Urvashi Rautela Trekked 46 Kms for Rishabh Pant : బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా.. కోట్లాది మంది అభిమానులు ఈమెకి. సినిమాల్లో న‌టించినా? న‌టించ‌క‌పోయినా? ఆమెను అభిమానించేవాళ్లు ఎంతోమంది. ఇక ఎప్పుడూ ఏదో ఒక విష‌యంలో వార్త‌ల్లో నిలుస్తారు ఈమె. ఈ మ‌ధ్యే మూడు కోట్ల రూపాయ‌ల విలువ చేసే బంగారు కేక్ క‌ట్ చేసి ఫేమ‌స్ అయితే.. ఇప్పుడిక ప్ర‌త్యేక పూజ‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. ఆ పూజ‌లు ఆమె కోసం కాద‌ట‌.. రిష‌బ్ పంత్ కోసం అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. యాక్సిడెంట్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌.. రిష‌బ్ పంత్ ఇప్పుడు ఐపీఎల్ లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇదంతా ఊర్వ‌శి రౌతెలా పూజ‌ల ఫ‌లిత‌మే అంటూ కామెంట్లు పెడుతున్నారు కొంత‌మంది. 


ఢిల్లీ క్యాప్టెన్ గా స‌క్సెస్.. 


ప్ర‌స్తుతం ఐపీఎల్ మేనియా న‌డుస్తోంది. త‌మ త‌మ అభిమాన జ‌ట్లు గెల‌వాల‌ని క్రికెట్ ల‌వ‌ర్స్ అంద‌రూ తెగ కోరుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుతం ఫామ్ లో ఉన్న జ‌ట్టు.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ఆ త‌ర్వాత రిష‌బ్ పంత్ కెప్టెన్ గా ఉన్న జ‌ట్టు ఢిల్లీ క్యాపిటెల్స్. యాక్సిడెంట్ అయిన‌ప్ప‌టికీ మంచి కంబ్యాక్ ఇచ్చాడు రిష‌బ్ పంత్. వికెట్ కీప‌ర్, బ్యాట్స్ మెన్ గా త‌న‌దైన శైలీలో రానిస్తున్నాడు. దీంతో.. అదంతా ఊర్వ‌శి రౌతెల పూజ‌ల ఫ‌లిత‌మే అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


46 కిలోమీట‌ర్లు, చెప్పులు లేకుండా న‌డ‌క‌.. 


ఊర్వ‌శి రౌతెల ఈ మ‌ధ్య సీర్సా లోని తారాబాబా కుటియా సంద‌ర్శించారు. అక్క‌డ ఉన్న అతిపెద్ద శివుని విగ్ర‌హాన్నికి ఆమె ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అక్క‌డికి చేరుకునేందుకు ఊర్వ‌శి.. కాళ్ల‌కు చెప్పులు లేకుండా.. 46 కిలోమీట‌ర్ల పాటు న‌డిచార‌ట‌. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అయితే, గ‌త కొద్ది రోజులుగా రిష‌బ్ పంత్, ఊర్వ‌శి రౌతెల ఇద్ద‌రూ రిలేష‌న్ షిప్ లో ఉన్నార‌నే వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఆమె ద‌ర్శ‌నం చేసుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేసింది రిష‌బ్ కోస‌మే అని, అందుకే రిష‌బ్ బాగా ఆడుతున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్త‌ల‌పై అటు ఊర్వ‌శి ఇటు రిష‌బ్ ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. 


రోడ్డు ప్ర‌మాదంలో గాయాలు


డిసెంబ‌ర్ 2022లో ఉత్త‌రాఖండ్‌లోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ తీవ్రంగా గాయపడిన విష‌యం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో రిషబ్‌కు గాయాలు అయ్యాయి. ఆ త‌ర్వాత రిష‌బ్ కి ఎన్నో స‌ర్జ‌రీలు జ‌రిగాయి. ఈ ప్ర‌మాదం వ‌ల్ల వ‌ర‌ల్డ్ క‌ప్‌కు దూరం అయ్యాడు రిష‌బ్. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో త‌న‌దైన శైలీలో పెర్ఫామ్ చేస్తున్నాడు. కెప్టెన్ గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఊర్వ‌శి రౌతెలా.. పంత్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌రోక్షంగా పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. ఆమె పంత్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయడం, దానికి రిషబ్ కూడా స్పందించడం లాంటివి అప్పట్లో జరిగాయి. అయితే, ఇప్పుడు మాత్రం వాళ్లిద్ద‌రూ సీక్రెట్ రిలేష‌న్ షిప్‌లో ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. 


Also Read: ఇక నుంచి పొలిటికల్ సినిమాలు తియ్య‌ను - ఆర్జీవి సంచ‌ల‌నం నిర్ణ‌యం