కుటుంబ నేపథ్యంలో కథలు చేయడంలో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) స్పెషలిస్ట్. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత తండ్రి పాత్రల్లో ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసుకున్నాయి. అటువంటి మరో మంచి కథ, సినిమాతో రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ చిత్రమే 'సఃకుటుంబానాం'. మహాదేవ గౌడ నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.


రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా...
'సఃకుటుంబానాం' సినిమా ద్వారా రామ్ కిరణ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆయన సరసన మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తున్నారు. హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై మహాదేవ గౌడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఉదయ్ శర్మ రచయిత, దర్శకుడు.


ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా నిర్మాత మహాదేవ గౌడ్ మాట్లాడుతూ... ''అచ్చమైన తెలుగింటి టైటిల్ పెట్టారని చాలా మంది  మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. రేషన్ కార్డులా ఫస్ట్ లుక్ డిజైన్ చేయడం బావుందని చెబుతున్నారంతా. క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రాజశ్రీ నాయర్, 'శుభలేఖ' సుధాకర్... మంచి కాంబినేషన్ సెట్ అయ్యింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు మా 'సఃకుటుంబానాం' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది'' అని చెప్పారు.


Also Read: శర్వానంద్ 38వ సినిమా ఫిక్స్ - డిఫరెంట్ ఫిల్మ్ మేకర్‌ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్!?



దర్శకుడు ఉదయ్ శర్మ మాట్లాడుతూ... ''ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ బావుందని అందరూ చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ రెస్పాన్స్ మాకు బలం ఇచ్చింది. మణిశర్మ గారి సంగీతం మా చిత్రానికి అసెట్. కంటెంట్ మీద నమ్మకంతో మాకు ఎంతో మద్దతు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇంత మంది ఆర్టిస్టుల కాంబినేషన్‌లో సినిమా ఏదీ రాలేదు. కంటెంట్ ఉన్న మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని గతంలో రుజువైంది. మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సినిమాలోని సీనియర్ ఆర్టిస్టుల నటన గురించి మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాత మహాదేవ గౌడ్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ... షెడ్యూల్ ఉందనగానే సపోర్ట్ చేసేవారు. ఆయన చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. మా చిత్రాన్ని, ఈ నిర్మాణ సంస్థను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.


Also Readప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో విరాట్ రాజ్... గణేష్ మాస్టర్ డైరెక్షన్ డెబ్యూ



Sahkutumbanaam movie cast and crew: రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారి. ఇంకా బ్రహ్మానందం, సత్య, 'శుభలేఖ' సుధాకర్, రాజశ్రీ నాయర్, 'రచ్చ' రవి, గిరిధర్, 'తాగుబోతు' రమేష్, భద్రం ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి పోరాటాలు: అంజి - కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రోహిత్ కుమార్ పద్మనాభ, కళా దర్శకత్వం: పీఎస్ వర్మ, కూర్పు: శశాంక్ మలి, నృత్య దర్శకత్వం: చిన్ని ప్రకాష్ - భాను - విజయ్ పొలాకి, సాహిత్యం: అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: మధు దాసరి, సంగీతం: మణి శర్మ, నిర్మాణం: హెచ్ మహదేవ గౌడ్, రచన - దర్శకత్వం: ఉదయ్ శర్మ.