Goud Saab Movie Launch: కృష్ణం రాజు నట వారసుడిగా ఆయన సోదరుని కుమారుడు ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. పెదనాన్న పేరు నిలబెట్టారు. ఆ మాటకు వస్తే... పాన్ ఇండియా / పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లి మన టాలీవుడ్ గర్వపడేలా చేశారు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా...
కృష్ణం రాజు బంధువు, ప్రభాస్ (Prabhas Cousin)కు వరుసకు కజిన్ అయ్యే విరాట్ రాజ్ హీరోగా మంగళవారం హైదరాబాద్ సిటీలో పూజా కార్యక్రమాలతో ఓ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ (Ganesh Master Choreographer) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టైటిల్ 'గౌడ్ సాబ్' (Goud Saab Movie).
'గౌడ్ సాబ్' చిత్రాన్ని మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలిమ్స్ పతాకంపై 'ఎస్ఆర్ కళ్యాణ పండపం' రాజు, కల్వకోట వెంకట రమణ, కటారి సాయి కృష్ణ కార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకుడు, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. 'గౌడ్ సాబ్' టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరిగింది.
Also Read: లవ్ గురు ఓటీటీ రిలీజ్... ఆ రెండు వేదికల్లో రానున్న విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి సినిమా
'గౌడ్ సాబ్' సినిమా గురించి సుకుమార్ మాట్లాడుతూ... ''నాకు గణేష్ మాస్టర్ స్టోరీ లైన్ చెప్పారు. బాగా నచ్చింది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్,సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. 'గౌడ్ సాబ్'లో వినోదంతో పాటు మంచి ప్రేమకథ కూడా ఉందని గణేష్ మాస్టర్ తెలిపారు. ఇందులో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?
విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు గణేష్ మాస్టర్ రైటర్ & డైరెక్టర్. ఇంకా ఈ చిత్రానికి కూర్పు: ఛోటా కె ప్రసాద్, క్రియేటివ్ హెడ్: భాను మాస్టర్, కళా దర్శకత్వం: 'బేబీ' సురేష్ భీమగాని, కొరియోగ్రఫీ: పృథ్వీ రాజ్, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎ మహాదేవ, కాస్ట్యూమ్స్: రోహిణి దుబికుల, ఛాయాగ్రహణం: ఆర్ఎం స్వామి, సంగీతం: వెంగీ, నిర్మాతలు: 'ఎస్ఆర్ కళ్యాణ పండపం' రాజు, కల్వకోట వెంకట రమణ, కటారి సాయి కృష్ణ కార్తీక్.
Also Read: అయ్యయ్యో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్... 'బడే మియా చోటే మియా'తో పరువు అంతా పోయింది కదయ్యా