ప్రీమియర్ షోస్ వెయ్యడం లేటెస్ట్ ట్రెండ్. టాలీవుడ్‌లో రీసెంట్ టైమ్స్‌లో స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలకూ ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. మలయాళ బ్లాక్ బస్టర్ 'మంజుమ్మెల్ బాయ్స్' ప్రీమియర్ షోస్ టికెట్స్ ఓపెన్ చెయ్యడం లేట్, హాట్ కేక్స్ అన్నట్టు అమ్ముడు అయ్యాయి. బాలీవుడ్‌లో ప్రీమియర్ షోస్ ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది. అయితే, ఆ షోస్ క్యాన్సిల్ చెయ్యడం అన్నది రేర్. స్టార్ హీరోల సినిమాలకు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. టికెట్స్ ఓపెన్ చేసిన క్షణాల్లో షోస్ ఫుల్ అవుతాయి. అయితే, 'బడే మియా చోటే మియా' (Bade Miyan Chote Miyan Movie) విషయంలో కంప్లీట్ రివర్స్ ట్రెండ్ కనిపించడంతో షోస్ క్యాన్సిల్ చేశారని బాలీవుడ్ గుసగుస.
ఏప్రిల్ 10న నో షోస్... ఏప్రిల్ 11న విడుదల
బాలీవుడ్ ఖిలాడీ కుమార్ అక్షయ్ (Akshay Kumar), యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) హీరోలుగా నటించిన సినిమా 'బడే మియా చోటే మియా'. ఈ వారం హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. తొలుత ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం నుంచి స్పెషల్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే, ఏప్రిల్ 10 నుంచి రిలీజ్ డేట్ 11కు షిఫ్ట్ చేశారు.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?
రంజాన్ సందర్భంగా 'బడే మియా చోటే మియా' సినిమాను విడుదల చేయాలనేది తమ ప్లాన్ అని, అయితే ఇండియాలో రంజాన్ ఏప్రిల్ 11న వస్తుంది కనుక ఆ రోజు విడుదల చేస్తున్నామని హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ చెప్పారు. అందులో నిజం లేదని, అసలు మ్యాటర్ వేరనేది ట్రేడ్ వర్గాల టాక్.
Also Read: ఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?
'బడే మియా చోటే మియా' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఆడియన్స్ నుంచి మినిమమ్ రెస్పాన్స్ కూడా రాలేదని, షోస్ హౌస్ ఫుల్ కాకపోవడంతో షోస్ క్యాన్సిల్ చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్షయ్ కుమార్ రీసెంట్ మూవీస్ ఒక్కటి కూడా సరైన విజయం సాధించలేదు. అటు టైగర్ ష్రాఫ్ మూవీస్ అంతంత మాత్రంగా ఆడుతున్నాయి. దాంతో ఆడియన్స్ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రిలీజుకు ముందు 'బడే మియా చోటే మియా' ఫ్లాప్ అయ్యిందని కామెంట్స్ సైతం వినబడుతున్నాయి.
Also Read: నాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!
'బడే మియా ఛోటే మియా'ను పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థలతో వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, రకుల్ భర్త జాకీ భగ్నానీ ప్రొడ్యూస్ చేశారు. సల్మాన్ ఖాన్ 'సుల్తాన్', 'టైగర్ జిందా హై', 'భారత్' సినిమాలు తీసిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. అక్షయ్ సరసన మానుషీ చిల్లర్, టైగర్ జోడీగా ఆలయ ఫార్ట్యూన్ వాలా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా కీలక తారాగణం. మరి, ఏప్రిల్ 11న థియేటర్లలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.