ఒక్కటే అరుపులు!
ఆనంద్ దేవరకొండ కోసం 'బేబీ' ప్రచార కార్యక్రమాలకు రష్మిక వచ్చారు. సినిమాలో ఓ పాటను విడుదల చేశారు కూడా! ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో విజయ్ దేవరకొండ అభిమానులు 'వదిన వదిన' అంటూ ఒక్కటే అరుపులు. వాళ్ళను వద్దని పెద్దగా ఎవరూ వారించలేదు. కానీ, వాళ్ళు అరిచినప్పుడు రష్మిక పెద్దగా స్పందించలేదు. ముసిముసి నవ్వులు నవ్వారు.
రెండు సినిమాల్లో నటించిన విజయ్, రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారి 'గీత గోవిందం' సినిమాలో నటించారు. అది బ్లాక్ బస్టర్. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' కూడా చేశారు. ఆ సినిమాలు చేసే క్రమంలో ప్రేమలో పడినట్టు టాక్.
ఇప్పుడు విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. అందులో సమంత హీరోయిన్. 'గీత గోవిందం' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. అల్లు అర్జున్ జోడిగా 'పుష్ప 2'తో పాటు తెలుగు - తమిళ సినిమా 'రెయిన్ బో', హిందీలో మరో రెండు సినిమాలు రష్మిక చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial